Athi Pandu : మేడి పండు + మర్రి పండు = అత్తి పండు.. పోషకాలు నిండు.. ఆరోగ్యం మెండు..
Athi Pandu , Anjeer Fruit : మీకు అత్తి పండు Anjeer Fruit గురించి తెలుసా?. తెలియకపోతే కనీసం అంజూర పండు Anjeer Fruit గురించైనా విన్నారా?. ఇవి రెండూ వేర్వేరు కాదు. ఒక్కటే. కాకపోతే రెండు పేర్లతో పిలుస్తారు. అంతే. ఆ రెండు పేర్లకు తగ్గట్లే ఇది రెండు పండ్ల (మేడి పండు, మర్రి పండు) మాదిరిగా కనిపిస్తుంది. సైజు పెద్దగా ఉంటుంది. పక్వానికి వచ్చాక ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. అందుకే డ్రై ఫ్రూట్ రూపంలో అందుబాటులో ఉంచుతారు. అత్తి పండును డ్రై ఫ్రూట్ గా తిన్నా, ఫ్రెష్ గా తిన్నా పోషకాలు, విటమిన్ల విషయంలో తేడా ఉండదు. రేటు కూడా కొంచెం ఎక్కువ పలుకుతుంది. అయినా కొనొచ్చు. తినొచ్చు. ఎందుకంటే ఆరోగ్యానికి చాలా మంచిది. కాయలా ఉన్నప్పుడు పుల్లగా, వగరుగా ఉంటుంది. ఎంత బాగా పండితే అంత తియ్యగా మారుతుంది.
ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా పది.. Anjeer Fruit
అంజూర పండులో ఐదు విటమిన్లు ఉన్నాయి. అవి.. విటమిన్ ఏ, ఇ, కె, బి1, బీ12. బలాన్నిచ్చే న్యూట్రియెంట్స్ కూడా ఐదు (ఐరన్, క్యాల్షియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం, మాంగనీస్) అత్తి పండులో లభిస్తున్నాయి. ఈ పండు పొట్టులో పీచు పదార్థం నిండి ఉంటుంది. కాబట్టి జీర్ణం విషయంలో ఇబ్బంది ఉండదు. అధిక శారీరక బరువుతో బాధపడేవాళ్లు అంజీర పండును తినటం ఉత్తమ మార్గం. ఉపశమనం దొరుకుతుంది. అత్తి పండులో చిన్న చిన్న విత్తనాలు ఉంటాయి. వాటిని తింటే మన పేగు గోడలు బలపడతాయి. హుషారుగా తయారవుతాయి. పేగు క్యాన్సర్ కు సైతం అంజీర పండు చక్కని పరిష్కారం.
సర్వ రోగ.. Anjeer Fruit
అత్తి పండు Anjeer Fruit ను ఒక విధంగా సర్వ రోగ నివారిణిలా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ ఫలాన్ని రాత్రి పూట నానబెట్టి పొద్దున్నే తిన్నవాళ్లలో పైల్స్ (మొలల) సమస్య ఉండదు. ఒంట్లో వేడి తగ్గుతుంది. బాడీ హీట్ తగ్గాలంటే అంజూర పండును, కలకండను కలిపి రాత్రి పూటంతా అలాగే నిల్వ చేసి పరిగడుపునే తినాలి. అత్తి పండు Anjeer Fruit ను తింటే బీపీ సైతం కంట్రోల్ లో ఉంటుంది. రక్త హీనత బాధితులకు అంజూర పండు అద్భుతంగా పనిచేస్తుంది. హీమోగ్లోబిన్ ను పెంచుతుంది. అత్తి పండులో ఉండే పెక్టిన్లు మన శరీరంలోని విష పదార్థాలను తొలగించి రక్త ప్రసరణ పర్ఫెక్టుగా జరిగేలా తోడ్పడతాయి. కాబట్టి అంజూర పండును రోజూ ఏదో ఒక రూపంలో తింటే సంపూర్ణ ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. ఎవ్వర్ గ్రీన్ యంగ్ మ్యాన్ లా కనిపించొచ్చు.
ఇది కూడా చదవండి ==> Sugar Vs Honey : పంచదార కన్నా తేనె మంచిది… ఎందుకో మీకు తెలుసా?..
ఇది కూడా చదవండి ==> ఈ సీజన్ లోనే దొరికే ఈ పండు కనిపిస్తే అస్సలు వదలకండి.. దీని రహస్యం తెలిస్తే షాక్ అవుతారు?
ఇది కూడా చదవండి ==> సీతాఫలం పండు మాత్రమే కాదు.. దాని ఆకుల వల్ల ఎన్ని లాభాలో తెలుసా?
ఇది కూడా చదవండి ==> డ్రాగన్ ఫ్రూట్ ఒక్క పండు తింటే చాలు.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు.. మందుల అవసరమే లేదు..