Heart Attack : హార్ట్ ఎటాక్ వస్తుందని టెన్షన్ పడుతున్నారా..? ఇలా వారం రోజులు చేస్తే చాలు.. | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Heart Attack : హార్ట్ ఎటాక్ వస్తుందని టెన్షన్ పడుతున్నారా..? ఇలా వారం రోజులు చేస్తే చాలు..

Heart Attack : పైన్ నట్స్ వంటివి మనకు ఎక్కువగా తెలియవు. కానీ వీటిని విదేశాల్లో ఎక్కువగా తింటారు. ఇవి ఎక్కువగా ఖరీదైనవి. ఇవి రుచికరంగా ఉండటంతో పాటు ఆరోగ్యాన్ని సైతం అందిస్తాయి. ఇందులో విటమిన్లు, ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి గుండె పని తీరుకు చాలా ఉపయోగపడతాయి. వాటిల్లో కొవ్వు ఎక్కువగా ఉన్నప్పటికీ అవి తక్కువ సంతృప్త కొవ్వును కలిగి ఉంటాయి. పైన్ గింజల సర్వింగ్‌లో ఆరోగ్యానికి మంచి చేసే ప్రొటీన్లు, కొవ్వులు, ఫైబర్ వంటివి […]

 Authored By mallesh | The Telugu News | Updated on :3 March 2022,2:30 pm

Heart Attack : పైన్ నట్స్ వంటివి మనకు ఎక్కువగా తెలియవు. కానీ వీటిని విదేశాల్లో ఎక్కువగా తింటారు. ఇవి ఎక్కువగా ఖరీదైనవి. ఇవి రుచికరంగా ఉండటంతో పాటు ఆరోగ్యాన్ని సైతం అందిస్తాయి. ఇందులో విటమిన్లు, ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి గుండె పని తీరుకు చాలా ఉపయోగపడతాయి. వాటిల్లో కొవ్వు ఎక్కువగా ఉన్నప్పటికీ అవి తక్కువ సంతృప్త కొవ్వును కలిగి ఉంటాయి. పైన్ గింజల సర్వింగ్‌లో ఆరోగ్యానికి మంచి చేసే ప్రొటీన్లు, కొవ్వులు, ఫైబర్ వంటివి ఉంటాయి. ఇవి రక్తంలోని షుగర్ లెవల్స్‌ను కంట్రోల్ చేస్తాయి.

ఈ గింజల్లో ప్రొటోన్స్, మెగ్నీషియం, ఐరన్ వంటివి ఉంటాయి.కాబట్టి దీని వల్ల శక్తి లభిస్తుంది. ఇందులో ఉంటే యాంటీ ఆక్సిడెంట్స్ చర్మాన్ని ఆరోగ్యంగా, యవ్వనంగా ఉంచేందుకు హెల్ప్ చేస్తాయి. దీని వల్ల గుండె ఆరోగ్యానికి సహాయపడే పోషకాలుంటాయి.ఈ గింజలను వారంలో మూడు సార్లు తీసుకోవడం మంచింది. దీని వల్ల హార్ట్ ఎటాక్ ను అరికట్టవచ్చు. వీటితో పాటు ప్రతి రోజూ ఔన్స్ గింజలు తినాలి. దీని వల్ల గుండె జబ్బులను తగ్గించుకోవచ్చు. పైన్ గింజల్లో ఉండే కొవ్వులు చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించేందుకు సహాయపడుతుంది.ఈ గింజల తినడం వల్ల మధుమేహాన్ని నివారించవచ్చు.

prevention of Heart Attack with pine nuts

prevention of Heart Attack with pine nuts

Heart Attack : వారానికి మూడు సార్లు తీసుకుంటే..

పైన్ గింజల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్ ఎక్కువగా ఉంటాయి. ఇవి మెదడులోని కణాలను నిర్మించడంలో మరమ్మతు చేయడంలో ఉపయోగపడతాయి. వీటి వల్ల మెదడు ఆలోచన తీరులోనూ మార్పు వస్తుంది. మరి మీరు కూడా ఈ గింజలను తినడం ప్రారంభించండి.. వీటి ధర కాస్త ఎక్కువే అయినా.. ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడతాయి. ఆరోగ్యం కంటే డబ్బులు ఎక్కువేం కాదుగా.. వీటిని తీసుకోవడం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు చేకూరుతాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు.

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది