White Pumpkin : తెల్ల గుమ్మడి ఉపయోగిస్తే మీరు షాక్ అయ్యే మార్పులు మీలో కనిపిస్తాయి..!!
White Pumpkin : తెల్ల గుమ్మడి అంటే ఎక్కువగా ఇంటి ముందు దిష్టికి వాడుతూ ఉంటారు. అయితే ఈ గుమ్మడి లో ఎన్నో పోషకాలు ఉన్నాయో చాలామందికి తెలియదు.. అయితే దీనిలో ఉపయోగాలు అధిక బరువు దగ్గర్నుంచి అస్తమ వరకు ఎన్నో రకాల ఉపయోగాలు అందిస్తుంది. గుమ్మడికాయ అనగానే మనం కామన్ గా దాని గురించి పెద్దగా పట్టించుకోము. బూడిద గుమ్మడిని దిష్టికి వాడుతారు. కావున ఆటోమేటిక్గా పంపికిన్ అనగానే మనలో నెగటివ్ ఒపీనియన్ వచ్చేసింది. ఈ స్టోరీ ద్వారా మనం కొన్ని విషయాలను తెలుసుకోవాలి.ఈ గుమ్మడికాయలు చూడడానికి అందంగా ఉండటమే కాకుండా ఆరోగ్యాన్ని కూడా రక్షిస్తాయి.
అయితే వీటిని బొల్లి గుమ్మడికాయలు అని కూడా పిలుస్తారు. వాస్తవానికి వీటిలో పసుపు, ఆరెంజ్, బ్రౌన్ 4 ఇలా చాలా రకాలు ఉంటాయి .ఇంగ్లండ్ లో తెల్ల గుమ్మడిని డెకరేషన్ కోసం ఉపయోగిస్తూ ఉంటారు. హోలోవిన్ పండగ టైంలో ఈ గుమ్మడికాయల్ని బాగా అలంకరణకు వాడుతూ ఉంటారు.
అధిక బరువు పెరగడానికి గుండె జబ్బులు రావడానికి కారణమయ్యే చెడు కొలెస్ట్రాలను తెల్ల గుమ్మడికాయలు బాగా తగ్గిస్తాయి. వీటిలో ఫైట్ స్టెరాల్స్ ఉంటాయి. హైబీపీ ఉన్నవాళ్లు అధిక బరువు ఉన్నవాళ్లు తెల్ల గుమ్మడికాయను వండుకొని తినడం వల్ల చాలా బాగా ఉపయోగపడుతుంది.
తెల్ల గుమ్మడికాయలు విటమిన్ ఏ, బి సిక్స్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, ఐరన్, పోలేట్ ఇంకా ఎన్నో పోషకాలు దీనిలో ఉంటాయి. ప్రస్తుతం ఉన్న కాలంలో అంత కాలుష్యం రకరకాల ఇన్ఫెక్షన్లు వస్తున్నాయి. అలా అవ్వకుండా ఉండడానికి తెల్ల గుమ్మడికాయ జ్యూస్ తీసుకుంటే రకరకాల పోషకాలు అందిసున్నది. వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే ఊపిరితిత్తుల్లో ఉండే సూక్ష్మ క్రిములు ఇతర విషయ పదార్థాలను తెల్ల గుమ్మడికాయలు తరిమేస్తాయి. అస్తమా ఉన్నవాళ్లు తరచుగా తెల్ల గుమ్మడికాయను కూరల్లో వాడాలి.
అలాగే కీళ్ల నొప్పులు ఉండేవాళ్ళు తెల్ల గుమ్మడికాయను వండుకొని తీసుకోవాలి. ఇది కీళ్ల నొప్పులు నుంచి బాగా ఉపశమనం కలిగిస్తుంది. ఈ గింజలను కూడా తీసుకోవాలి. అదేవిధంగా ఎటిఎం అనే యాంటీ ఆక్సిడెంట్ తెల్ల గుమ్మడికాయలు పుష్కలంగా ఉంటుంది. ఇవి తీసుకోవడం వలన కళ్ళను అన్ని రకాలుగా రక్షించగలవు. కంటి చూపు కూడా మెరుగుపడుతుంది. మనకు టెన్షన్ ఒత్తిడి తగ్గాలంటే ఎల్టిప్రోడ్ పాన్ అని ఆమెనో ఆసిడ్ చాలా ముఖ్యం. దీని శరీరం ఉత్పత్తి చేయలేదు. కానీ తెల్ల గుమ్మడిలో ఇది ఉంటుంది. కావున టెన్షన్ పడేవాళ్ళు తెల్లగా ఉమ్మడి తీసుకోవడం చాలా మంచిది.