Belly Fat : బెల్లీ ఫ్యాట్ ను తగ్గించే బెస్ట్ డ్రింక్… బరువు కూడా తగ్గుతారు…!
ప్రధానాంశాలు:
Belly Fat : బెల్లీ ఫ్యాట్ ను తగ్గించే బెస్ట్ డ్రింక్... బరువు కూడా తగ్గుతారు...!
Belly Fat : ప్రస్తుతం మారుతున్న లైఫ్ స్టైల్ మరియు ఆహారపు అలవాట్ల కారణం వలన బరువు పెరగటం మరియు పొట్ట ఎక్కువగా పెరగటం సహజం. దీనికి తోడుగా వర్కౌట్ చేయకపోవడంతో చాలా మంది బరువు పెరుగుతూ ఉన్నారు. సాధారణంగా మగవారి కంటే ఆడవారు తొందరగా బరువు పెరుగుతున్నారు. ఊబకాయం అనేది జన్యు లేక ఏవైనా ఆరోగ్య సమస్యల కారణం వలన కూడా రావచ్చు. దీనిని తగ్గించడానికి నేడు బెస్ట్ డ్రింక్ గురించి తెలుసుకుందాం.
Belly Fat : అల్లం
ఈ అల్లం లో ఎన్నో అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయి. దీనిలో యాంటీ ఆక్సిడెంట్ కణాలు ఆరోగ్యానికి ఎంతో మంచిది. కొవ్వులు కరిగించడంలో కూడా అల్లం అనేది ముందు ఉంటుంది. దీనిలో యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ చాలా సమస్యలను దూరం చేస్తాయి. ఆకలిని తగ్గించడంలో కూడా ముందు ఉంటుంది. అల్లం లో ఔషధ గుణాలు ఎక్కువగా ఉన్నాయి. కావున కొలెస్ట్రాల్, మధుమేహాన్ని తగ్గించడంలో కూడా ఇది ఎంతో బాగా పనిచేస్తుంది. ఫ్యాటీ లివర్ లాంటి సమస్యల నుండి కూడా లివర్ ను రక్షిస్తుంది…
Belly Fat నిమ్మరసం
నిమ్మరసం బరువు తగ్గేందుకు కూడా బాగా హెల్ప్ చేస్తుంది. నిమ్మరసంలో ఎన్నో అద్భుత గుణాలు ఉన్నాయి. నిమ్మరసం తీసుకోవటం వలన శరీరంలో అదనపు కొవ్వు దూరం అవుతుంది. దీనిలో ఆమ్ల స్వభావం అనేది ఎక్కువగా ఉంటుంది. కావున నిమ్మకాయతో పాటు ఇతర పదార్థాలను కలిపి తీసుకుంటే కడుపు ఉబ్బరం ఈజీగా తగ్గుతుంది…
పసుపు : కిచెన్ లో వాడేటువంటి మసాలా పదార్థాలలో పసుపు కూడా ఒకటి. పసుపులో ఆరోగ్య ప్రయోజనాలతో పాటుగా సౌందర్య ప్రయోజనాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. అందుకే పసుపులో కర్కు మిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. దీన్ని తీసుకోవటం వలన కడుపుకు సంబంధించిన సమస్యల నుండి జీవక్రియ సమస్యలు మరియ ఊబకాయ సమస్యలు అనే ఇతర ఆరోగ్య సమస్యలను కూడా దూరం చేయగలదు. మంటను తగ్గించడంలో కూడా ఈ పసుపు అనేది ముందు ఉంటుంది.
దాల్చిన చెక్క : దాల్చిన చెక్కలో యాంటీ ఇన్ఫ్లమెంటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు అనేవి ఉంటాయి. ఇవి బరువు తగ్గేందుకు కూడా చక్కగా హెల్ప్ చేస్తాయి. జీవక్రియను మెరుగుపరిచే గుణాలు దీనిలో ఎక్కువగా ఉన్నాయి. కావున దీనిని ఎక్కువగా తీసుకోవడం వలన శరీరం నుండి వ్యర్ధాలు బయటకు పోతాయి. బరువు తగ్గేందుకు కూడా దాల్చిన చెక్కతో టీ ని చేసుకొని తాగొచ్చు…
జిలకర్ర : బెల్లీ ఫ్యాట్ తగ్గించటంలో కూడా జీలకర్ర ముందు ఉంటుంది. జిలకర్ర శరీరంలోని కొవ్వుని,బెల్లీ ఫ్యాట్ ని తగ్గించటమే కాకుండా చాలా లాభాలను కూడా అందిస్తుంది. గ్యాస్,ఎసిడిటీ లాంటి సమస్యలు కూడా దీని వలన దూరం అవుతాయి. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఇవి శరీరంలోని జీవక్రియలను స్పీడ్ అప్ కూడా చేస్తాయి…
ఈ డ్రింక్ ఎలా తయారు చేయాలి
ఒక కప్పు నీటిలో చిన్న అల్లం ముక్క,స్పూన్ జీలకర్ర, దాల్చిన చెక్క ముక్క, లవంగాలు వేసి బాగా మరిగించుకోవాలి. ఈ నీరు రంగు మారగానే దించి వడకట్టాలి. ఇది కొద్దిగా గోరువెచ్చగా మారాక నిమ్మరసం అనేది కలిపి తాగాలి. ఇది ఉదయం సాయంత్రం టీ,కాఫీలకు బదులుగా తీసుకోవచ్చు. రెగ్యులర్ గా తాగితే బెల్లీ అనేది తగ్గుతుంది…