Tamarind : చింతపండు ఎక్కువగా తింటే ఈ జబ్బు వస్తుందా .. అమ్మో .. తినేముందు జాగ్రత్త !!
Tamarind : పుల్లగా, తీయగా ఉండే చింతపండును ఇష్టపడని వారు ఉండరు. ప్రతి ఒక్కరి వంటగదిలో చింతపండు అనేది కచ్చితంగా ఉంటుంది. రసం, చట్ని, సాంబారు మొదలగు వాటిల్లో చింతపండును ఎక్కువగా వినియోగిస్తారు. ఇక పచ్చి చింతకాయలో ఉప్పు కలుపుకొని తింటే ఆ టేస్టే వేరు. అసలు చింతకాయ పేరు చెప్తేనే నోట్లో లాలాజలం ఊరుతుంటుంది. ఇంతటి రుచిని అందిస్తున్న చింతపండును అతిగా తినడం వలన ఆరోగ్యానికి హాని కలుగుతుంది. ఆరోగ్య నిపుణులు చెప్పిన దాని ప్రకారం చింతపండును ఎక్కువగా తినడం వలన ఆరోగ్యం పై దుష్ప్రభావం పడుతుంది.
చింతపండు తీయగా పుల్లగా ఉండడం వలన దంతాల సమస్యకు కారణం అవుతుంది. దంతాల సమస్య ఉన్నవారు చింతపండును ఎక్కువగా తింటే ఆ నొప్పి ఇంకా పెరుగుతుంది. ముఖ్యంగా మహిళలు తమ బహిష్టు సమయంలో చింతపండును అస్సలు తినొద్దని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. బహిష్టు సమయంలో చింతపండును గానీ, చింతపండుతో చేసిన రసాలను గానీ తిన్నా, తాగినా కడుపునొప్పి తీవ్రంగా మారుతుంది. కాబట్టి స్త్రీలు ఈ సమయంలో చింతపండుతో చేసిన పదార్థాలను తీసుకోకుండా ఉండడం మంచిది. ఇక ఉదయం లేవగానే ఖాళీ కడుపుతో చింతపండు తినడం వల్ల కడుపు నొప్పి సమస్యకు దారితీస్తుంది. అజీర్తి, అసిడిటి సమస్యను పెంచుతుంది.
అందుకే, చింతపండును పరిమితంగా తినాలని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. చింతపండులో ఉండే సిట్రిక్ యాసిడ్ వలన కడుపులో గ్యాస్ సమస్యలు తయారవుతాయి. కాబట్టి పరిగడుపున చింతపండు అసలు తీసుకోకూడదు. గ్యాస్ సమస్య ఉన్నవారు చింతపండు తీసుకోకుండా ఉండడం మంచిది. లేదంటే గ్యాస్ అమాంతం పెరిగి ప్రాణాలకు ముప్పు కలుగుతుంది. ఇక దంత సమస్యలు ఉన్నవారు కూడా చింతపండును తీసుకోకుండా ఉండడం మంచిది. చింతపండు తీసుకోవడం వలన దంత సమస్య ఎక్కువ అవుతుంది. ఏది ఏమైనా ఏ ఆహారాలు అయినా పరిమితంగానే తీసుకోవాలి. లేకపోతే అవి ఆరోగ్యం పై దుష్ప్రభాతం చూపిస్తాయి. ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని గుర్తించుకోవాలి.