Diabetes : షుగర్ రావడానికి ముఖ్య కారణం ఇదే… ఇప్పటి నుంచైనా అలర్ట్ గా ఉండండి…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Diabetes : షుగర్ రావడానికి ముఖ్య కారణం ఇదే… ఇప్పటి నుంచైనా అలర్ట్ గా ఉండండి…!

 Authored By prabhas | The Telugu News | Updated on :6 November 2022,6:30 am

Diabetes : ప్రస్తుతం చాలామంది డయాబెటిస్ బారిన పడుతున్నారు. జీవన శైలిలో వచ్చిన మార్పులు, సరైన ఆహారం తీసుకోకపోవడం ఇలా ఎన్నో కారణాల వలన డయాబెటిస్ బారిన పడుతున్నారు. అధిక బరువు ఉన్నవారికి డయాబెటిస్ వచ్చే అవకాశం ఉంది. ఒబిసిటీ వలన ముఖం జబ్బలు పొట్ట లావుగా ఉంటాయి. అలాగే లివర్ కి కూడా ఫ్యాట్ పడుతుంది. లివర్ ఫ్యాట్ కావడం వలన రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడం చేయలేకపోతోంది. మనం తీసుకున్న ఆహారం పొట్ట ప్రేగులను అరిగి చక్కెరగా మారుతుంది. రక్తంలో చేరి కణాలలోకి వెళుతుంది. చక్కెర కణాలలోకి వెళ్లాలంటే లివర్ కొన్ని ఎంజైమ్స్ విడుదల చేస్తుంది. ఒంట్లో కొవ్వు పేరు కోవడం వలన ఎంజైమ్స్ అనేవి విడుదల అవ్వవు.

దీంతో రక్తంలో గ్లూకోస్ లెవెల్స్ పెరుగుతాయి. రక్తంలో గ్లూకోజ్ పెరగటానికి లివర్ ముఖ్య కారణం. లివర్ సరిగ్గా ఉంటే రక్తంలో గ్లూకోస్ లెవెల్స్ పెరగవు. లివర్ అలా అవడానికి ముఖ్య కారణం ఒబీసిటి. ఒబిసిటీ అంటే ఉన్న దాని కంటే పది రెట్లు అధిక బరువు ఉండడం. ఒబిసిటీ, ఫ్యాటీ లివర్ వలన డయాబెటిస్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్నించి బయటపడాలి అంటే ఫ్యాట్ సెల్స్లో ఫ్యాట్ ను తగ్గించుకోవడం ముఖ్యం. మన జీవన శైలిలో మార్పులు తీసుకుంటే ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. మొదటిది రోజుకి రెండుసార్లు తినాలి. ఉదయం పదకొండు గంటలకు భోజనం చేయాలి.

main reason for suffering from diabetes

main reason for suffering from diabetes

ఈ భోజనంలో ఒక ఫుల్కా లేదా రెండు ఫుల్కాలు లేదా జొన్న రొట్టె, కర్రీస్ ని ఎక్కువగా తీసుకోవాలి. కర్రీ తోనే కడుపు నింపాలి. ఆ కర్రీస్ లో నూనె లేకుండా ఉప్పు తగ్గించుకొని తినాలి. ఈలోపు తొమ్మిదిన్నర కల్లా ఏమైనా కావాలంటే వెజిటేబుల్ జ్యూస్ త్రాగడం మంచిది. లేచిన తర్వాత నైట్ పడుకుని దాకా ఏ విధమైన ఆహారాలను తీసుకోకుండా కడుపును నీళ్లతోనే నింపాలి. నిరాహారిగా అలా ఉండడం చాలా మంచిది. సాయంకాలం నాలుగున్నర లేదా ఐదు గంటల మధ్య కొబ్బరి నీళ్లు త్రాగడం మంచిది. ఐదున్నర సమయంలో మొలకలు, జామకాయలు, బాదం పప్పులు, వాల్ నట్లు, కర్పూజ, రేగి కాయ తినడం వలన ఫ్యాటీ లివర్ తగ్గుతుంది. బ్లడ్ లో గ్లూకోస్ లెవెల్స్ కూడా తగ్గిపోతాయి.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది