Sleeping Habits : మీరు ఉదయం త్వరగా నిద్ర లేవాలనుకుంటున్నారా… అయితే ఇలా చేయండి…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Sleeping Habits : మీరు ఉదయం త్వరగా నిద్ర లేవాలనుకుంటున్నారా… అయితే ఇలా చేయండి…?

 Authored By ramu | The Telugu News | Updated on :5 February 2025,7:00 am

Sleeping Habits : ఇప్పుడున్న సమాజంలో ప్రతి ఒక్కరూ బిజీ లైఫ్ లో ఉండి పోతున్నారు. ఇంత ప్రయత్నించినా కూడా టైం కి నిద్రపోవడం టైం కి తినడం సాధ్యం కావడం లేదు. రాత్రిపూట త్వరగా పడుకొని ఉదయం త్వరగా లేవాలంటే కొంతమందికి చాలా బద్ధకంగా ఉంది లేవరు. త్వరగా నిద్ర లేవడం తలకు మించిన భారంగా భావిస్తారు. అలారం పెట్టుకుని మరీ లేవాలనుకున్న కూడా నిద్ర నుంచి అస్సలు లేవలేం. త్వరగా నిద్రపోయి, ఉదయాన్నే త్వరగా మేల్కొంటే మంచి ఫలితాలు ఉంటాయి. రోజువారి చేసుకునే పనులు త్వరగా పూర్తవుతాయి. లేస్తే ఆ రోజంతా పనులన్నీ లేటుగానే అవుతాయి. అలాగే టైం కి తినవచ్చు టైం కి నిద్ర నుంచి అలవాటు కూడా ఉండాలి. టైం కి నిద్రపోతే త్వరగా నిద్ర లేవచ్చు. త్వరగా పడుకునే అలవాటు కూడా చేసుకోవాలి. అయితే మనం రాత్రి నిద్రించి త్వరగా ఉదయాన్నే లేవాలి అంటే ఇలాంటి చిట్కాలను పాటించండి.

Sleeping Habits మీరు ఉదయం త్వరగా నిద్ర లేవాలనుకుంటున్నారా అయితే ఇలా చేయండి

Sleeping Habits : మీరు ఉదయం త్వరగా నిద్ర లేవాలనుకుంటున్నారా… అయితే ఇలా చేయండి…?

పూర్వకాలంలో రాత్రిలో త్వరగా పడుకొని ఉదయాన్నే త్వరగా లేచేవారు. కానీ ఇప్పుడు మాత్రం బిజీ లైఫ్ లో అది సాధ్యం కావడం లేదు. మనం టైం కి తిని టైం కి నిద్రిస్తే మన ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. చలికాలంలో కొంతమందికి నిద్రమత్తు వదలక లేవాలంటే చాలా కష్టంగా భావిస్తారు. కారం పెట్టుకున్నా కూడా మళ్ళీ నిద్ర పోవాలి అని మనసు కోరుకుంటుంది. అందుకే కొంతమంది సాయంత్రం త్వరగా పడుకుంటారు. త్వరగా పడుకోవడం వల్ల ఉదయాన్నే లేవటానికి సహాయం అవుతుంది. అని ఇప్పుడున్న బిజీ లైఫ్ లో అది సాధ్యం కావడం లేదు. ఎంతమంది లేటుగా పడుకుని త్వరగా లేస్తుంటారు దీని వల్ల ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. త్వరగా పడుకుంటే ఉదయాన్నే త్వరగా లేవచ్చు అప్పుడు ఆరోగ్యం కూడా బాగుంటుంది. అయితే రాత్రిపూట త్వరగా పడుకుంటే ఉదయాన్నే త్వరగా లేవచ్చు. మరి ఆ చిట్కాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం

రాత్రిలో నిద్రించే సమయం మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఇది నిద్రలో వచ్చేలా చేస్తుంది. అందుకే చమోమిలే టీ తాగవచ్చు. ఇ టీ తాగడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. నిద్ర కూడా వచ్చేలా చేస్తుంది. కానీ ఈ టీ ఉదయం మాత్రమే తాగాలి. దీంతోపాటు కాశ్మీర్ కహ్వా, జీరా, అజ్వైన్, రోజు టీ, కూడా తాగవచ్చు. ఈ చిన్న అలవాటు మీ నిద్ర దినచర్యనే మార్చేస్తుంది.
నిద్రించే సమయంలో ఏదైనా పుస్తకం చదవటం అలవాటు చేసుకుంటే మంచిది. ఇలా చేస్తే మీకు నిద్ర సరిగ్గా పట్టవచ్చు.మీ నిద్రపోయేటువంటి భంగం వాటిల్లదు. NHI అధ్యయనాల ప్రకారం, బెడ్ మీద కూర్చొని మరీ పుస్తకం చదివే అలవాటు నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది. అలా అని ఫోన్ లో కథలు, నవలలు చదవకూడదు, వీటికి బదులు పుస్తకం పట్టుకొని చదవటం అలవాటు చేసుకోవాలి.
మనం సాధారణంగా గాఢ నిద్రలో ఉన్నప్పుడు అలారం ఆపివేసి నిద్రపోతాం. తరువాత సరైన టైంలో లేవలేకపోయాను అని చింతిస్తాం. ఇలాంటి అలవాటు మీకు ఉంటే పడుకునే ముందు అలారం అందకుండా బెడ్ కి కొన్ని అడుగుల దూరంలో ఉంచండి. దీంతో అలారం మోగిన వెంటనే దాన్ని ఆఫ్ చేయడానికి దగ్గరగా ఉండదు. అప్పుడు త్వరగా మేలుకునే అవకాశం ఉంది. ఎందుకంటే అది దూరంలో ఉన్నందుకు దాన్ని సౌండ్ భరించలేక దాని ఆపివేయడానికి మీరు లేచి నడిచి వెళ్లాల్సిన అవసరం వస్తుంది. ఆ సమయంలో మీ నిద్ర మేలుకువ వస్తుంది. దీనివల్ల గాడ నిద్ర మత్తు వదులుతుంది, త్వరగా మేలుకోవడానికి వీలుంటుంది.

రాత్రి సమయంలో ఆరు గంటల ముందు టిఫిన్ తీసుకుంటే మాత్రం నిద్రకు అంతరాయం కలుగుతుంది. కొంతమందికి పడుకునే ముందు మద్యం సేవించడం అలవాటు ఉంటుంది అది కూడా మంచిది కాదు. ఉదయం త్వరగా లేవాలి నిద్రమత్తు తగ్గాలి అంటే ఈ రెండు అలవాట్లు మానుకోవాలి. మధ్యాహ్నం టైంలో టీ తాగే వారికి కెఫిన్ పరిమితం తగ్గించుకోవాలి. ఇది నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుందని నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ అధ్యాయంలో తేలింది. ఇది సోమరితనాన్ని తగ్గిస్తుంది అలాగే రాత్రి పడుకునే ముందు మొబైల్ వాడకాన్ని కూడా తగ్గించుకోవాలి. కొంతమంది టీవీ చూస్తూ పడుకుంటారు అది కూడా తగ్గించుకోవాలి

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది