Diabetes : షుగర్ ఒక్కసారి వస్తే తగ్గదు అనేది అపోహ మాత్రమే.. ఈ చిట్కాలు పాటిస్తే.. షుగర్ ఉండమన్నా మీ ఒంట్లో ఉండదు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Diabetes : షుగర్ ఒక్కసారి వస్తే తగ్గదు అనేది అపోహ మాత్రమే.. ఈ చిట్కాలు పాటిస్తే.. షుగర్ ఉండమన్నా మీ ఒంట్లో ఉండదు

 Authored By jagadesh | The Telugu News | Updated on :16 March 2021,9:30 pm

Diabetes : డయాబెటిస్ అంటే షుగర్. ప్రస్తుతం ఎక్కడ చూసినా షుగరే. ప్రస్తుతం ఎక్కువ మందిని వేధిస్తున్న వ్యాధి షుగర్. ప్రతి 10 మందిలో ఏడెనిమిది మందికి షుగర్ వస్తోంది. ఇక.. ఒక్కసారి షుగర్ వస్తే చాలు.. జీవితాంతం షుగర్ ను ఎదుర్కోవాల్సిందేనా. జీవితాంతం టాబ్లెట్లు వాడాల్సిందేనా. లేదా.. జీవితాంతం ఇంజెక్షన్లు వేసుకోవాల్సిందేనా. షుగర్ ను సహజంగా తగ్గించుకోలేమా? సహజంగా తగ్గించుకునే పద్ధతులే లేవా?

how to control diabetes with natural food

how to control diabetes with natural food

నిజానికి షుగర్ లో రెండు రకాలు ఉంటాయి. ఒకటి టైప్ 1 డయాబెటిస్, రెండోది.. టైప్ 2 డయాబెటిస్. టైప్ 1 డయాబెటిస్ వస్తే మాత్రం నిజంగా తగ్గదు. దాని కోసం జీవితాంతం ట్యాబ్లెట్లు వాడాల్సిందే. ఇది ఎక్కువగా వంశపారపర్యంగా, పిల్లలకు వస్తుంటుంది. టైప్ 1 డయాబెటిస్ అంటే.. శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి పూర్తిగా తగ్గిపోవడం వల్ల వచ్చే వ్యాధి. ఇన్సులిన్ ఉత్పత్తి కాదు కాబట్టి.. ప్రతి రోజు ఇన్సులిన్ కోసం ట్యాబ్లెట్లు కానీ.. ఇంకా వేరే పద్ధతులు కానీ వాడాల్సి ఉంటుంది.అదే టైప్ 2 డయాబెటిస్ అంటే.. ఇన్సులిన్ ఉత్పత్తిని ఆపేయడం వల్ల వచ్చే వ్యాధి. దీన్ని సహజ పద్ధతుల్లో నివారించుకోవచ్చు. ఇన్సులిన్ ఉత్పత్తి జరిగేలా చూసుకుంటే టైప్ 2 డయాబెటిస్ ను తరిమికొట్టొచ్చు.

Diabetes : టైప్ 2 డయాబెటిస్ ను ఎలా తగ్గించుకోవాలి?

diabetes

diabetes

ప్రకృతికి దగ్గరగా బతికితే.. ఎటువంటి రోగాలు రావు. అంటే.. ప్రకృతే మనకు అమ్మ లాంటిది. ప్రకృతికి దూరంగా వెళ్తే.. రోగాలు కూడా పెరుగుతుంటాయి. అందుకే.. ప్రకృతి ఇచ్చే ఆహారాన్ని తీసుకొని.. ప్రకృతితో మమేకమై.. జీవన విధానాన్ని మార్చుకుంటే.. షుగర్ ను ఈజీగా తగ్గించుకోవచ్చు.దాని కోసం రోజూ ఓ రెండు జ్యూస్ లు తాగాలి. అందులో ఒకటి కొత్తిమీర, పూదీన, తులసి ఆకుల జ్యూస్. కొన్ని కొత్తిమీర, పూదీన, తులసి ఆకులను తీసుకొని.. వాటిని జ్యూస్ చేసి.. పిప్పి తీసేసి.. అందులో ఇంత నిమ్మకాయ రసం కలుపుకొని తాగాలి. షుగర్ ఉంది కాబట్టి.. కొంచెం వేసి వేయనంత తేనె వేసుకొని ప్రతి రోజు ఉదయం టిఫిన్ కంటే ముందు తాగాలి. కనీసం 15 రోజులు ఇలాగే తాగాలి. ఆ తర్వాత ఓ గంట గ్యాప్ ఇచ్చి ఏదైనా టిఫిన్ తింటే చాలు.

health tips Which food to be taken by diabetes patients

health tips: Which food to be taken by diabetes patients

మళ్లీ సాయంత్రం పూట మునగాకు జ్యూస్ తాగాలి. లేత మునగాకులను తీసుకొని కొన్ని నీళ్లు కలిపి మిక్సీ పట్టి.. వడకట్టి.. ఆ జ్యూస్ లో కాసింత నిమ్మకాయ పిండి.. కొంచెం తేనె కలుపుకొని తాగొచ్చు. సాయంత్రం పూట అన్నం తినడానికి ఓ గంట ముందు ఈ జ్యూస్ తాగాలి.ఇలా.. కనీసం 15 రోజుల పాటు కంటిన్యూగా ఈ రెండు జ్యూస్ లను ఉదయం, సాయంత్రం తాగితే.. షుగర్ లేవల్స్ కంట్రోల్ అవుతాయి. 15 రోజుల తర్వాత షుగర్ టెస్ట్ చేయించుకుంటే.. ఆ తేడా మీకే కనిపిస్తుంది. షుగర్ లేవల్స్ కంట్రోల్ లో ఉన్నా.. మునపటి కన్నా.. తగ్గినా.. వెంటనే మరో 15 రోజులు అదే డైట్ షీట్ ను ఫాలో అవ్వాలి. అలా కంటిన్యూగా.. కనీసం మూడు నుంచి నాలుగు నెలల పాటు.. ఆ డైట్ షీట్ ను ఫాలో అయితే.. మీ వంట్లో షుగర్ ఉండమన్నా ఉండదు.

ఇది కూడా చ‌ద‌వండి ==> రోజూ ఒక గ్లాస్ తిప్పతీగ జ్యూస్ తాగితే క‌లిగే అద్భుతమైన ప్ర‌యోజ‌నాలు..!

ఇది కూడా చ‌ద‌వండి ==> రావి చెట్టు ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు.. ఏటువంటి వ్యాధుల‌ను న‌యం చేస్తాయో తెలుసా..?

ఇది కూడా చ‌ద‌వండి ==> రోగ లక్షణాలే ఉండవు.. కానీ ఈ వ్యాధులు వస్తే జీవితం నాశనమే? అవేంటో తెలుసుకోండి..!

ఇది కూడా చ‌ద‌వండి ==> మీ జీర్ణవ్య‌వ‌స్థ ఆరోగ్యంగా ఉండాలంటే … రోజు ప‌ర‌గ‌డుపున ఇవి తాగండి…?

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది