Sugar Patients : రోజు భుజం నొప్పి వస్తుందా .. అయితే మీకు షుగర్ ఉన్నట్టే .. ఇప్పుడే జాగ్రత్త పడండి ..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Sugar Patients : రోజు భుజం నొప్పి వస్తుందా .. అయితే మీకు షుగర్ ఉన్నట్టే .. ఇప్పుడే జాగ్రత్త పడండి ..!

Sugar Patients : కొంతమందికి నిద్రలో భుజం నొప్పి వస్తూ ఉంటుంది. ఆ టైంలో భుజం కదపడానికి కూడా చాలా నొప్పిగా ఉంటుంది. అది కూడా గడ్డగా అవుతుంది. అంటే భుజం చేతితో తాకితే రాయి లాగా ఉంటుంది. అయితే ఈ భుజం నొప్పి శాశ్వతం కాదని గుర్తించాలి. ప్రతి ఒక్కరికి భుజం నొప్పి అనేది వస్తూ ఉంటుంది. ముందు జాగ్రత్తగా కొన్ని చర్యలు తీసుకుంటే భుజం నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. అయితే ఈ భుజం […]

 Authored By aruna | The Telugu News | Updated on :21 June 2023,8:00 am

Sugar Patients : కొంతమందికి నిద్రలో భుజం నొప్పి వస్తూ ఉంటుంది. ఆ టైంలో భుజం కదపడానికి కూడా చాలా నొప్పిగా ఉంటుంది. అది కూడా గడ్డగా అవుతుంది. అంటే భుజం చేతితో తాకితే రాయి లాగా ఉంటుంది. అయితే ఈ భుజం నొప్పి శాశ్వతం కాదని గుర్తించాలి. ప్రతి ఒక్కరికి భుజం నొప్పి అనేది వస్తూ ఉంటుంది. ముందు జాగ్రత్తగా కొన్ని చర్యలు తీసుకుంటే భుజం నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. అయితే ఈ భుజం నొప్పి సమస్య ఎక్కువగా డయాబెటిస్ పేషంట్లలో ఉంటుంది. అంతే కాకుండా వయసు పైబడిన వారిలో కూడా వస్తుంది. రాత్రంతా ఒకే వైపు పడుకోవడం వలన కూడా ఈ సమస్య వస్తుంది. బరువైన వాటిని అకస్మాత్తుగా ఎత్తుకోవడం వలన భుజం నొప్పి వస్తుంది.

ఇది ఎక్కువగా డయాబెటిక్ పేషంట్లలో వస్తుంది. మరీ ముఖ్యంగా 40 సంవత్సరాల ఆడవాళ్లకు ఎక్కువగా భుజం నొప్పి వస్తుంది. దీనిని నిర్లక్ష్యం చేస్తే చాలాకాలం పాటు ఉంటుంది. ఏదేమైనా బ్లడ్ లో షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ లో ఉంచుకోవాలి. ఈ సమస్య ఉన్నవారు తేలికపాటి ఎక్సర్సైజులు చేస్తూ ఉండాలి. డాక్టర్ని సంప్రదించాలి. డాక్టర్ సలహా మేరకు ఎక్సర్సైజులు చేయాలి. ఈ సమస్య మహిళల్లో ఎక్కువగా వస్తుంది కాబట్టి హ్యాండ్ బ్యాగులు నొప్పి ఉన్న వైపు వేసుకోవడం మానేయాలి. బరువులు అస్సలు మోయకూడదు. ఈ సమస్య నుంచి బయటపడడానికి కొంతమంది పెయిన్ కిల్లర్స్ వాడుతుంటారు.

shoulder pain in sugar patients follow these tips

shoulder pain in sugar patients follow these tips

అవి తాత్కాలికంగా తగ్గిన సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఈ సమస్య నుంచి బయటపడడానికి ఫార్మసీలలో ఎక్సమ్ అనే ఉప్పు బాగా ఉపయోగపడుతుంది. వేడి నీటిలో అరకప్పు వరకు ఎప్సన్ ఉప్పును వేసి తర్వాత స్నానం చేయాలి. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం ఇలా చేస్తే కండరాల ఒత్తిడి తగ్గి రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. దీంతో భుజాల నొప్పి తగ్గుతుంది. కండరాలకు బలాన్ని ఇచ్చే ఆహారాన్ని తీసుకోవాలి. భుజం నొప్పి ఉన్నవారు ఆటలు ఆడకూడదు. బరువైన వస్తువులు పట్టకూడదు. అలాగే దీనికి మరొక చిట్కా కూడా ఉంది. కాటన్ క్లాత్లో కొన్ని ఐస్ ముక్కలు వేసి పది నుంచి 15 నిమిషాల పాటు ఉంచితే క్రమంగా భుజం నొప్పి తగ్గుతుంది. భుజం నొప్పి సమస్య ఉన్నవారు ఈ చిట్కాలను కనుక పాటిస్తే ఈ సమస్యలను బయటపడవచ్చు.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది