Pistachios : పిస్తా పప్పు తింటున్నారా… ఇది తెలిస్తే ఆశ్చర్యపోతారు..!
ప్రధానాంశాలు:
Pistachios : పిస్తా పప్పు తింటున్నారా... ఇది తెలిస్తే ఆశ్చర్యపోతారు..!
Pistachios : వాతావరణాన్ని బట్టి కొన్ని ఆహార పదార్థాలు మన శరీరానికి ఎంతో మేలు ని కలిగిస్తాయి. ఇలాంటి ఆహార పదార్థాలను తీసుకోవడం వలన మన శరీరంలో రోగ నిరోధక శక్తి అధికంగా పెరుగుతుంది. అటువంటి ముఖ్య పదార్థాలలో పిస్తా పప్పు ఒకటి. శీతాకాలంలో పిస్తా పప్పును తీసుకున్నట్లయితే శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలను మనకి అందిస్తుందని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు.ముఖ్యంగా పిస్తా పప్పులు జింక్ అధికంగా ఉండడం వలన ఇది రోగనిరోధక ఆరోగ్యాన్ని కాపాడడంలో ఉపయోగపడే ప్రతి నిరోధకాల ను ఉత్పత్తి చేయడంలో సహాయపడుతుంది. ఇక పిస్తా పప్పులో విటమిన్ B6 శరీరంలోని రోగనిరోధక శక్తి పనితీరుకు అవసరమైన ప్రతిరోధకాలను ఉత్పత్తి చేయడానికి ఉపయోగపడతాయి. అదేవిధంగా సెలీనియం యాంటీ ఆక్సిడెంట్ గా పని చేసి కణాలు దెబ్బ తినకుండా కాపాడుతుంది.
![Pistachios పిస్తా పప్పు తింటున్నారా ఇది తెలిస్తే ఆశ్చర్యపోతారు](https://thetelugunews.com/wp-content/uploads/2025/02/Pistachios.jpg)
Pistachios : పిస్తా పప్పు తింటున్నారా… ఇది తెలిస్తే ఆశ్చర్యపోతారు..!
Pistachios పిస్తా పప్పు ఆరోగ్యకరమైన గొప్ప ఆహారం
ముఖ్యంగా పిస్తా పప్పులో ఉండే జింక్ వైరల్ ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని మరియు తీవ్రతను తగ్గిస్తుంది. ఆరోగ్య నిపుణుల అధ్యయన ప్రకారం చూసుకున్నట్లయితే పిస్తా పప్పు సంతృప్తికరమైర, ఆరోగ్యకరమైన గొప్ప ఆహారం. అంతేకాకుండా ఇది శరీరానికి కావలసిన ముఖ్యమైన అనేక పోషకాలను అందిస్తుంది. ముఖ్యంగా దృష్టిలోపం ఉన్నవారు పిస్తా పప్పు వారికి ఎంతో మేలును కలిగిస్తుంది. ఎందుకంటే పిస్తా పప్పులో AMD, కంటి శుక్లాలు కళ్ళ పై ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి. దీనివలన కంటి దృష్టిని కాపాడుకోవచ్చు.
పిస్తా పప్పులు లోని పాలి ఫైనాల్స్ , మరియు కెరోటినాయిడ్లు రోగనిరోధక కణాల యొక్క పనితీరును పెంచుతాయి. ఇక పిస్తాలో ఉండే ప్రీబయోటిక్ లక్షణాలు పేగులోని బ్యాక్టీరియాను పోషిస్తుంది. అదేవిధంగా శ్లేష్మ పొర నిరోధక వ్యవస్థను నియంత్రించడంలో ముందుంటుంది.ఇన్ని విధాలుగా ఉపయోగపడే పిస్తా పప్పును ప్రతిరోజు మీ ఆహారంలో చేర్చుకోవడం ఎంతో అవసరం. ఇక పిస్తా పప్పు లోని పోషక విలువలు ఆరోగ్యాన్ని కాపాడి అవసరమైన పోషకాలను అందించడంలో ఉపయోగపడతాయి. వీటిని సలాడ్ మరియు ఇతర ఏదైనా డెజర్ట్‌లలో కూడా వేసుకోవచ్చు.