Summer Healthy Drinks : ఎండాకాలంలో ఈ జ్యూస్ లు తాగితే… అదిరిపోయే బెనిఫిట్స్, మిల మిల మెరిసే అందం మీ సొంతం…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Summer Healthy Drinks : ఎండాకాలంలో ఈ జ్యూస్ లు తాగితే… అదిరిపోయే బెనిఫిట్స్, మిల మిల మెరిసే అందం మీ సొంతం…?

 Authored By ramu | The Telugu News | Updated on :27 March 2025,10:00 am

ప్రధానాంశాలు:

  •  Summer Healthy Drinks : ఎండాకాలంలో ఈ జ్యూస్ లు తాగితే... అదిరిపోయే బెనిఫిట్స్, మిల మిల మెరిసే అందం మీ సొంతం...?

Summer Healthy Drinks : ఎండాకాలంలో ఉష్ణోగ్రతల‌ను చూస్తే ఎండలకు బయటకు వెళ్లాలంటే భయంగా ఉంది. ఉదయం 10:00 కాగానే ఎండలు మండిపోతున్నాయి. ఎండ తీవ్రతను భరించలేక ప్రజలు శీతల పానీయాల వైపు మక్కువ చూపిస్తున్నారు. కొందరు కూల్ డ్రింక్స్ వైపు ఎక్కువ మక్కువ చూపిస్తారు. ఈ కూల్డ్రింక్స్ ఎక్కువగా తీసుకుంటే దానిలో ఉన్న రసాయనాలు మన శరీరానికి హానిని కలిగిస్తాయి.ఈ రసాయనాలు కలిగిన జ్యూసులు కంటే ఆరోగ్యకరమైన జ్యూసులు తాగితే శరీరాన్ని చల్లబరుస్తాయి. అలాగే, సూర్యుని వేడి నుంచి తట్టుకోగలిగే శక్తిని, గాయపడిన చర్మానికి చికిత్సను ఈ జూస్ లు అందిస్తుంది. ఆరోగ్యకరమైన ఆ జూసులు ఏమిటో తెలుసుకుందాం…

Summer Healthy Drinks ఎండాకాలంలో ఈ జ్యూస్ లు తాగితే అదిరిపోయే బెనిఫిట్స్ మిల మిల మెరిసే అందం మీ సొంతం

Summer Healthy Drinks : ఎండాకాలంలో ఈ జ్యూస్ లు తాగితే… అదిరిపోయే బెనిఫిట్స్, మిల మిల మెరిసే అందం మీ సొంతం…?

Summer Healthy Drinks ప్రకాశవంతమైన చర్మం కోసం :

ప్రకాశవంతమైన చర్మం కోసం నారింజ, అల్లం జ్యూస్ మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఈ జ్యూస్ ని క్రమం తప్పకుండా తాగితే ఆరోగ్యంగా ఉండడానికి సహాయపడుతుంది.నారింజలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. కాబట్టి, ఇది చర్మాన్ని UVకిరణాల నుంచి రక్షిస్తుంది. ఈ అల్లం శోధన నిరోధక లక్షణాలను కలిగి ఉంటుంది. రక్త ప్రసరణను వేగవంతం చేస్తుంది. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. వేసవిలో ప్రతి చోట లభించే ఫ్రూట్స్ లలో పుచ్చకాయ ఒకటి. ఈ పుచ్చకాయలు నీటి శాతం ఎక్కువగా ఉంటుంది.

ఇది చర్మాన్ని డిహైడ్రెట్ గా ఉంచడమే కాకుండా, ఇందులో విటమిన్లు A, C లైకో పిన్ లు ఉంటాయి. వాటర్ మిలన్ జ్యూస్ చర్మాని రక్షించుటకు ఎంతో సహాయపడుతుంది. ఇందులో యాంటీ ఇన్ఫ‌ల‌మేట‌రి కూడా ఉన్నాయి. ఇది చర్మపు మంట, మొటిమలు తగ్గించడంలో సహాయపడతాయి. వేసవిలో తప్పనిసరిగా తీసుకోవాల్సిన మరో పానీయం పైనాపిల్ – అల్లం జ్యూస్, పైనాపిల్ లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. వేసవిలో ఈ ఫ్రూట్ జ్యూసులు తాగితే వేసవి తాపం నుంచి తప్పించుకొనవచ్చు. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. ఇంకా చర్మంలో నిగారింపు కూడా వస్తుంది

Also read

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది