Pollution Cough : కాలుష్యం కారణంగా వచ్చే దగ్గును నివారించాలంటే… ఈ ఇంటి చిట్కాలు పాటించండి…??
Pollution Cough : దీపావళి పండుగ సందర్భంగా ఢిల్లీ ఎన్ సి ఆర్ తో సహా ఎన్నో ప్రాంతాలలో కాలుష్యం బాగా పెరిగిపోతుంది. అలాగే రాజధాని అయిన ఢిల్లీలో కూడా సగటు గాలి నాణ్యత సూచీ 556 గా నమోదయింది. అలాగే పెరుగుతున్నటువంటి గాలి కాలుష్యం కారణంగా ప్రజల ఆరోగ్యం కూడా బాగా దెబ్బతింటుంది. అంతేకాక విషపూరితమైన గాలి కారణం చేత శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది మరియు దగ్గు, గొంతు నొప్పి, కాళ్ల మంటలు లాంటి సమస్యలు వస్తాయి. […]
ప్రధానాంశాలు:
Pollution Cough : కాలుష్యం కారణంగా వచ్చే దగ్గును నివారించాలంటే... ఈ ఇంటి చిట్కాలు పాటించండి...??
Pollution Cough : దీపావళి పండుగ సందర్భంగా ఢిల్లీ ఎన్ సి ఆర్ తో సహా ఎన్నో ప్రాంతాలలో కాలుష్యం బాగా పెరిగిపోతుంది. అలాగే రాజధాని అయిన ఢిల్లీలో కూడా సగటు గాలి నాణ్యత సూచీ 556 గా నమోదయింది. అలాగే పెరుగుతున్నటువంటి గాలి కాలుష్యం కారణంగా ప్రజల ఆరోగ్యం కూడా బాగా దెబ్బతింటుంది. అంతేకాక విషపూరితమైన గాలి కారణం చేత శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది మరియు దగ్గు, గొంతు నొప్పి, కాళ్ల మంటలు లాంటి సమస్యలు వస్తాయి. అలాగే కాలుష్యం వలన వచ్చే దగ్గుతో ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు. ఈ దగ్గు అనేది పెరిగినప్పుడు దీని కారణం చేత కడుపు మరియు పక్కటెముకలు నొప్పి కూడా స్టార్ట్ అవుతుంది. మీరు కూడా ఇటువంటి సమస్యలు ఎదుర్కొంటుంటే దగ్గు నుండి ఉపశమనం పొందాలి అని అనుకుంటే కొన్ని ఇంటి చిట్కాలను పాటించాలి. వీటితో దగ్గను చాలా వరకు కంట్రోల్ లో ఉంచుకోవచ్చు. అయితే ఆ చిట్కాలు ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం…
అల్లం : కాలుష్యం వలన వచ్చే దగ్గును వదిలించుకోవాలి అని అనుకుంటే దానికి బెస్ట్ అల్లం అని చెప్పొచ్చు. దీనిలో యాంటీ మైక్రో బయల్ మరియు యాంటీ ఇన్ ఫ్లమెంటరీ గుణాలు కూడా ఉన్నాయి. ఇవి దగ్గు నుండి ఉపశమనాన్ని కలిగిస్తాయి. దీనికోసం తేనెలో చిన్న అల్లం ముక్కను కలుపుకొని తినడం వలన ప్రయోజనకరంగా ఉంటుంది…
తేనే : దగ్గు సమస్యతో ఇబ్బంది పడే వారికి తేనె చాలా బాగా ఉపయోగపడుతుంది. దీనిలో డెక్స్ట్రా మెథోర్ఫాన్ అనే మూలకం ఉన్నది. కాబట్టి తేనే అనేది కఫాన్ని తగ్గిస్తుంది. దీనికోసం మీరు ఒక చెంచా తేనే ను తీసుకోవచ్చు లేకుంటే గోరువెచ్చని వాటర్ లో కలుపుకొని కూడా తీసుకోవచ్చు…
ఉప్పు నీటితో పుక్కిలించడం : మీరు ఉప్పు నీటితో పుక్కిలించడం వలన ఊపిరితిత్తులు మరియు శ్వాసకోశ వ్యవస్థ క్లీన్ అవుతుంది. ఇది గొంతు నొప్పి మరియు దగ్గు నుండి కూడా ఉపసమనం కలిగిస్తుంది. దీనికోసం ఒక అర కప్పు గోరువెచ్చని నీటిలోకి ఒక అర చెంచా ఉప్పు కలుపుకోవాలి. ఈ ఉప్పు నీటిని రోజుకు రెండు సార్లు అయినా పొక్కులించాలి. మీరు ఇలా చేస్తే చాలా ప్రయోజనం ఉంటుంది…
ఆవిరి పట్టడం : దగ్గు సమస్యతో ఇబ్బంది పడేవారు దాని నుండి ఉపశమనం పొందాలి అంటే ఆవిరి పట్టాలి. మీరు రోజుకు రెండుసార్లు 10 నుండి 15 నిమిషాల పాటు ఆవిరి పడడం వలన సమస్య నుండి ఉపశమనం పొందవచ్చు. అలాగే దగ్గు సమస్యతో ఇబ్బంది పడేవారు ఆవిరి పడితే చాలా ప్రయోజనం ఉంటుంది