Aloo Bukhara : ఆల్ బుఖారా పండ్లను ఎప్పుడైనా తిన్నారా? వర్షాకాలంలోనే దొరికే ఈ పండ్ల ప్రత్యేకత ఏంటో తెలుసా?
Aloo Bukhara : ఆల్ బుఖారా పండ్లు తెలుసు కదా. ఇవి కేవలం వర్షాకాలం సీజన్ లోనే మార్కెట్ లో దర్శనమిస్తాయి. ఇవి నిజానికి మన దగ్గర పండవు. ఇవి ఎక్కువగా హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ లలో పండుతాయి. వర్షాకాలం సీజన్ లో మన మార్కెట్ లో ఎక్కడ చూసినా ఎరుపు రంగులో కనిపించే ఈ పండ్లను చూడగానే లొట్టలేసుకుంటూ తింటారు. అయితే.. ఈ పండ్లను ఏదో టైమ్ పాస్ కు తినడమో.. లేక చూడగానే నోరూరుతున్నాయని తినడమో లేక కాస్త పుల్లపుల్లగా.. తియ్యతియ్యగా ఉంటాయని తినడమో కాదు.. ఈ పండు ను తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఈ పండును తింటే ఎన్నో ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టొచ్చు. ఈ విషయం చాలామందికి తెలియదు. ఆల్ బుఖారా పండ్లను తినడం వల్ల.. ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుంటే.. మీరు అస్సలు ఆగరు. వెంటనే మార్కెట్ కు వెళ్లి వాటిని కొనుక్కొని తినేస్తారు.ఇవి చూడటానికి ఎరువు రంగుతో పాటు నీలం రంగులో కూడా కనిపిస్తాయి. ఈ పండ్లు కాస్త తియ్యదనం తో కాసింత పుల్లగా కూడా ఉంటాయి. అయితే.. వీటిని తినడం వల్ల ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

health benefits of Aloo Bukhara
Aloo Bukhara : మధుమేహం ఉన్నవాళ్లు కళ్లు మూసుకొని ఈ పండును తినేయొచ్చు
మధుమేహం లేదా షుగర్.. ఈ వ్యాధి ఉన్నవాళ్లు.. ఆల్ బుఖారా పండ్లను ఈ సీజన్ లో ఖచ్చితంగా తినాలి. ఎందుకంటే.. ఈ పండులో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. దాని వల్ల.. శరీరంలోని రక్తంలో ఉన్న చక్కెర స్థాయిలు కంట్రోల్ లో ఉంటాయి. ఇందులో పొటాషియం లాంటి మినరల్ ఎక్కువగా ఉంటుంది. అగే.. యాంటీ ఆక్సిడెంట్లు ఈ పండులో పుష్కలంగా ఉంటాయి. ఫ్రీ రాడికల్స్ నుంచి అవి కాపాడుతాయి.

health benefits of Aloo Bukhara
గుండె జబ్బులు ఉన్నవాళ్లు ఈ పండును నిత్యం తీసుకుంటే.. గుండె ఆరోగ్యం బాగుంటుంది. హార్ట్ స్ట్రోక్స్ కూడా రావు. చాలామందికి జీర్ణ సమస్యలు, మలబద్ధకం లాంటి సమస్య ఉంటుంది. అటువంటి వాళ్లు ఖచ్చితంగా ఈ ఫ్రూట్ ను తినాల్సిందే. ఇందులో ఉండే.. ఇసాటిన్, సార్బిటాల్ అనే పదార్థాలు మలబద్ధకాన్ని నివారిస్తాయి.పొటాషియంతో పాటు ఈ పండులో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. ఇది రక్త కణాలను ఉత్పత్తి చేస్తుంది. అలాగే.. రక్త ప్రసరణ కూడా మెరుగు అవుతుంది. ఈ పండులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అది శరీరంలోని కొలెస్టరాల్ ను తగ్గిస్తుంది. ఈ పండులో ఉండే.. బోరాన్ ఎముకలను ధృడంగా చేస్తుంది.

health benefits of Aloo Bukhara
ఇది కూడా చదవండి ==> Sugar Vs Honey : పంచదార కన్నా తేనె మంచిది… ఎందుకో మీకు తెలుసా?..
ఇది కూడా చదవండి ==> ఈ సీజన్ లోనే దొరికే ఈ పండు కనిపిస్తే అస్సలు వదలకండి.. దీని రహస్యం తెలిస్తే షాక్ అవుతారు?
ఇది కూడా చదవండి ==> సీతాఫలం పండు మాత్రమే కాదు.. దాని ఆకుల వల్ల ఎన్ని లాభాలో తెలుసా?
ఇది కూడా చదవండి ==> డ్రాగన్ ఫ్రూట్ ఒక్క పండు తింటే చాలు.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు.. మందుల అవసరమే లేదు..