Hair Tips : వర్షాకాలంలో ఈ చిట్కాలను పాటిస్తూ, ఈ టిప్స్ ను ఫాలో అయినట్లయితే మీ జుట్టు రాలడం ఆగి ఒత్తుగా పెరుగుతుంది
Hair Tips : ఈ మధ్యకాలంలో వయసు తరహా లేకుండా ఈ జుట్టు రాలే సమస్య అందరిలో కనిపిస్తుంది. దీనికి కారణాలు విటమిన్ లోపం, ఒత్తిడి, వాతావరణం కారణమవుతున్నాయి. సరియైన నిద్ర లేకపోయినా, వర్క్ టెన్షన్స్ అధికమైన ఈ జుట్టు రాల సమస్య ఎక్కువ అవుతూ ఉంటాయి. అదేవిధంగా శరీరంలో అందవలసిన పోషకాలను అందకపోయినా ఈ సమస్య వస్తుంది. ఈ సమస్యను నివారించు కోవడం కోసం కొన్ని టిప్స్ పాటిస్తూ.. సరైన ఆహారాన్ని తీసుకుంటే ఈ సమస్యను నివారించవచ్చు.. విటమిన్ లోపం హార్మోన్ ఇన్ బ్యాలెన్స్ సమస్యలు నివారించుకుంటూ జుట్టుకి ఈ హెయిర్ ప్యాక్ ను వినియోగించినట్లయితే జుట్టు రాలడం తగ్గి పొడవుగా, ఒత్తుగా పెరుగుతుంది.
దీనికోసం ముందుగా ఒక ఉల్లిపాయను తీసుకొని దాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసుకోవాలి. ఈ ఉల్లిలో ఫాస్పరస్ పుష్కలంగా ఉండడం వలన ఇది జుట్టు ఊడడం ఆపి జుట్టు పొడవుగా ఒత్తుగా పెరిగేలా ఉపయోగపడుతుంది. తర్వాత కలమంద మట్టలను తీసుకుని అంచులను కట్ చేసి చిన్న ముక్కలుగా చేసుకొని దీన్ని కూడా మిక్సీ జార్ లో వేసుకోవాలి. ఈ కలమంద జుట్టు రాలి సమస్యలు తగ్గించి పెరగడానికి బాగా ఉపయోగపడుతుంది. జుట్టు రాలడం కూడా తగ్గించి జుట్టు స్మూత్ గా సిల్కీగా చేస్తుంది.తర్వాత ఐదు రెబ్బలు కరివేపాకు దాంట్లో వేయాలి. ఈ కరివేపాకు జుట్టును బలంగా ఉంచుతుంది. అలాగే జుట్టు రాలడాన్ని కూడా తగ్గిస్తుంది. ఈ కరివేపాకులో బీటా కెరోటిన్ ఉంటుంది.జుట్టు పొడవుగా నల్లగా చేయడానికి ఉపయోగపడుతుంది.
ఈ కరివేపాకును ఆహారంలో కూడా వాడుకోవడం వలన తెల్ల జుట్టు రావడం తగ్గిపోతుంది. అయితే దీనిలో నీళ్లు రెండు చెంచాలు వేసుకుని మెత్తగా పట్టుకోవాలి. ఇక తర్వాత ఈ మిశ్రమాన్ని జుట్టు చివర్ల వరకు బాగా అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఒక 30 నిమిషాల పాటు ఉంచుకోవాలి. తర్వాత ఏదైనా గాఢత తక్కువ ఉన్న షాంపుని వాడి తల స్నానం చేసుకోవాలి. ఈ విధంగా వారానికి రెండుసార్లు చేసుకోవడం వలన జుట్టు రాలే సమస్య తగ్గిపోయి జుట్టు పొడవుగా, ఒత్తుగా, స్మూత్ గా పెరుగుతుంది. అందవలసిన పోషకాలు మనం తీసుకునే ఆహారం ద్వారా కూడా అందేలా చూసుకోవాలి. నిత్యము కనీసం తొమ్మిది గంటల నిద్రను సేవించాలి. ఇలా చేస్తే మీకు తొందరగా రిజల్ట్ కనిపిస్తుంది.