Gourd Juice : కాకరకాయ రసంతో జుట్టు ఆరోగ్యం… ఎలా ఉపయోగించాలంటే…??
ప్రధానాంశాలు:
Gourd Juice : కాకరకాయ రసంతో జుట్టు ఆరోగ్యం... ఎలా ఉపయోగించాలంటే...??
Gourd Juice : కాకరకాయ పేరు ఎత్తగానే ఎంతోమందికి ముఖాలు మాడిపోతాయి. ఎందుకంటే ఇది అంత చేదుగా ఉంటుంది. కాబట్టి దీనిని ఇష్టపడే తినేందుకు అంతగా ఎవరు ఆసక్తి చూపరు. అయితే కాకరకాయని తినడం కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిలో శరీరానికి కావాల్సిన ఎన్నో పోషకాలు దాగి ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే డయాబెటిస్ తో బాధపడేవారు కాకరకాయ జ్యూస్ ను ప్రతిరోజు తాగితే కచ్చితంగా కంట్రోల్ లో ఉంటుంది. ఈ కాకరకాయను తిన్న లేక జ్యూస్ లా తీసుకున్న శరీరంలో విష పదార్థాలన్నీ బయటకు పోతాయి. ఈ కాకరకాయను తీసుకోవడం వల్ల చర్మం కూడా ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే కాకరకాయ రసం తాగటం వలన జుట్టు కూడా ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది. అయితే జుట్టు ఎక్కువగా ఉడిపోతుందని బాధపడేవారు మరియు జుట్టు ఒత్తుగా లేదని అనుకునేవారు కాకరకాయ రసంతో మీరు ఇలా గనక చేస్తే మంచి రిజల్ట్స్ ఉంటాయి. మరి అవి ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం…
కాకరకాయ రసంతో జుట్టుకు మేలు : కాకరకాయ జ్యూస్ ను తాగేవారు దీనిలో కొద్దిగా ఉప్పు వేసుకొని ప్రతిరోజు తీసుకోవాలి. అయితే ఈ జ్యూస్ ను చిన్న గ్లాస్ తో తాగిన చాలు మంచి ఫలితాలు లభిస్తాయి. ఇలా గనక మీరు చేస్తే పది రోజుల్లోనే మీకు మంచి రిజల్ట్స్ కనిపిస్తాయి. ఇది జుట్టు రాలటాన్ని తగ్గించడమే కాక జుట్టు ఒత్తుగా పెరిగేలా చేస్తుంది. కాకరకాయలో యాంటీ ఆక్సిడెంట్స్ మరియు యాంటీబయక్రోబయో లక్షణాలు ఉంటాయి. ఇది తలపై పడే ఆక్సికరణ ఒత్తిడిని కూడా నియంత్రిస్తాయి. దీనివల్ల జుట్టు రాలటం తగ్గుతుంది. అలాగే తలపై ఉన్న మాడను హైడ్రేట్ చేస్తాయి. అలాగే వీటిలో ఉండే విటమిన్స్ వెంట్రుకలను దృఢంగా మరియు బలంగా చేస్తుంది. అయితే ఈ కాకరకాయ జ్యూస్ అనేది జుట్టుకు సహజ కండిషనర్ గా కూడా పని చేస్తుంది. అలాగే జుట్టు అనేది చిట్లిపోకుండా మరియు విరిగిపోకుండా ఉంచుతుంది.
Gourd Juice : కాకరకాయ రసంతో జుట్టు ఆరోగ్యం… ఎలా ఉపయోగించాలంటే…??కాకరకాయ రసంతో హెయిర్ ప్యాక్ : ఈ కాకరకాయ రసంతో హెయిర్ ప్యాక్ ను కూడా తయారు చేసుకోవచ్చు. ఈ రసాన్ని మీరు జుట్టుకు డైరెక్ట్ గా అప్లై చేసుకొని మసాజ్ చేయండి. ఇలా ఒక 20 నిమిషాల పాటు వదిలేసి తర్వాత తలస్నానం చేయండి. ఇలా గనక మీరు వారంలో రెండు సార్లు చేస్తే మంచి ఫలితాలు లభిస్తాయి. ఈ కాకరకాయ రసంలో పెరుగు మరియు కొబ్బరి నూనెను కూడా కలుపుకొని తలకు అప్లై చేసుకోవచ్చు. ఇలా చేసినా కూడా జుట్టు అనేది ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది…