Cholesterol Control : ఈ ఆసనాలు చేస్తే కొలెస్ట్రాల్ కంట్రోల్.. గుండె జబ్బులు మాయం..!
ప్రధానాంశాలు:
Cholesterol Control : ఈ ఆసనాలు చేస్తే కొలెస్ట్రాల్ కంట్రోల్.. గుండె జబ్బులు మాయం..!
Cholesterol Control : ఈ రోజుల్లో చాలా మంది గుండె జబ్బులతో బాధపడుతున్నారు. ఇక హార్ట్ ఎటాక్ మరణాలు అయితే బాగా పెరిగిపోతున్నాయి. ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు ఈ మరణాలు అధికంగా ఉంటున్నాయి. పైగా చిన్న వయసు వారిలో కూడా ఎక్కువగా ఇవి కనిపిస్తున్నాయి. దాంతో పాటు చాలా మంది ఇతర రకాల గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. మన బాడీలో చెడు కొలెస్ట్రాల్ పెరగడం వల్ల సిరలు-ధమనులలో రక్త ప్రసరణను దెబ్బతీస్తుంది. దాంతో మన రక్త నాళాల్లో రక్తం గడ్డ కట్టి గుండెపోటుకు కారణం అవుతుంది. అయితే ఈ చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించేందుకు కొన్ని ఆసనాలు చేస్తే సహజంగా తగ్గుతుందని డాక్టర్లు చెబుతున్నారు.
Cholesterol Control భుజంగాసనం..
ఇది చాలా సులభంగా ఉంటుంది. నేల మీద పడుకుని వెనక భాగానికి తిరగాలి. చేతులు బాడీకి సైడ్స్ లో పొట్టకు చెస్ట్ కు మధ్యలో పెట్టుకుని వాఇపై కడుపు నుంచి పైభాగాన్ని ఎత్తాలి. తల పైకి చూడాలి. దీన్నే భుజంగాసనం అంటారు. దీని వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. క్రమం తప్పకుండా దాన్ని చేయడం వల్ల కాలేయంతో పాటు మూత్ర పిండాలు ఆరోగ్యంగా ఉంటాయి. అంతే కాకుండా జీర్ణ వ్యవస్థ కూడా మెరుగుపడుతుంది. బాడీలో చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది.
Cholesterol Control పశ్చిమోత్తాసనం..
మ్యాట్ మీద కూర్చోవాలి. కాల్లను ముందుకు చాచాలి. తర్వాత మన చేతులను నిఠారుగా ముందుకు చాచాలి. నెమ్మదిగా వాటితో మన కాలి బొటనవేళ్లను పట్టుకోవాలి. తర్వాత మోకాళ్లపై తలను ఉంచి, శరీరం పై భాగాన్ని ముందుకు వంచాలి. ఇందులో బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మోకాళ్లను అస్సలు లేపొద్దు. వంచొద్దు. వాటిని చాచినట్టుగా ఉంచాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే బాడీలోని చెడు కొలెస్ట్రాల్ బాగానే తగ్గిపోతుంది.
Cholesterol Control ధనురాసనం..
ఇది బాడీకి ఎంతో మేలు చేస్తుంది. ఈ ఆసనంలో భాగంగా బోర్లా పడుకోవాలి. తర్వాత నడుము నుంచి శరీర పై భాగాన్ని పైత్తాలి. వెనక కాళ్లను మడుచుకోవాలి. చేతులతో కాళ్లను పట్టుకోవాలి. ఇది సరిగ్గా చేస్తే విల్లులా ఉంటుంది మన బాడీ భంగిమ. ఇలా చేయడం వల్ల ఛాతి బాగా పెరుగుతుంది. అంతే కాకుండా కండరాల నొప్పులు, ఒత్తిడి పూర్తిగా తగ్గిపోతుంది. దాంతో పాటు గుండె సంబంధిత నాళాల్లో చెడు కొలెస్ట్రాల్ బాగా తగ్గుతుంది.