Health Benefits : సపోటా పండ్లను ఎక్కువగా తినేవారు…. తెలుసుకోవలసిన ముఖ్య విషయాలు…!!
Health Benefits : పకృతిలో లభించే ప్రతి పండు కూడా మనిషి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది అని ఎన్నో సార్లు రుజువు అయింది. అందుకే ప్రతి సీజన్ లో దొరికే అన్ని రకాల పండ్లను కచ్చితంగా తినాలి అని అంటున్నారు పోషకాహార నిపుణులు. ఇందులో సపోటా కూడా ఒకటి. సపోటా పండ్లు లో శరీరానికి కావలసిన ఎన్నో రకాల పోషకాలు అనేవి లభిస్తాయి. దీనిలో విటమిన్ ఏ అనేది అధిక మోతాదులో ఉంటుంది. అలాగే చర్మం […]
Health Benefits : పకృతిలో లభించే ప్రతి పండు కూడా మనిషి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది అని ఎన్నో సార్లు రుజువు అయింది. అందుకే ప్రతి సీజన్ లో దొరికే అన్ని రకాల పండ్లను కచ్చితంగా తినాలి అని అంటున్నారు పోషకాహార నిపుణులు. ఇందులో సపోటా కూడా ఒకటి. సపోటా పండ్లు లో శరీరానికి కావలసిన ఎన్నో రకాల పోషకాలు అనేవి లభిస్తాయి. దీనిలో విటమిన్ ఏ అనేది అధిక మోతాదులో ఉంటుంది. అలాగే చర్మం మరియు కళ్ళ ఆరోగ్యాన్ని ఎంతో మెరుగుపడేలా చేస్తుంది. అలాగే సపోటా పండులో విటమిన్ సి, విటమిన్ బి కాంప్లెక్స్, ఖనిజాలు, పొటాషియం కూడా సమృద్ధిగా ఉన్నాయి. ఇవి మన శరీరానికి శక్తిని అందించడమే కాక రక్తపోటును కూడా తగ్గిస్తాయి. అలాగే ఈ సపోటాలో కాల్షియం మరియు మెగ్నీషియం, పొటాషియం లాంటి ఎన్నో ఖనిజాలు అధికంగా ఉంటాయి. ఇవి ఎముకలను కూడా దృఢంగా చేసేందుకు కీలక పాత్ర పోషిస్తాయి. దీనితో పాటుగా ఇతర ఎముకల సమస్యలను కూడా నియంత్రించేందుకు ఎంతో మేలు చేస్తుంది. అలాగే వీటిలో ఫైబర్, పాస్పరస్, కాల్షియం కూడా ఉన్నాయి. వీటిని తినడం వలన ఎన్నో ప్రయోజనాలు మనకు కలుగుతాయి…
సపోటాలో ఉండే ప్రక్టోజ్ శరీరానికి వెంటనే శక్తిని ఇస్తుంది. అంతేకాక అలసట మరియు నీరసం లాంటి సమస్యలను కూడా నియంత్రించేందుకు కూడా ఎంతగానో హెల్ప్ చేస్తుంది. అలాగే రోగనిరోధక శక్తిని పెంచేందుకు కూడా ముఖ్యపాత్ర పోషిస్తుంది. అలాగే ఈ సపోటాలో ఫైబర్ అనేది సమృద్ధిగా ఉండడం వలన జీర్ణక్రియ కూడా ఎంతో మెరుగుపడుతుంది. ఈ చిన్న పండులో ఉండే పీచు పదార్థం అనేది అధికంగా ఉండడం వల్ల మలబద్ధకంతో బాధపడేవారు ఈ పండ్లను తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అలాగే ఆపిల్ మరియు ఆరెంజ్ కన్నా అధికంగా పండులో విటమిన్ సి ఉండడం వలన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి చర్మం కి సంబంధించిన సమస్యలను కూడా దూరం చేయగలదు…
సపోటాలో ఉండే పొటాషియం రక్తపోటును నియంత్రించడమే కాక గుండె ఆరోగ్యాన్ని కూడా ఎంతో మెరుగుపరుస్తుంది. ఇది చెడు కొలెస్ట్రాల్ ను నియంత్రించడమే కాక రక్త ప్రసరణ ను కూడా మెరుగుపడేలా చేస్తుంది. అంతేకాక గుండెపోటు మరియు ఇతర సమస్యలను కూడా తగ్గించేందుకు ఎంతో హెల్ప్ చేస్తుంది. ఈ సపోటాలో ట్రిప్టోఫాన్ అనే ఆమైనో ఆమ్లం కూడా ఉంటుంది. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని కూడా మెరుగుపడేలా చేస్తాయి. అలాగే చర్మంపై ముడతలు మరియు మచ్చలను నియంత్రించి చర్మం మృదువుగా మెరిసేలా కూడా చేస్తుంది. దీనిలో యాంటీ యాక్సిడెంట్ ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి శరీరంలోని ఫ్రీ రాడికల్స్ లాంటి విషపూరిత మూలకాలాలతో కూడా పోరాడుతుంది. అంతేకాక జీవకణాలకు కలిగే నష్టాన్ని నియంత్రిస్తుంది. ఇది క్యాన్సర్ లాంటి ఎంతో ప్రమాదకరమైన సమస్యలను కూడా దూరం చేయగలదు…