Fruits : పరిగడుపున ఈ పండ్లను తింటున్నారా… అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలి…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Fruits : పరిగడుపున ఈ పండ్లను తింటున్నారా… అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలి…!

 Authored By aruna | The Telugu News | Updated on :31 July 2023,5:00 pm

Fruits : పండ్లు ఎప్పుడు తినాలి.. ఆహారానికి ముందా తర్వాత ఈ విషయాన్ని మేము మీకు ఇప్పుడు తెలియజేయబోతున్నాం. చాలామంది పరగడుపున అంటే నిద్ర లేచాక టిఫిన్ లేదా భోజనం ఏదో ఒకటి తినకుండా పండ్లను ఆహారంగా స్వీకరిస్తూ ఉంటారు. అలా తీసుకోకూడదు.. చాలా కాలంగా మన పెద్దవాళ్ళు చెబుతూనే వస్తున్నారు. కడుపులో ఏది పడకుండా పండ్ల ముక్కలు ఆరగిస్తే పొట్టలో ప్రమాదకరమైన రసాయనాలకు అది దారితీస్తుందని.. ఇటీవలే వైద్య అధ్యయనాలు కూడా ఈ విషయాన్ని తెలిపాయి.. ఉదయాన్నే నిద్ర లేచిన వెంటనే ఏదైనా పండ్లు తీసుకుంటే అదే ప్రమాదకరమని పెద్దలు కూడా పిల్లలను అరిచేవారు.

కానీ ఇప్పుడు పొట్టలో ఏమీ లేకుండా ఆహారంగా పండ్లు తీసుకుంటేనే మంచితనం కూడా అంటున్నారు. ఖాళీ కడుపుతో ఉన్నప్పుడే పండ్లు తినడం మంచిదని కొందరు వైద్య నిపుణులు సూచన.. ఆహారంతో కడుపు నింపేసిన తర్వాత కంటే ఖాళీ కడుపుతో తినడం వలన ఎక్కువ ఫలితాలను పొందవచ్చు. శరీరంలో నుంచి మలినాలు తొలగించే కార్యక్రమంలో పండ్లు కీలకమైన పాత్రను పోషిస్తాయి. ఉదాహరణకు ఏదైనా ఆహారాన్ని తీసుకొని తర్వాత పండు తిన్నారు అని అనుకుందాం.. చిన్న పండు నేరుగా కడుపులోకి అక్కడ నుంచి పేగుల్లోకి వెళుతుంది. కానీ పండు తినడానికి ముందు తీసుకున్న ఆహారం పండును పేగుల్లోకి వెళ్ళకుండా అడ్డుకుంటుంది. ఇక జీర్ణ రసాయన విడుదలతో ఆహారం పండు అన్నీ కలిసి ఆసిడ్స్గా అది గ్యాస్ గా ఫామ్ అవుతుంది.

regularly must Eat these fruits

regularly must Eat these fruits

పండ్లను ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు తీసుకోవడం వలన కేసాల రంగు వెలసిపోదు.. జుట్టు రాలడం తగ్గుతుంది. కళ్ళ చుట్టూ నల్లటి చారికలు ఒత్తిడి ఉండదని వైద్యులు అంటున్నారు.. అయితే ఈ అధ్యయనాలు సంపూర్ణ ఆరోగ్యవంతులకు అనారోగ్యవంతులకు మధ్య తేడాను చెప్పడం లేదు.. పైగా మాత్రలు వేసుకున్న తర్వాత పండ్లను తీసుకుంటే ఆ మాత్రను ప్రభావం బాగా తగ్గిపోతుందని కూడా వైద్యులు చెబుతున్నారు. మాత్రలను మంచినీళ్లతో తప్ప మజ్జిగతో కానీ పళ్ళ రసాలతో కానీ తీసుకుంటే నిష్ప్రయోజనకరమని వైద్యులు చెబుతున్న మాటలను కూడా పాటించు కొని జాగ్రత్తలు పాటిస్తే మీకే మంచిది…

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది