Boda Kakarakaya Benefits : బోడ కాకరకాయ తింటే ఇన్ని ఉపయోగాలా.?
Boda Kakarakaya Benefits : మార్కెట్ లో అప్పుడప్పుడు కనిపించే బోడ కాకరకాయలు చాలా మందికి తెలియదు.. తెలిసిన వాళ్ళు వీటిని అసలు వదిలిపెట్టరు. సీజనల్ లభించే పండ్లు కూరగాయల్లో ఉండే పోషకాలు మన శరీరానికి చాలా మంచిది. అలాంటి వాటిలో ఈ బోడ కాకరకాయలు ఒకటి. వీటినే ఆ కాకరకాయలు అని కూడా అంటారు. వీటిని ఎక్కువగా అటవీ ప్రాంతాల్లోనే పండిస్తారు. వీటి దర కాస్త ఎక్కువగా ఉంటుంది. అయితే మన శరీరానికి అందించే పోషకలతో పోలిస్తే ధర పెద్ద సమస్య కాదు. ఈ ఆకాకరకాయల్లో క్యాలరీస్ చాలా తక్కువ 100 గ్రాముల ఆకాకరకాయల్లో కేవలం 17 క్యాలరీస్ మాత్రమే ఉంటాయి.
కాకరకాయల ఉండే ఈ బుల్లి బుల్లి కాకరకాయలు ఆరోగ్యానికే కాదు.. మంచి టేస్ట్ కూడా కలిగి ఉంటాయి. ఈ బొడ కాకరకాయలను వండేటప్పుడు వాటిలో ఉండే బోడుపలను తొలగించకూడదు. అసలైన పోషకాలు అందులోనే ఉంటాయి. వర్షాకాలంలో వీటిని తింటే మరి మంచిది. మరి వీటి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనకి ఆహారం జీర్ణం కాకపోతే వీటితో చేసిన వంటకం తింటే సరిపోతుంది. వీటిలో లభించే విటమిన్ సి ఇన్ఫెక్షన్స్ తో పోరాడుతుంది.దీనిలో పీచు పదార్థాలు, యాంటీ ఆక్సిడెంట్ అధిక మోతాదులో ఉంటాయి.
వర్షాకాలంలో ఎక్కువగా లభించే వీటిని తినడం వలన జలుబు, దగ్గు, తుమ్ములు సంభవించవు.. ఎలర్జీస్ కూడా దూరం అవుతాయి. ఇందులోని పోలేట్లు శరీరంలోని కొత్త కణాలు వృద్ధి చెందాలా చేస్తాయి. ఎదుగుదలకు ఉపయోగపడతాయి. క్యాన్సర్ బారిన పడకుండా చూసేందుకు పొడ కాకరకాయలు ఉపయోగపడతాయి. సాధారణ కాకరకాయ తరహాలోని ఈ బోడ కాకరకాయలు కూడా డయాబెటిస్ ను కంట్రోల్ చేసి ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. కంటి సంబంధ వ్యాధులను దరిచేరకుండా ఉంటాయి. ఈ బోడ కాకరకాయల్ని తినడం వలన మలబద్ధకం సమస్య దూరం అవుతుంది. ఆహారంలో భాగంగా చేసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు..