Paracetamol : బి కేర్ ఫుల్.. పారాసెట్ మాల్ టాబ్లెట్ లు పదే పదే వేసుకుంటున్నారా..? ఈ విషయాలు తెలిస్తే మీ గుండె జల్లు మంటుంది…!
ప్రధానాంశాలు:
Paracetamol : బి కేర్ ఫుల్.. పారాసెట్ మాల్ టాబ్లెట్ లు పదే పదే వేసుకుంటున్నారా..?ఈ విషయాలు తెలిస్తే మీ గుండె జల్లు మంటుంది...!
Paracetamol : టాబ్లెట్ల గురించి అవగాహన ఉన్నవారికి పారాసెట్ మాల్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తలనొప్పి, జ్వరం, ఒళ్ళు నొప్పులు ఇలా ఏ సమస్య వచ్చినా డాక్టర్ తో సంబంధం లేకుండా టాబ్లెట్ వేసుకుని పడుకుంటారు. కొన్ని సంవత్సరాలపాటు నిరూపితమైన సమర్థతతో ఈ టాబ్లెట్లు అవాంతరాలు లేకుండా వేగంగా పనిచేసే ఎలాంటి నొప్పి నుంచైనా ఉపసంహాన్ని కలిగిస్తాయి.అయితే ఈ పారా సెట్ మాల్ వాడితే ప్రమాదమని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. ఆ ప్రమాదాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.
గర్భంతో ఉన్నప్పుడు ఈ టాబ్లెట్లను వేసుకుంటే పుట్టబోయే బిడ్డకు ఎఫెక్ట్ పడుతుందని పిల్లలు జన్మించిన తర్వాత రోగనిరోధక శక్తి సామర్థ్యం తగ్గుతుంది. ప్రాథమికంగా ఈ పరిశోధన ఎలుకలపై చేశారు. వాటికి టాబ్లెట్స్ వరుసగా ఇస్తూ వచ్చారు. ఈ టాబ్లెట్లు ఇచ్చిన 24 గంటల వరకు వాటికి ఎటువంటి ఎఫెక్ట్ రాలేదు. కానీ వారం తర్వాత నుంచి వాటిల్లో టెస్ట్ రా ఉత్పత్తి 45% తగ్గిపోయిందట. అందుకే ఈ టాబ్లెట్లు మనుషులపై కూడా ఇదే రకమైన ప్రభావం చూపుతాయని పరిశోధకులు నిర్ధారణకు వచ్చారు..
అయితే ఈ టాబ్లెట్ అదిగా మోతాదులో తీసుకునే వారిపై ఎక్కువ ప్రభావాలు కనిపిస్తున్నాయని నిపుణులు చెప్తున్నారు. దీర్ఘకాలిక నొప్పి ఉన్న వ్యాధిగ్రస్తులకు రోజుకి నాలుగు గ్రాముల పారాసెట్ మాల్ సరిపోతుందని చెప్పారు. అయితే దీనిని అధికంగా వినియోగిస్తే కొన్ని అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు. కొన్ని సమయాలలో పారాసిట్ మాల్ ఎక్కువగా వాడటం వలన కాలయాన్ని దెబ్బతీసే అవకాశం ఉంటుంది. కాబట్టి టాబ్లెట్లు వేసుకోకపోవడమే ఉత్తమం. ఒకవేళ అత్యవసరమైతే వైద్యులు సలహా మేరకు తక్కువ మందులను వాడాలి.