Healthy Drink : మీ శరీరంలో వంద రోగాలు ఉన్నా.. ఒక్క చెంచా దీన్ని తినండి.. అంతే రోగాలన్నీ పరార్..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Healthy Drink : మీ శరీరంలో వంద రోగాలు ఉన్నా.. ఒక్క చెంచా దీన్ని తినండి.. అంతే రోగాలన్నీ పరార్..!

 Authored By jagadesh | The Telugu News | Updated on :11 July 2021,9:24 pm

Healthy Drink : మనిషంటేనే రోగాలు. ఎప్పుడు ఏ వ్యాధి వస్తుందో ఎవ్వరికీ తెలియదు. ఈరోజుల్లో కల్తీ ఎక్కువైపోయింది. దీంతో రోగాలు కూడా పుట్టలు పుట్టలుగా పుట్టుకొస్తున్నాయి. రోజుకో కొత్త రోగం రావడం.. దాని వల్ల ప్రజలు ఇబ్బందులు పడటం.. లక్షలు లక్షలు ఆసుపత్రుల్లో ఖర్చు పెట్టడం అందరం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా దీర్ఘ కాలిక వ్యాధులు ఎక్కువైపోయాయి. షుగర్, బీపీ, క్యాన్సర్, అస్తమా, గ్యాస్ సమస్యలు, కిడ్నీ సమస్యలు, గుండె జబ్బులు.. ఇలా ఒకటేమిటి.. వందల రకాల రోగాలు మనల్ని చుట్టుముడుతున్నాయి.

methi good for health benefits telugu

methi good for health benefits telugu

షుగర్ వస్తే.. జీవితాంతం మెడిసిన్ వాడాల్సిందే. హైబీపీ వస్తే.. జీవితాంతం మెడిసిన్ వాడాల్సిందే. గ్యాస్ ఉన్నా అంతే.. కిడ్నీ సమస్యలు ఉన్నా అంతే. ఇలా ఏ సమస్య ఉన్నా కూడా ట్యాబ్లెట్లు వాడాల్సిందే. లేదంటే.. ఇంకా సమస్యలు పెరుగుతాయి. ఈరోజుల్లో చాలామందిని మలబద్ధకం కూడా వేధిస్తుంటుంది. మలబద్ధకం సమస్య ఉన్నవాళ్లు అయితే చాలా సమస్యలు ఎదుర్కొంటారు. అయితే.. ఇటువంటి సమస్యలన్నింటికీ పరిష్కారం లేదా? ఇన్ని రోగాలు ఉంటే.. రోజుకు ఎన్ని మందులు వేసుకోవాలి? అటువంటి సమస్యలకు చెక్ పెట్టేందుకు ఒకే ఒక ఆయుర్వేద మందు ఉంది. అదేంటో.. దాన్ని ఎలా వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం.

methi good for health benefits telugu

methi good for health benefits telugu

Healthy Drink : మీ వంటింట్లోనే రోగాలకు చెక్ పెట్టే మందు ఉంది

మీ వంటింట్లోనే ఆ మందు ఉంది. అవే మెంతులు. మెంతులు చేసే మేలు.. తల్లి కూడా చేయదట. మెంతులు ఆరోగ్యానికి చాలా మంచివి. శరీరంలోని వ్యర్థ పదార్థాలను బయటికి పంపించాలన్నా.. కొలెస్టరాల్ ను తగ్గించాలన్నా.. మలబద్ధకం సమస్యకు చెక్ పెట్టాలన్నా.. గ్యాస్ సమస్యలు, అల్సర్, అస్తమా.. కిడ్నీ సమస్యలు, గుండె జబ్బులు, షుగర్, హైబీపీ.. ఇలా అన్ని సమస్యలకు ఒకటే మందు.. మెంతులు.

methi good for health benefits telugu

methi good for health benefits telugu

దాని కోసం మీరు చేయాల్సింది ఒకటే. మెంతులను నానబెట్టి తినడం. రాత్రి పూట మెంతులను నానబెట్టి.. ఉదయాన్నే నానబెట్టిన నీళ్లను తాగాలి. నానిన మెంతులను బాగా నమిలి మింగేయాలి. అలా చేస్తే.. శరీరంలోని టాక్సిన్స్ అన్నీ నాశనం అవుతాయి. మధుమేహం, ఆర్థరైటిస్, ఊబకాయం లాంటి సమస్యలకు మెంతులు మంచి ఔషధం. మెంతులను పొడి చేసుకొని కూడా తినొచ్చు. మెంతులను పొడిచేసి.. గోరు వెచ్చని నీటిలో కలుపుకొని తాగాలి. అలా చేసినా.. మలబద్ధకం సమస్య తగ్గుతుంది. రక్తం శుద్ధి అవుతుంది. రక్తంలోని మలినాలు నాశనం అవుతాయి. గుండెపోటు రాదు. కిడ్నీలు శుభ్రం అవుతాయి. రక్త హీనత తగ్గుతుంది. షుగర్ కంట్రోల్ లో ఉంటుంది. బీపీ కంట్రోల్ లో ఉంటుంది. చూశారు కదా.. ఒక్క మెంతుల వల్ల ఎన్ని ప్రయోజనాలో. మీ వంటింట్లోనే ఉండే మెంతుల వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసుకున్నారు కదా. ఇక ఎందుకు ఆలస్యం. వెంటనే మెంతులను రోజూ తినేయండి.

ఇది కూడా చ‌ద‌వండి ==>  పొద్దు తిరుగుడు గింజల వల్ల ఇన్ని ఆరోగ్య ప్ర‌యోజ‌నాలా.. ఈ విష‌యం తెలిస్తే మీరు అస్స‌లు వ‌ద‌ల‌రు..!

ఇది కూడా చ‌ద‌వండి ==> మేడి పండు + మర్రి పండు = అత్తి పండు.. పోషకాలు నిండు.. ఆరోగ్యం మెండు..

ఇది కూడా చ‌ద‌వండి ==> అలోవేరాలో ఇన్ని ఔషధ గుణాలు ఉన్నాయా..? ఎక్కడ కనిపించినా ముందు ఇంటికి తెచ్చుకోండి..!

ఇది కూడా చ‌ద‌వండి ==> ఆల్ బుఖారా పండ్లను ఎప్పుడైనా తిన్నారా? వర్షాకాలంలోనే దొరికే ఈ పండ్ల ప్రత్యేకత ఏంటో తెలుసా?

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది