పిల్లల రోగ నిరోదక శక్తి పెంచే అద్బుతమైన 5 చిట్కాలు
immunity : కరోనా వల్ల పిల్లలు ఎక్కువగా ఇబ్బందికి గురి అవుతున్న దాఖలాలు ఇప్పటి వరకు లేవు. కాని త్వరలో థర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉంది.. దాని వల్ల ఖచ్చితంగా పిల్లలు ఎక్కువగా ఇబ్బంది పడాల్సి రావచ్చు అంటూ నిపుణులు అంటున్నారు. పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలంటూ నిపుణులు సూచిస్తున్నారు. ఈ సమయంలోనే కరోనా పిల్లలపై ప్రభావం చూపకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అలాగే పిల్లల్లో రోగ నిరోదక శక్తి immunity పెరిగేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు చూద్దాం. పిల్లల్లో సహజ సిద్దంగా రోగ నిరోదక శక్తిని చాలా ఈజీగా పెంచవచ్చు. వాటిలో ముఖ్యమైన 5 చిట్కాలను ఇప్పుడు చూద్దాం.
1. పిల్లలకు అయినా పెద్దలకు అయినా పసుపు అనేది చాలా అద్బుత ఔషదంగా పని చేస్తుంది. యాంటీ బయోటిక్ గా పని చేసే పసుపు పిల్లలకు పలు అనారోగ్య సమస్యలకు పరిష్కారంను చూపిస్తుంది. పావు టేబుల్ స్పూన్ పసుపు మరియు అర టేబుల్ స్పూన్ తేనెను కలిపి ప్రతి రోజు నిద్రించే ముందు పిల్లలకు ఇవ్వాలి. ఇలా చేయడం వల్ల వారు దీర్ఘ కాలిక అనారోగ్య సమస్యల నుండి మొదలుకుని పలు అనారోగ్య సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది.
2. అల్లం ఆరోగ్యానికి చాలా మంచిదని ఆయుర్వేద నిపుణులు చెబుతూ ఉంటారు. అల్లం పెద్ద వారికి మాత్రమే కాకుండా పిల్లల్లో కూడా మంచి ఔషద గుణంతో పని చేస్తుంది. ప్రతి రోజు పరగడుపున అల్లం రసం మరియు తేనె 5 చుక్కలను కలిపి ఇవ్వాలి. దీని వల్ల కూడా రోగ నిరోదక శక్తి పిల్లలో అభివృద్ది చెందుతుంది.
3. బెల్లం ఆరోగ్యానికి ఔషదంగా చెప్పుకోవచ్చు. యాంటీ ఇన్ ప్లామేటరీ గుణాలు ఉండే బెల్లంను ప్రతి రోజు పిల్లల ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. దీని వల్ల పిల్లల ఆరోగ్య అభివృద్ది జరగడంతో పాటు మెదడు చురుకుగా పని చేస్తుంది. ఉత్సాహంగా ఉండటంతో పాటు ప్రతి విషయంలో కూడా స్పీడ్ గా ఆలోచించే అవకాశం ఉంటుంది.
4. ప్రతి రోజు రాత్రి పిల్లలకు పాలను తాపించడం చాలా మంచిది. పాలల్లో పావు టీ స్పూన్ పసుపు కాని దాల్చిన చెప్ప ఫౌడర్ కాని.. యాలకులు లేదా లవంగాల పౌడర్ కాని వేసి తాపించాలి. వారి రుచికి తగ్గట్లుగా ఏది అయితే అది కనీసం వీటిల్లో ఒక్కటి అయినా వేసి తాపించడం వల్ల ఐరెన్ శాతం పెరిగి ఆరోగ్యంగా ఉంటారు. ఎముకలు దృడంగా మారడంతో పాటు పలు కండర మరియు ఎముకల సమస్యలకు చెక్ పెట్టవచ్చు.. భవిష్యత్తులో కూడా ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి.
5. కాస్త ఇబ్బంది అయినా కూడా ప్రతి రోజు పిల్లలకు అశ్వగంథ పొడిని ఇవ్వాలి. వారితో బలవంతంగా అయినా ఆ పొడిని ఏదో ఒక రూపంలో తీసుకునేలా చేయాలి. అలా చేసినప్పుడు పలు అనారోగ్య సమస్యలు మరియు దీర్ఘ కాలిక సమస్యలు దరి చేరవు.