Lampi Virus : జంతువులపై మరొక కొత్త వైరస్..! త్రీవర ప్రభావంతో వేల ఆవులు మరణం !! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Lampi Virus : జంతువులపై మరొక కొత్త వైరస్..! త్రీవర ప్రభావంతో వేల ఆవులు మరణం !!

Lampi Virus : గత కొన్ని సంవత్సరాలుగా కొన్ని కొత్త కొత్త వైరస్లతో ప్రజలలో మరణాలు చోటు చేసుకుంటున్నాయి. ఏడాదికి ఒక కొత్త వైరస్ పుడుతుంది. ఆ వైరస్ ఎన్నో ప్రాణాలను బలి తీసుకుంటున్నాయి. ఇలా ఇప్పుడు లంపి అనే వైరస్ ఇప్పుడు జొరబడింది. దీనివలన కొన్ని వేలాది ప్రాణాలు పోయాయట. అయితే ఈ మరణాలు ప్రజలలో కాదు. జంతువులలో ఎక్కువగా జరుగుతుంది. ఇలాంటి వైరస్ వ్యాప్తి చెందిన జంతువుల సంఖ్య ఇప్పటికే లక్ష ను క్రాస్ […]

 Authored By aruna | The Telugu News | Updated on :8 August 2022,4:00 pm

Lampi Virus : గత కొన్ని సంవత్సరాలుగా కొన్ని కొత్త కొత్త వైరస్లతో ప్రజలలో మరణాలు చోటు చేసుకుంటున్నాయి. ఏడాదికి ఒక కొత్త వైరస్ పుడుతుంది. ఆ వైరస్ ఎన్నో ప్రాణాలను బలి తీసుకుంటున్నాయి. ఇలా ఇప్పుడు లంపి అనే వైరస్ ఇప్పుడు జొరబడింది. దీనివలన కొన్ని వేలాది ప్రాణాలు పోయాయట. అయితే ఈ మరణాలు ప్రజలలో కాదు. జంతువులలో ఎక్కువగా జరుగుతుంది. ఇలాంటి వైరస్ వ్యాప్తి చెందిన జంతువుల సంఖ్య ఇప్పటికే లక్ష ను క్రాస్ చేసెయ్యాట. ఈ వైరస్ ఎక్కువగా ఆవుల పై ప్రభావం ఎక్కువగా ఉంటుందట. అయితే ఈ వైరస్ తో వేల ఆవులు ఇబ్బంది పడుతున్నాయట. ఇప్పటికే రాష్ట్రంలో ప్రభుత్వ లెక్క ప్రకారం 1. 21 లక్షల ఆవులకు ఈ వ్యాధి వ్యాపించిందట. వీటి సంఖ్య ఇంకా రోజురోజుకి ఎక్కువ అవ్వచ్చు అని ప్రభుత్వ అంచనాలు. ఈ వైరస్ బారిన పడిన ఆవులు ఎక్కువగా మృతి చెందుతున్నాయట. అయితే ఈ వైరస్ లక్షణాలు, ఎలా ఉంటాయి. అసలు ఈ వైరస్ ఎక్కడ పుట్టింది. ఈ వ్యాధి వచ్చిన తర్వాత ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు చూద్దాం..

ఈ లంపి వైరస్ అంటే.. ఈ లంపి వైరస్ కాప్రిల్ పాక్స్ కు చెందిన వైరస్ దీని కారణంగా జంతువుల శరీరంపై లంపి చర్మవ్యాధులు వస్తున్నాయట. వీటిలో మరో రెండు వైరస్లు కూడా ఉన్నాయట అవే గోట్ ఫాక్స్ వైరస్, షీ పాక్స్ వైరస్. ఈ వైరస్ శరీరంపై ఎలాంటి లక్షణాలు ఉంటాయంటే.. ఈ వైరస్ జంతువులకు వ్యాప్తి చెందినప్పుడు వాటి శరీరంపై కొన్ని గడ్డలు వస్తాయి. అలాగే జంతువులు బరువు తగ్గిపోవడం, నోటి గుండా సొల్లు కారడం, జ్వరం, పాలు తగ్గిపోవడం ఇలాంటి లక్షణాలన్నీ జంతువులలో కనిపిస్తూ ఉంటాయట. దీని కారణంగా ఆడ జంతువులలో న్యూమోనియా, అబార్షన్ లాంటి ఇబ్బందులు కూడా వస్తాయట. అని పశువైద్య రంగం వారు చెప్తున్నారు. అయితే ఈ వైరస్ ఎందువలన సోకుతుంది. అంటే ఈ లంపి వైరస్ దోమ అనేది మొక్కజొన్న, కందిరీగ, పేను వీటి వలన వస్తుందని అంటున్నారు. అలాగే జంతువులకు మురికి ఎక్కువగా పట్టడం వలన ఈ వైరస్ తొందరగా సోకుతుందంటున్నారు.

Lampi Virus Is Effecting On Animals Like Cows

Lampi Virus Is Effecting On Animals Like Cows

అయితే ఈ వైరస్ రాజస్థాన్లోని బర్మాలో అధికంగా ఉంది. అక్కడ జంతువుల పై ఎక్కువ ప్రభావం చూపుతుంది. అలాగే జైసల్మేర్ర్, పాలి సిరోహి, జలోర్, శ్రీ గంగానగర్, ఉదయపూర్ జైపూర్ శిఖర్ ఇలా ఇంకా కొన్ని రాష్ట్రాలలో కొన్ని వేల ఆవులలో ఈ వైరస్ వ్యాప్తి చెందింది. అయితే గుజరాత్ లో మాత్రం ఈ వ్యాధి బాగా విస్తరిస్తోంది. ఈ వైరస్ ఎన్ని పశువులలో వ్యాపించింది. ఇప్పటివరకు 1.21 లక్షల పశువులకు ఈ వైరస్ బారిన పడ్డాయి. వీటిలో 94 వేల పశువులకు ట్రీట్మెంట్ చేయగా. 42వేల జంతువులుకు ఈ వైరస్ నుంచి విముక్తి చెందాయి. వీటిలో పశ్చిమ రాజస్థాన్లో ఈ వైరస్ కారణంగా 587 పశువులకు మరణాలు సంభవించాయి. ఈ వైరస్ కు నివారణ ఏమిటి.? – ఈ వైరస్ నివారణకు రాష్ట్ర ప్రభుత్వం నూట ఆరు లక్షల వరకు మంజూరు చేసినట్లు తెలుపుతున్నారు. పూర్తి జిల్లాస్థాయి కార్యాలయాలు, వెటర్నరీ హాస్పిటల్స్ కు ఈ వైరస్ కు సంబంధించిన మెడిసిన్ అందించాలని ప్రభుత్వాన్ని నిర్ణయం తీసుకుంది.

Also read

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది