Stomach Cancer : కడుపు క్యాన్సర్ ప్రమాదం మగవారిలో ఎక్కువ.. ఎటువంటి లక్షణాలు.. ఎలాంటి జాగ్రత్తలు వహించాలి..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Stomach Cancer : కడుపు క్యాన్సర్ ప్రమాదం మగవారిలో ఎక్కువ.. ఎటువంటి లక్షణాలు.. ఎలాంటి జాగ్రత్తలు వహించాలి..!!

Stomach Cancer : ప్రస్తుత కాలంలో ప్రపంచాన్ని గడగడ వణికిస్తున్న వ్యాధి క్యాన్సర్. ఈ మహమ్మారితో ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. కొంతమంది సరియైన సమయానికి భోజనం చేయక, గుండెల్లో మంట, గ్యాస్ ఇతర కారణాలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎసిడిటీ సమస్య కొన్ని సమయాలలో అధికమవుతూ ఉంటుంది. ఈ సమస్య యువతరంలో ఎక్కువగా కనబడుతోంది. సహజంగా సరియైన పోషకాలు లేని ఆహారం, సరియైన టైంలో ఆహారం తీసుకోకపోవడం వలన ఈ వ్యాధులు వస్తూ ఉంటాయి. చాలా సందర్భాల్లో జీర్ణశక్తి […]

 Authored By prabhas | The Telugu News | Updated on :7 February 2023,9:00 am

Stomach Cancer : ప్రస్తుత కాలంలో ప్రపంచాన్ని గడగడ వణికిస్తున్న వ్యాధి క్యాన్సర్. ఈ మహమ్మారితో ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. కొంతమంది సరియైన సమయానికి భోజనం చేయక, గుండెల్లో మంట, గ్యాస్ ఇతర కారణాలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎసిడిటీ సమస్య కొన్ని సమయాలలో అధికమవుతూ ఉంటుంది. ఈ సమస్య యువతరంలో ఎక్కువగా కనబడుతోంది. సహజంగా సరియైన పోషకాలు లేని ఆహారం, సరియైన టైంలో ఆహారం తీసుకోకపోవడం వలన ఈ వ్యాధులు వస్తూ ఉంటాయి. చాలా సందర్భాల్లో జీర్ణశక్తి బలహీనంగా ఉన్న అజీర్తి సమస్య వస్తుంది. అయితే మీరు నిత్యం గుండెల్లో మంట, గ్యాస్ సమస్యలతో ఇబ్బంది పడుతుంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. కడుపు క్యాన్సర్ గురించి ప్రజలకు పెద్దగా అవగాహన లేదు.

stomach cancer heres the signs and symptoms of

stomach cancer heres the signs and symptoms of

చాలామంది కడుపు క్యాన్సర్ లక్షణాలు కేవలం గుండెల్లో మంట, గ్యాస్ గా అని నమ్ముతూ ఉంటారు. అయితే ఈ విధంగా నిర్లక్ష్యం చేయడం వలన సమస్య తీవ్రంగా మారే అవకాశం ఉంటుంది. అని వైద్య నిపుణులు చెప్తున్నారు. కడుపు క్యాన్సర్ ప్రమాదం మగవారిలో ఎక్కువగా ఉంటుందని పరిశోధనల లో తేలింది. హార్మోన్ల వ్యత్యాసాల మూలంగా ఆడవాళ్లు కు ఈ వ్యాధి వచ్చే ప్రమాదం చాలా తక్కువగా ఉంటుంది. స్త్రీలలో ఈస్ట్రోజన్ ఉంటుంది. ఇది వాళ్ళ శరీరాన్ని మంట నుంచి రక్షిస్తూ ఉంటుంది. హార్మోన్లు ముఖ్యంగా ఆడవారిలో కడుపు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తూ ఉంటుంది. అయితే కడుపు క్యాన్సర్ లక్షణాలు ఎప్పుడు విమర్శించకూడదు.. గుండెల్లో మంట, గ్యాస్ ఈ వ్యాధి ముఖ్యమైన లక్షణం. అలాగే హిమోగ్లోబిన్ లెవెల్స్ తగ్గినప్పుడు అలాగే ఆకస్మికంగా బరువు తగ్గడం,

ఆకలి లేకపోవడం కూడా కడుపు క్యాన్సర్ కి ఒక లక్షణమే..జీర్ణశయం పైభాగం కడుపులో ఆహారం జీర్ణం చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ ఆహారం నుండి అవసరమైన పోషకాలు తీసుకొని శరీరంలోని మిగతా భాగాలకు సరఫరా చేస్తూ ఉంటుంది. జీర్ణ వ్యవస్థలోని కణాలు అసాధారణంగా పెరిగినప్పుడు ఈ వ్యాధి వస్తుంది. ఇక్కడినుంచి కనితలు వస్తూ ఉంటాయి. కనితలను మొదటిలోనే గుర్తిస్తే క్యాన్సర్ ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు .లేదా కనితి రోజు రోజుకి క్యాన్సర్ గా మారుతూ ఉంటుంది. అలాంటప్పుడు క్యాన్సర్ కణాలు క్రమంగా పిత్తాశయం, ప్యాంక్రియాస్, పెద్దపేగు, కడుపు, పురుషనాలం, పెరిటోరియం ఉత్తన గోడకు ఏర్పడుతూ ఉంటాయి. ఈ సమయంలో రోగి ని రక్షించడం చాలా కష్టమవుతూ ఉంటుంది.

stomach cancer heres the signs and symptoms of

stomach cancer heres the signs and symptoms of

వ్యక్తి శరీరంలో క్యాన్సర్ కణాలు అధికమవ్వడానికి సరియైన కారణం ఏమిటనే దానిపై అధ్యయనాలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. అధ్యయనాలు క్యాన్సర్ వెనుక ఎన్నో కారణాలను అనుమానిస్తున్నారు. కానీ మనిషిలో క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచే కొన్ని ప్రాథమిక అంశాలు మాత్రం ఉన్నాయి. మద్యం సేవించడం, అధిక ఉప్పు, ధూమపానం ఇవన్నీ ప్రమాదకరమైన ఆహారం వలన ఈ వ్యాధి వస్తుంది నియంత్రణ లేని జీవనశైలి కడుపు క్యాన్సర్ ప్రమాదాన్ని అధికమయ్యేలా చేస్తుంది. అలాగే ఆకలి లేకపోవడం, మలంలో రక్తస్రావం, బరువు తగ్గడం, వాంతులు, కడుపునొప్పి, గ్యాస్, గుండెల్లో మంట, వికారం ఇలాంటి లక్షణాలన్నీ ఉంటే ఆలస్యం చేయకుండా వెంటనే వైద్య నిపుణులని సంప్రదించాలి.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది