Stomach Cancer : ముఖముపై ఈ లక్షణాలు కనిపిస్తే కడుపు క్యాన్సర్ ఉన్నట్లే…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Stomach Cancer : ముఖముపై ఈ లక్షణాలు కనిపిస్తే కడుపు క్యాన్సర్ ఉన్నట్లే…!

 Authored By prabhas | The Telugu News | Updated on :5 December 2022,7:00 am

Stomach Cancer : క్యాన్సర్ అనేది కొన్ని రకాలు ఉంటాయి. ఇప్పుడున్న జనరేషన్లో ఎక్కువగా ఆడవాళ్ళకి కడుపు క్యాన్సర్ రావడం మనం చూస్తూనే ఉన్నాం. కడుపు క్యాన్సర్ దీనిని గ్యాస్టిక్ క్యాన్సర్ అని కూడా అంటారు. కడుపులోని కణాలు ఆ సాధారణంగా ఎదిగినప్పుడు ఈ క్యాన్సర్ వస్తుంది. ఈ క్యాన్సర్ అనేది తీవ్రమైన అలాగే ప్రాణాంతక ఒక వ్యాధి. చాలా రకాల క్యాన్సర్లలో ఇది ఒకటి. దీనిని గ్యాస్టిక్ క్యాన్సర్ అని కూడా అంటారు. అంటే గ్యాస్ట్రో ఎస్ ఫాగియల్ జంక్షన్ క్యాన్సర్ బారిన పడే ప్రదేశం చాలా సందర్భాలలో క్యాన్సర్ ఎదుగుదల కడుపుస్ను ఉత్పత్తి చేసే కణాల నుంచి ప్రారంభమవుతుంది. ఈ క్యాన్సర్ తో చాలామంది చనిపోతున్నారు. ఈ క్యాన్సర్ సహజంగా ఎదగడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది.

వీటి లక్షణాలు గుర్తించలేం కడుపులో ఏ భాగం ప్రభావితమవుతుందని దానిపై ఆధారపడి లక్షణాలు మార్పులు చెందుతూ ఉంటాయి. ఇది మొదట ఏ లక్షణాలు కనిపించవు. ఇది వస్తే దాని లక్షణాలు మొదట చర్మం పై నోటిపై కనపడుతూ ఉంటాయి. గ్యాస్టిక్ క్యాన్సర్ కారణంగా చర్మం అది వచ్చే అవకాశం ఉంటుంది. దీని ప్రభావం శరీరమంతా కనబడుతూ ఉంటుంది ప్రధానంగా ముఖంపై స్పష్టంగా కనిపెట్టవచ్చు… ముఖం లేదా చర్మంపై దద్దుర్లు చర్మం పొట్టు వాపు లాంటి లక్షణాలను గుర్తించవచ్చు.. ఈ క్యాన్సర్ ఉంటే చర్మంపై ఈ లక్షణాలతో పాటు ఇంకొన్ని లక్షణాలు కూడా ఉంటాయి. ఆకస్మికంగా బరువు తగ్గడం, కడుపునొప్పి, ఆకలిని కోల్పోవడం, కడుపుబ్బరం, అజీర్తి, వికారం, వాంతులు, రక్తం వాంతులు, ఇలాంటివి అన్ని అనుభూతి ఉంటుంది. అసలు ఇది ఎందుకు వస్తుంది : ఈ క్యాన్సర్ రావడానికి ముఖ్య కారణం చెడు ఆహార అలవాట్లు అలాగే కారం,

If these symptoms appear on the face it is like having stomach cancer

If these symptoms appear on the face, it is like having stomach cancer

ఉప్పు అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం అలాగే మాంసాహారం అధికంగా తిన్న కడుపు క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. తాజా పండ్లు కూరగాయలు తక్కువగా తీసుకున్న కడుపు క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే కుటుంబ వంశపారపర్యంగా స్మోకింగ్, ఊబకాయం అలవాట్లు ఉన్న ఇది రకరకాల ఇన్ఫెక్షన్లు మూలంగా కడుపు క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ఎలా తగ్గించుకోవాలి : ఆకుపచ్చ కూరగాయలు, రంగురంగుల పండ్లు తీసుకోవడం వల్ల కడుపు క్యాన్సర్ ప్రమాదం తగ్గిపోతుంది. తృణధాన్యాల బ్రెడ్డు తృణధాన్యాలు ముడి బియ్యం లాంటివి డైట్లో చేర్చుకోవాలి. ఆల్కహాల్ మరియు టమాట ఉత్పత్తులకు కొద్దిగా దూరంగా ఉండాలి. అలాగే స్పైసీ ఫుడ్ మాంసం, చేపలు తక్కువగా తీసుకోవాలి. స్మోకింగ్ అలవాటు ఉంటే వాటిని మానేయాలి. డాక్టర్ ని ఎప్పుడు సంప్రదించాలి : మీకు తరచుగా కడుపునొప్పి అలాగే కడుపుబ్బరం అనిపిస్తే వెంటనే డాక్టర్ని సంప్రదించడం చాలా మంచిది.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది