Papaya and pomegranate : బొప్పాయి దానిమ్మ కలిపి తీసుకుంటే ఎన్ని ప్రయోజనాలో…!
ప్రధానాంశాలు:
Papaya and pomegranate : బొప్పాయి దానిమ్మ కలిపి తీసుకుంటే ఎన్ని ప్రయోజనాలో...!
Papaya and pomegranate : బొప్పాయి మరియు దానిమ్మ పండ్లు ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే బొప్పాయిలో ఫైబర్ విటమిన్ సి మరియు యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా లభిస్తాయి. అదేవిధంగా దానిమ్మ పండులో కూడా శరీరానికి మేలు చేసే విటమిన్ సి తో సహా అనేక రకాల పోషకాలు లభిస్తాయి. అయితే ఈ రెండు పండ్లను కలిపి తీసుకోవడం మంచిదేనా..? అలా తీసుకుంటే ఏమవుతుందో తెలుసా..? మరి ఆ విషయాలను ఇప్పుడు మనం చర్చిద్దాం.
దానిమ్మ పండులో ఎలా గిటానిక్స్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉంటాయి. ఇక ఈ దానిమ్మను ప్రతిరోజు తీసుకోవడం వలన శరీరంలో వాపు తగ్గుతుంది. అంతేకాక రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచి రక్తహీనత సమస్య రాకుండా చూస్తుంది. అదేవిధంగా మొటిమలు నల్లటి మచ్చలు వంటివి తొలగించడానికి కూడా ఇది ఎంతగానో సహాయపడుతుంది. అలాగే చుండ్రు జుట్టు రాలే సమస్యను తగ్గించడానికి కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.
అయితే బొప్పాయి మరియు దానిమ్మ పండును కలిపి తీసుకోవడం వలన అనేక రకాల ప్రయోజనాలు చేకూరుతాయని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు అనేక రకాల వ్యాధుల నుండి మనల్ని ఇది రక్షిస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఈ రెండు పండ్లను కలిపి తీసుకోవడం వలన ఎర్ర రక్త కణాలను ప్రోత్సహిస్తాయి. తద్వారా శరీరంలో రక్తహీనత రక్త కొరత ఉండదు.
అంతేకాక ఇది ఇమ్యూనిటీ బూస్టింగా కూడా పనిచేస్తుంది. ఇదే సమయంలో మలబద్ధకం, ఉబకాయం వంటి సమస్యలను దూరం చేసేందుకు సహాయపడుతుంది. కాబట్టి ఈ రెండు పండ్ల ను కలిపి జ్యూస్ చేసుకుని ప్రతి వారంలో రెండు లేదా మూడుసార్లు తీసుకోవడం వలన ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.
గమనిక : పైన పేర్కొనబడిన కథనాన్ని ఇంటర్నెట్ లో దొరికే సమాచారం ఆధారంగా రూపొందించడం జరిగింది.ది తెలుగు న్యూస్ దీనిని ధ్రువీకరించలేదు. దయచేసి గమనించగలరు.