TEA : ఈ టీ ని ప్రతిరోజు త్రాగారంటే… చెడు కొలెస్ట్రాల్ తగ్గిపోవాల్సిందే…!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

TEA : ఈ టీ ని ప్రతిరోజు త్రాగారంటే… చెడు కొలెస్ట్రాల్ తగ్గిపోవాల్సిందే…!!

 Authored By ramu | The Telugu News | Updated on :27 May 2024,9:00 am

TEA : ధనియాలు అనేవి ప్రతి ఒక్కరి ఇంట్లో ఖచ్చితంగా ఉంటాయి. ఈ ధనియాలతో టీ చేసుకుని తాగటం వలన చాలా లాభాలు ఉన్నాయి. అయితే ఆ లాభాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనం కూరలలో ఎక్కువగా వాడే ధనియాలు వంటలకీ రుచి, వాసన అనేది వస్తుంది. ఇవి మన ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. వీటిని ఎక్కువగా వంటకాలలో ఉపయోగిస్తారు. ధనియాలలో ఎక్కువగా విటమిన్ ఏ సి కె లాంటి పోషకాలు ఉంటాయి. వీటితో టీ ని చేసుకొని తాగటం వలన శరీరంలోని కొలెస్ట్రాల్ మరియు షుగర్ లెవెల్స్ ను కూడా తగ్గిస్తుంది..

యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ : ఈటీ ని తీసుకోవడం వలన యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ దూరం చేసుకోవచ్చు. ఈ ధనియాలలో ఉన్న ప్రత్యేక గుణాలు యూరినరీ ఇన్ఫెక్షన్ కు కారణం అయ్యే బ్యాక్టీరియాను కూడా దూరం చేస్తుంది. దీనికోసం ఒకటిన్నర టీ స్పూన్ ధనియాలను రాత్రంతా ఒక కప్పు నీటిలో నానబెట్టి ఉదయం లేవగానే ఆ నీళ్లను వడపోసుకొని తాగాలి. దీంతో యూరినరీ ఇన్ఫెక్షన్ అనేది దూరం అవుతుంది..

కొలెస్ట్రాల్ తగ్గటం : ధనియాల లో ఉండే గుణాలు శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ ను కూడా తగ్గిస్తుంది. దీంతో చెడు కొలెస్ట్రాల్ అనేది తగ్గుతుంది మరియు మంచి కొలెస్ట్రాల్ అనేది పెరుగుతుంది అని నిపుణులు చెబుతున్నారు..

ఫుడ్ పాయిజనింగ్ : ఈ టీ ని చేసుకొని తాగటం వలన దీనిలో ఉండే యాంటీ మైక్రోబయల్ అనే గుణాలు ఫుడ్ పాయిజన్ లాంటి లక్షణాలను కూడా దూరం చేయగలదు..

బీపీ కంట్రోల్ : ఈటీ ని క్రమం తప్పకుండా తీసుకోవటం వలన హైపర్ టెన్షన్ అనేది తగ్గుతుంది. బీపి పెరిగితే స్ట్రోక్స్ మరియు బ్లడ్ క్లాట్ లాంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కావున వీటిని కంట్రోల్ చేయాలి అంటే. ధనియాలతో టీ ని చేసుకొని తాగాలి..

టాక్సిన్స్ దూరం : ధనియాలని టీ చేసుకొని తీసుకుంటే, ఇది లివర్ గాల్ బ్లాడర్ ని డిటాక్స్ చేసేందుకు చాలా మంచిది. ముఖ్యంగా చెప్పాలి అంటే. హెవీ లంచ్ తీసుకున్న తర్వాత కూడా ఒక గ్లాస్ ధనియాల నీటిని కనుక తాగితే డిటాక్స్ అవుతాయి..

మైగ్రేన్ : ప్రస్తుతం చాలా మందిని ఇబ్బంది పెట్టే సమస్యలలో ఒకటి మైగ్రేన్. వాతావరణం వేడిగా ఉన్నప్పుడు ఈ సమస్య అనేది అధికంగా పెరుగుతుంది. కొత్తిమీర టీ ని తీసుకుంటే మైగ్రేన్ అనేది తొందరగా తగ్గుతుంది. మీకు గనక మైగ్రేన్ ఉన్నట్లయితే మీ రోజు వారి డైట్ లో ఈ హెర్బల్ టీ ని యాడ్ చేసుకోవటం వలన చాలా ప్రయోజనం ఉంటుంది…

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది