Tea : ఈ సమ్మర్ లో టీ, కాఫీలను అధికంగా తాగేస్తున్నారా..? ఈ విషయం తెలిస్తే వెంటనే తాగడం మానేస్తారు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Tea : ఈ సమ్మర్ లో టీ, కాఫీలను అధికంగా తాగేస్తున్నారా..? ఈ విషయం తెలిస్తే వెంటనే తాగడం మానేస్తారు..!

 Authored By ramu | The Telugu News | Updated on :30 April 2024,7:00 am

ప్రధానాంశాలు:

  •  Tea : ఈ సమ్మర్ లో టీ, కాఫీలను అధికంగా తాగేస్తున్నారా..? ఈ విషయం తెలిస్తే వెంటనే తాగడం మానేస్తారు..!

Tea : ఉదయం లేవగానే సహజంగా అందరూ టీ, కాఫీలను తాగుతూ ఉంటారు. ఇంకొందరైతే టీ, కాఫీలు తాగకుండా ఏ పని మొదలు పెట్టరు. ఇంకొందరైతే రోజుకి 4 5 కప్పులు లాగిచ్చేస్తూ ఉంటారు. టి అంటే ఇష్టమున్న వారు ఎన్నిసార్లు అయినా తాగేస్తుంటారు. అయితే వేసవికాలంలో అధికంగా టీ తాగితే అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు..అయితే ఈ సమ్మర్లో వేడి అధికంగా ఉండడంతో పని త్వరగా పూర్తి చేసుకొని ఇంటికి చేరుకోవాలని అందరూ ఆరాటపడుతూ ఉంటారు. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం 4:00 వరకు ఇంటి నుంచి బయటకి వెళ్ళడానికి భయపడిపోతూ ఉంటారు..

ఎండ నుంచి బయటికి వెళ్లేవారు తరచూ నీళ్లు తాగుతూ ఉండాలి. పండ్లు తినాలి అని వైద్య నిపుణులు చెప్తున్నారు. కానీ చాలామంది వీటిని అలవాటు చేసుకోవడం లేదు. టీ తాగడానికి ఇష్టపడుతూ ఉంటారు. అందుకే అంత మండే వేడిలోనూ వేడి వేడి టీ తాగుతూ ఉంటారు. అయితే ఈ వేసవిలో టీ తాగడం వల్ల శరీరానికి ఎంత ప్రమాదం జరుగుతుందో కూడా తెలియదు.. ఈ ఎండలకి టీ తాగడం వలన అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంటుంది. వేడి వాతావరణం లో టీ తాగడం వల్ల కలిగే నష్టాలను డాక్టర్ చంద్రశేఖర్ తెలియజేశారు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం…

Tea ఈ సమ్మర్ లో టీ కాఫీలను అధికంగా తాగేస్తున్నారా ఈ విషయం తెలిస్తే వెంటనే తాగడం మానేస్తారు

Tea : ఈ సమ్మర్ లో టీ, కాఫీలను అధికంగా తాగేస్తున్నారా..? ఈ విషయం తెలిస్తే వెంటనే తాగడం మానేస్తారు..!

డా” చంద్రశేఖర్ మాట్లాడుతూ టీలో ప్రత్యేకంగా కెఫిన్ ఉంటుంది. ఇది శరీరంలో ఇబ్బందులు పెంచుతుంది. అలాగే ఎసిడిటీ, గుండెల్లో మంట, పుల్లని తేన్పులు లాంటివి వస్తూ ఉంటాయి. కావున ఈ సమ్మర్ లో టీ తీసుకుపోవడమే మంచిది. కానీ వేసవిలో రోజుల్లో కూడా రోజుకి 10 నుంచి 12 కప్పుల టీ తాగే వారైతే ఆరోగ్యంగా ఉండాలంటే టీ మానుకోవడం మంచిది. ఈ సమ్మర్ లో ఆరోగ్యంగా ఉండాలన్న అనారోగ్య బారిన పడకుండా ఉండాలన్న వేసవిలో టీ వినియోగాన్ని తగ్గించుకోవాలని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. రోజుకి ఒక కప్పు రెండు కప్పుల తాగితే పరలేదు. కానీ కప్పుల కప్పుల టీ ని వేసవిలో తాగితే అనారోగ్య బారిన పడినట్టే..

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది