Paracetamol : పారాసెటమాల్ అతిగా వాడుతున్నారా? బీ కేర్ ఫుల్..
Paracetamol : ఒంట్లో చిన్న అసౌకర్యంగా అనిపించినా పారాసెటమాల్ వేసేస్తుంటాం. ఇక కాస్త జలుబు, జ్వరం అనిపించినా మనలో చాలా మంది వైద్యులను సంప్రదించకుండానే పారాసెటమాల్ లేదా డోలో ట్యాబ్లెట్ వేసుకుంటారు. కరోనాకంటే ముందుకు ఇలాంటి అలవాటు చాలా మందికి ఉండేది. కానీ ప్రస్తుతం కరోనా సమయంలో ఇలా చేయడం మంచిది కాదని చెబుతున్నారు డాక్టర్లు. ఏయే మాత్రలు ఎలాంటి సమయంలో ఎంత మేరకు తీసుకోవాలనే దానిపై అవగాహన ఉండాలని సూచిస్తున్నారు.
లేదంటే వైద్యులను సంప్రదించాలని అలా కాకుండా ఇష్టం వచ్చినట్టుగా ట్యాబ్లెట్స్ మింగితే అనారోగ్య సమస్యలు మరింత పెరుగుతాయని హెచ్చరిస్తు్న్నారు.చిన్నపిల్లలు మొదలు పెద్దల వరకు జ్వరం వచ్చిన సమయంలో వారికి ఉన్న దీర్ఘకాలిక వ్యాధులు, వారి ఎత్తు, బరువు ఆధారంగా ట్యాబ్లెట్ మోతాదు డాక్టర్లు నిర్ణయిస్తారని వైద్య నిపుణులు చెబుతున్నారు. పెద్ద వారు జ్వరంతో బాధపడితే 4 నుంచి 6 గంటల మధ్య పారాసెటమాట్ టాబ్లెట్ 300mg – 650 mg తీసుకోవాలట. 6 గంటల తర్వాత 500mg తీసుకోవాలట. ఇక పిల్లలకు జ్వరం వస్తే నెల కంటే తక్కువగా వయస్సున్న వారు 10 నుంచి 15 mg పారాసెటమాల్ తీసుకోవాలి.
Paracetamol : వ్యాధులను బట్టి తీసుకోవాలట..
దీనిని 4 నుంచి 6 గంటల మధ్య వ్యవధిలో ఇవ్వాలి. 12 ఏళ్ల లోపు ఉన్న పిల్లలందరికీ ఇలాగే ఇవ్వాలి. జ్వరం రాగానే 2 నుంచి 3 గంటల్లో ట్యాబ్లెట్స్ వేసుకోవడం చాలా డేంజర్ అని చెబుతున్నారు వైద్య నిపుణులు. కంటిన్యూగా 3 రోజుల పాటు పారాసెటమాల్ ట్యాబ్లెబ్ వేసుకున్నా.. జ్వరం తగ్గకుండా వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి. అంతే కానీ డాక్టర్ల సలహా తీసుకోకుండా రోజుల తరబడి ట్యాబ్లెట్స్ వాడటం మంచిది కాదు. దీని వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ప్రమాదముంది. సో.. ట్యాబ్లెట్ వాడే ముందు బీ కేర్ ఫుల్..