Skin Problems : ఇలాంటి చర్మ సమస్యలు వస్తే మీ కిడ్నీలు ప్రమాదంలో ఉన్నట్లే… జాగ్రత్త…!!
Skin Problems : ఈ మధ్యకాలంలో చాలా మంది చిన్న పెద్ద లేకుండా మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్నారు. మీ చర్మం మీద కొన్ని మార్పులు జరుగుతూ ఉంటాయి. పొడి చర్మం, చర్మం మీద దురదలు, చర్మం మీద గీతలు, చర్మం రంగు మారడం గోళ్లు రంగు మారడం, కాళ్ళు చేతులు ఉబ్బడం, దద్దుర్లు, పొట్ట మీద గడ్డలు కాల్షియం శరీరంలో పేరుకుపోవడం ఇవన్నీ కూడా కిడ్నీ వ్యాధి బారిన పడిన వాళ్ళలో కనబడే సంకేతాలు. ఇప్పుడు వీటి గురించి వివరంగా తెలుసుకుందాం. మన శరీరంలో అన్నిటికన్నా ముఖ్యంగా చెప్పుకునే భాగం కిడ్నీలు ఇలాంటి కిడ్నీ వ్యాధి వచ్చినప్పుడు ఈ లక్షణాలు కనబడుతూ ఉంటాయి. కొంతమంది అయితే వారి చర్మం ముడతలుగా వచ్చి చేప చర్మం లాగా తయారవుతుంది.
ఇది దాదాపుగా కిడ్నీ వ్యాధి ఉన్న అందరిలోనూ కనిపించే లక్షణం. కిడ్నీ వ్యాధి ముదిరిన వాళ్లలో ఇలా కనిపిస్తూ ఉంటుంది. ఇలాంటివారు యూవీబీ అల్ట్రా వైలెట్ ఫోటో తెరిపి చికిత్స ద్వారా ఉపశమనం పొందవచ్చు. అప్పుడు మన శరీరం మీద చర్మం రంగు మారిపోతూ ఉంటుంది. ఇక మరో విషయం గోళ్లు రంగు మారడం కూడా కనిపిస్తూ ఉంటాయి. ఎవరికైతే వ్యాధి ముదురుతుందో వారి గోళ్ళ పైభాగం మొత్తం తెల్ల రంగు వస్తుంది. మరియు కింది భాగంలో ఎరుపు రంగుతో కూడిన గోధుమ రంగులో ఉంటుంది. మీకు తెలుసు కదా కిడ్నీలో మన శరీరంలోని అధికంగా ఉన్న నీరు అధిక ఉప్పుని బయటకు పంపిస్తాయి. ఎప్పుడైతే కిడ్నీలు సరిగ్గా పనిచేయడం మానేస్తాయో అప్పుడు అవన్నీ కూడా మన శరీరంలోనే పేరుకు పోతాయి. అవి మన శరీరంలో కొన్నిచోట్ల పేరుకుపోయి అక్కడక్కడ ఉబ్బినట్టుగా అనిపిస్తాయి.
ముఖ్యంగా కాళ్లు, పాదాలు, చేతులు మరియు ముఖం మీద ఉబ్బినట్టుగా కనిపిస్తుంది. శరీరం మీద మచ్చలు అనేది కిడ్నీ వ్యాధి భారీగా పడిన వాళ్ళలో సర్వసాధారణంగా కనిపించే లక్షణం. ఎవరికైతే కిడ్నీ వ్యాధి ముదిరిపోతుందో వారి చర్మం మీద మచ్చలు ఏర్పడతాయి. కొంతమందికి చేతి మీద బొబ్బలు వస్తూ ఉంటాయి. ఎవరికైతే కిడ్నీ వ్యాధి బాగా ముదిరిపోతుందో వారి చేతుల మీద ఇటువంటి బొబ్బలు కనిపిస్తూ ఉంటాయి. కొంతమందికి వారి పొట్ట మీదే చిన్న చిన్న గడ్డల లాగా ఏర్పడుతూ ఉంటాయి. ఇది కనిపిస్తే వెంటనే డాక్టర్కు చూపించాలి. ఇవన్నీ కూడా కిడ్నీ వ్యాధులకు కారణాలుగా చెప్పుకోవచ్చు. అందుకే క్రమం తప్పకుండా శారీరక వ్యాయామాలు చేస్తూ ఆరోగ్యకరమైన జీవనశైలిని గడుపుతూ ఉండాలి.