Cumin Water : ఉదయం రాత్రి జీలకర్ర నీళ్లు తాగితే మీలో సగం రోగాలు మాయం…!
ప్రధానాంశాలు:
Cumin Water : ఉదయం రాత్రి జీలకర్ర నీళ్లు తాగితే మీలో సగం రోగాలు మాయం...!
Cumin Water : ఉదయం రాత్రి జీలకర్ర నీళ్లను తాగడం వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయని మీకు తెలుసా..! జీలకర్రలు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నందున ఇది బరువు తగ్గడంలో ముఖ్యపాత్రను పోషిస్తుంది. శరీరంలో ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడానికి జీలకర్ర లో పాలీ ఫెనాల్స్ మరి ఇతర సమ్మేళనాలు సహాయపడతాయి. ముఖ్యంగా జీర్ణ క్రియ సమస్యలను దూరం చేయడంలో జీలకర్ర ఎంతగానో ఉపయోగపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇక దీంతో చాలామంది ప్రతి రోజు జీలకర్ర నీటిని తాగడం అలవాటు చేసుకుంటున్నారు. అయితే జీలకర్ర నీటిని ఉదయం ఖాళీ కడుపుతో త్రాగకూడదు..! అదేవిధంగా రాత్రిపూట జీలకర్ర నీరు తాగితే ఏమవుతుంది…? ఈ వివరాలన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
రక్తంలో గ్లూకోస్ స్థాయిలను తగ్గించడానికి జీలకర్ర లోని ఫ్లేవ నాయిడ్స్ ఎంతగానో సహాయపడుతుంది. అంతేకాకుండా టైప్ టు డయాబెటిక్స్ లో ప్లాస్టింగ్ బ్లడ్ షుగర్, సీరం ఇన్సులిన్ స్థాయిలను జీలకర్ర తగ్గిస్తుంది. ఇక ప్రతిరోజు ఉదయం రాత్రి జీలకర్ర నీళ్లను తీసుకున్నట్లయితే ఎసిడిటీ, గ్యాస్ మరియు మలబద్ధకం వంటి జీర్ణ సమస్యలు రాకుండా కాపాడుతుంది. అలాగే జీలకర్ర లో యాంటీ ఆక్సిడెంట్లు మరియు ఫైబర్ అధిక మోతాదులు ఉంటాయి. దీంతో శరీరంలో కొవ్వు పేరుకుపోకుండా జీలకర్ర నివారిస్తుంది. ఉదయం పరగడుపున జీలకర్ర నీళ్లను తీసుకోవడం వలన నిర్జలీకరణను నివారిస్తుంది. ఎందుకంటే జీలకర్ర నీళ్లలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. ఒకవేళ రాత్రి తీసుకున్నట్లయితే దాహం తీరుతుంది.
జీలకర్రలో ఐరన్ మరియు పీచు ఉండటం వలన ఇది రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో సహాయపడుతుంది. అదేవిధంగా సీజనల్ వ్యాధులతో పోరాడుతుంది. ప్రతిరోజు ఒక గ్లాసు జీలకర్ర నీరు తీసుకుంటే మీ పొట్ట నిండుగా ఉంటుంది. దీనితో ఇతర జంక్ ఫుడ్ ను తినకుండా చేస్తుంది. ముఖ్యంగా డయాబెటిక్ పేషెంట్లు జీలకర్ర నీళ్లను ఉదయం సాయంత్రం తాగడం వలన రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా ఇది నియంత్రిస్తుంది. ఇలా క్రమం తప్పకుండా జీలకర్ర నీళ్లు తాగడం వలన రోగనిరోధక శక్తి పెరగడంతో పాటుగా కొలెస్ట్రాల్ లను తగ్గిస్తుంది. అంతేకాకుండా రక్తపోటును నియంత్రించడంలో గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో జీలకర్ర నీళ్లు ఎంతగానో ఉపయోగపడతాయి. అలాగే జీలకర్ర నీళ్లలో యాంటీ ఆక్సిడెంట్, అండ్ ఇంప్లిమెంటరీ లక్షణాలు ఉండటం వలన ఇది చర్మానికి చాలా మంచిది.