Lemon Coffee : లెమన్ వాటర్ తో మాత్రమే కాదు… లెమన్ కాఫీ తో కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి తెలుసా…!!

 Authored By ramu | The Telugu News | Updated on :22 September 2024,6:00 am

ప్రధానాంశాలు:

  •  Lemon Coffee : లెమన్ వాటర్ తో మాత్రమే కాదు... లెమన్ కాఫీ తో కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి తెలుసా...!!

Lemon Coffee : ప్రస్తుతం ఎంతోమంది లెమన్ వాటర్ ను కేవలం బరువు తగ్గటానికి అధికంగా తీసుకుంటూ ఉంటారు. అయితే ఈ లెమన్ వాటర్ అనేవి కేలరీలను కరిగించడంలో ఎంతో బాగా పని చేస్తాయి. అలాగే నిమ్మకాయలో విటమిన్ ఎ,విటమిన్ సి, కాల్షియం లాంటి పోషకాలు కూడా సమృద్ధిగా ఉంటాయి. ఇది మన శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచడంలో కూడా హెల్ప్ చేస్తాయి. అంతేకాక శరీరంలో ఉన్న విష పదార్థాలు మరియు వ్యర్థ పదార్థాలను కూడా బయటకు పంపిస్తుంది. అయితే లెమన్ కాఫీని రోజు తాగడం వలన ఆకలిని కంట్రోల్లో ఉంచుతుంది అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు…

శరీరంలో గుట్టలుగా పేరుకుపోయిన కొవ్వును కూడా కరిగించడంలో ఎంతో ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. దీంతో మీ బరువు కూడా నియంత్రణలో ఉంటుంది. అలాగే కాఫీ శరీరంలోని శక్తిని పెంచడమే కాక మెటబాలిజంను ప్రేరేపించి బరువు తగ్గేలా కూడా చేస్తుంది. అయితే ఈ నిమ్మకాయలో ఉండే విటమిన్ సి పోషకాలను బాగా గ్రహించటంలో కూడా హెల్ప్ చేస్తుంది. అందుకే దీనిని కాఫీలో కలిపి తీసుకోవటం వలన కాఫీలోని యాంటీ ఆక్సిడెంట్లు ఎంతో ప్రయోజనకరమైన సమ్మేళనాలను గ్రహించడంలో కూడా ఉపయోగపడుతుంది. దీంతో శరీరానికి మంచి పోషకాలు అనేవి లభిస్తాయి…

Lemon Coffee : లెమన్ వాటర్ తో మాత్రమే కాదు... లెమన్ కాఫీ తో కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి తెలుసా...!!

Lemon Coffee : లెమన్ వాటర్ తో మాత్రమే కాదు… లెమన్ కాఫీ తో కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి తెలుసా…!!

కాఫీ మరియు నిమ్మకాయలో ఉండే యాంటీ యాక్సిడెంట్ చర్మానికి ఎంతో మేలు చేస్తాయి. అంతేకాక నిమ్మకాయలో ఉండే విటమిన్ సి శరీరంలోని ఫ్రీ రాడికల్స్ తో పోరాడగలదు. అలాగే శరీరంలోని టాక్సిన్స్ ను బయటకు పంపించటం తో పాటు చర్మానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. అలాగే స్కిన్ కి మంచి గ్లోను కూడా ఇస్తుంది. అంతేకాక చర్మానికి హైడ్రేషన్ అందించి చర్మం ముడతలు రాకుండా కూడా చేస్తుంది. అయితే కాఫీలో ఉండే కెఫిన్ జీవక్రియ మరియు ఆక్సీ కరణాను కూడా మెరుగుపరుస్తుంది. అలాగే నిమ్మకాయ కూడా జీవక్రియను ప్రేరేపిస్తుంది. కావున ఈ రెండిటినీ తీసుకోవడం వలన బరువు తగ్గే అవకాశాలు ఉన్నాయి. కానీ వీటిని అధికంగా కూడా తీసుకోకూడదు. ఎందుకు అంటే ఇది ఎసిడిటీ సమస్యలకు కూడా దారి తీస్తుంది…

Also read

Tags :

ramu

Ramu ( Tandu Ramalingaiah ) is experienced in Media field. He worked in various Telugu media houses for about 15 years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Chief Editor of thetelugunews.com website. Contact Details : thetelugunews1@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి