Tamarind : శీతాకాలంలో చింతపండు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అసలు వదిలిపెట్టరు…!
ప్రధానాంశాలు:
Tamarind : శీతాకాలంలో చింతపండు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అసలు వదిలిపెట్టరు...!
Tamarind : చింతపండు అంటేనే చిన్నటి జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి. చిన్నప్పుడు ఎప్పుడో ఒకసారి చింతపండునీ తిని ఉంటారు కదా.. చింతపండు అనేక వంటలలో చేయడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. సాధారణంగా రోజువారి వంటల్లో దీనిని ఉపయోగిస్తూనే ఉంటాం. ఎంతో రుచిగా ఉండే చింతపండు మన ఆరోగ్యానికి కూడా అంతే మేలు చేస్తుంది. అయితే ఈ చింతపండు ని తినడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయట. ముఖ్యం శీతాకాలంలో చింతపండు తినడం వలన ఎన్నో లాభాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. చింతపండు అనేక ముఖ్యమైన పోషకాలు తో నిండి ఉంటుంది. చింతపండు శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడంతోపాటు అనేక వ్యాధులను రక్షిస్తుంది. అదేవిధంగా చింతపండు లో విటమిన్ సి, బి ,మెగ్నీషియం, పొటాషియం, ఖనిజాలు, మరియు ఇనుము, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి.
![Tamarind శీతాకాలంలో చింతపండు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అసలు వదిలిపెట్టరు](https://thetelugunews.com/wp-content/uploads/2025/02/tamarind.jpg)
Tamarind : శీతాకాలంలో చింతపండు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అసలు వదిలిపెట్టరు…!
చింతపండు లో అధిక ఫైబర్ ఉన్నందువలన ఇది శరీర జీర్ణ వ్యవస్థకు ఎంతో మేలు ని కలిగిస్తుంది. ఇక చింతపండు లో ఉండే యాంటీ యాక్సిడెంట్ల వల్ల క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. గ్యాస్టిక్, అల్సర్ వంటి కడుపు సమస్యల ప్రమాదాన్ని తగ్గించడంలో చింతపండు ముందు ఉంటుంది. అంతేకాకుండా చింతపండు మంచి ప్రేగు కదలికలను ప్రోత్సహిస్తూ మలబద్ధకాన్ని నివారిస్తుంది. యాక్సిడెంట్లు మరియు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో చింతపండు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇది గుండె జబ్బు సమస్యల నుండి మనల్ని రక్షిస్తుంది. ఇక చింతపండు శరీరంలోని గ్లూకోస్ వినియోగాన్ని పెంచి రక్తంలోనే చక్కెర స్థాయిలను ఉంచుతుంది.
అదేవిధంగా చింతపండులో ఫైబర్ అధికంగా ఉండడం వలన మలబద్దక సమస్యలను తగ్గించి జీర్ణక్రియను మెరుగుపరచడంలో ఎంతగానో సహాయపడుతుంది. ఇక ఇందులో విటమిన్ సి, విటమిన్ ఈ, మరియు విటమిన్ బి కాంప్లెక్స్, ఐరన్, పొటాషియం , క్యాల్షియం ఫాస్ఫరస్, ఫైబర్, ఫ్లేవనాయీడ్లు, మాంగనీస్ వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. ముఖ్యంగా చింతపండులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు గుండె సంబంధిత వ్యాధులను నివారిస్తుంది.