Health Benefits Cabbage : వావ్ అనిపించేలా ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన క్యాబేజీ… వారానికొక్కసారైనా …? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Health Benefits Cabbage : వావ్ అనిపించేలా ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన క్యాబేజీ… వారానికొక్కసారైనా …?

 Authored By ramu | The Telugu News | Updated on :27 December 2024,2:00 pm

ప్రధానాంశాలు:

  •  Health Benefits Cabbage : వావ్ అనిపించేలా ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన క్యాబేజీ... వారానికొక్కసారైనా ...?

Health Benefits Cabbage : కొంతమంది క్యాబేజీని అంతగా ఇష్టపడరు. కానీ క్యాబేజీ వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో తెలిస్తే వావనాల్సిందే… ఎందుకంటే క్యాబేజీకి క్యాన్సర్ని నివారించే గుణం ఉందని వెబ్ ఎండి తెలిపింది. అయితే ఈ క్యాబేజీని తలచు తినడం వలన శరీరంలోని క్యాన్సర్ కణాలు అభివృద్ధినీ నిలిపివేస్తుంది. క్యాబేజీలో ఆంథో సైనిన్స్ ఉంటాయి. ఆర్థరైటిస్ సమస్యలకు చెక్ పెడుతుంది. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో కూడా చాలా బాగా ఉపకరిస్తుంది. దీని వల్ల బిపి కూడా తగ్గుతుంది. గుండె సమస్యలకు పూర్తిగా స్వస్తి పలకవచ్చు. మనం రోజు తినే ఆహారంలో తప్పకుండా ఆకుకూరలు, కూరగాయలు ఉండాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అన్ని కూరగాయలు ఎలాగైతే తీసుకుంటున్నారు అలాగే క్యాబేజీని కూడా తప్పనిసరిగా తినాలని నిపుణులు చెబుతున్నారు. క్యాబేజీ లో ఉండే పోషకాలు,ఆరోగ్య ప్రయోజనాలు గురించి తెలిస్తే అస్సలు తినకుండా ఉండలేరు. ఈ క్యాబేజీలో రోగనిరోధక శక్తిని పెంచే గుణం అమితంగా ఉంటుంది. ఈ క్యాబేజీ వల్ల డయాబెటిస్, థైరాయిడ్ సమస్యలు సైతం క్యాబేజీ సమర్థంగా ఎదుర్కొంటుంది. అయితే క్యాబేజీ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Health Benefits Cabbage వావ్ అనిపించేలా ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన క్యాబేజీ వారానికొక్కసారైనా

Health Benefits Cabbage : వావ్ అనిపించేలా ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన క్యాబేజీ… వారానికొక్కసారైనా …?

క్యాబేజీలో ఎక్కువ శాతం నీరు, క్యాలరీలు తక్కువగా ఉంటాయి. మనకు రోజంతటికి కావలసిన హైడ్రేషన్ అందిస్తుంది. బరువు తగ్గాలనే వారికి క్యాబేజీ మంచి హెల్ప్ అవుతుంది. క్యాబేజీలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు క్యాబేజీలో ఫైబర్, విటమిన్ కే,సి, కూడా ఉంటాయి. ఇది జీర్ణ వ్యవస్థకి మంచిది. ప్రాణాంతక గుండె, క్యాన్సర్ వంటి సమస్యల నుంచి కాపాడుతుంది. అలాగే క్యాబేజీలో యాంటీ హైపర్ గ్లైసిమిక్ కలిగి ఉంటుంది. ఇది మధుమేహం బాధితులకు మంచిది. డయాబెటిస్ నెప్రోపతి నుంచి కాపాడుతుంది. క్యాబేజీ లో గ్లూకోసైనోలెట్స్, సల్ఫర్ ఉంటుంది. క్యాబేజీలు యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇది క్యాన్సర్ ను నివారిస్తుంది అని వెబ్ ఎండి తెలిపింది. క్యాన్సర్ కణాలు అభివృద్ధి చెందకుండా చేస్తుంది. క్యాబేజీ ఏ సీజన్లో అంటే ఆ సీజన్లో మార్కెట్లో సులభంగా దొరుకుతుంది. క్యాబేజీలో ఆమెతో సైనిన్స్ ఉంటాయి. ఆర్థరైటిస్ సమస్యలకు చెక్ పెడుతుంది. రక్తంలో చక్కర స్థాయిలో నియంత్రించడం నియంత్రించడంతోపాటు, బిపి, షుగర్లను తగ్గిస్తుంది. ద్వార గుండె సమస్యలు కూడా తగ్గిపోతాయి.

ఈ క్యాబేజీలో ఫైబర్ పుష్కలంగా ఉండడం వల్ల చెడు కొలెస్ట్రాలను తగ్గించి మంచి కొలెస్ట్రాలను తయారు చేస్తుంది. ఈ క్యాబేజీ కడుపులో అల్సర్ రానీకుండా చేస్తుంది. క్యాబేజీని డైట్ చేసేవారు తినడం ద్వారా శరీర పనితీరు కూడా మెరుగుపడుతుంది. దీనిలో ఫైబరు అధికంగా ఉండడం ద్వారా మలబద్ధక సమస్య కూడా తగ్గిపోతుంది. శరీరంలో మంట, వాపు సమస్యలు కూడా క్యాబేజీ చెక్ పెడుతుంది. దీంతో క్యాన్సర్, గుండె సమస్యలు,డయాబెటిస్ అల్జీమర్స్ తో బాధపడే వారికి ఈ క్యాబేజీ ఎంతో ఆరోగ్యం చేకూరుస్తుంది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది