Heart : గుండె ఆరోగ్యం కోసం… తీసుకోవలసిన ఆహారాలు ఇవే…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Heart : గుండె ఆరోగ్యం కోసం… తీసుకోవలసిన ఆహారాలు ఇవే…!

Heart : మన దేశంలో గుండెకు సంబంధించిన సమస్యలతో ఎంతోమంది బాధపడుతున్నారు. అలాగే గుండెకు సంబంధించిన సమస్యలతో ఎంతోమంది మరణిస్తున్నారు కూడా. అయితే టైం కు ఆహారాన్ని తీసుకోకపోవడం మరియు వ్యక్తిగత, వృత్తిపరమైన ఒత్తిడి, సరైన వ్యాయామం లేకపోవడం లాంటివి గుండె పనితీరును మందగిస్తాయి. అలాగే రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ స్థాయిలు అనేవి వేగంగా పెరిగిపోవటం కూడా గుండె పనితీరిపే ప్రభావం చూపిస్తుంది అని నిపుణులు అంటున్నారు. మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే ఎంతో ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలని […]

 Authored By ramu | The Telugu News | Updated on :14 August 2024,8:00 am

ప్రధానాంశాలు:

  •  Heart : గుండె ఆరోగ్యం కోసం... తీసుకోవలసిన ఆహారాలు ఇవే...!

Heart : మన దేశంలో గుండెకు సంబంధించిన సమస్యలతో ఎంతోమంది బాధపడుతున్నారు. అలాగే గుండెకు సంబంధించిన సమస్యలతో ఎంతోమంది మరణిస్తున్నారు కూడా. అయితే టైం కు ఆహారాన్ని తీసుకోకపోవడం మరియు వ్యక్తిగత, వృత్తిపరమైన ఒత్తిడి, సరైన వ్యాయామం లేకపోవడం లాంటివి గుండె పనితీరును మందగిస్తాయి. అలాగే రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ స్థాయిలు అనేవి వేగంగా పెరిగిపోవటం కూడా గుండె పనితీరిపే ప్రభావం చూపిస్తుంది అని నిపుణులు అంటున్నారు. మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే ఎంతో ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలని అంటున్నారు. ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం…

Heart చేపలు తినాలి

సాధారణంగా చేపలను ఎక్కువగా తీసుకునే వారిలో గుండె సమస్యలు చాలా తక్కువగా ఉంటాయని నిపునులు అంటున్నారు. అలాగే చేపల లో ఉండే ఒమేగా త్రీ కొవ్వు ఆమ్లాలు అనేవి గుండె పనితీరును ఎంతో మెరుగు పరుస్తాయి.

ఆకుకూరలు : ఆకుకూరలు కూడా గుండెకు ఎంతో మేలు చేస్తాయి. ఇది క్యాన్సర్ లాంటి రోగాలను సైతం దరిచేరకుండా చూస్తాయి. అలాగే పాలకూర మరియు కోతిమీర, ర్యాడిస్ మొదలగు వాటిలలో కొవ్వు శాతం అనేది తక్కువగా ఉండడంతో పాటు పోలిక్ యాసిడ్,మెగ్నిషియం, కాల్షియం, పొటాషియం కూడా అధికంగా ఉంటాయి. ఇవి గుండె పనితీరును బాగు చేయటంలో ఎంతో మేలు చేస్తాయి. అయితే ఆకుకూరల ను రోజు ఆహారంలో తీసుకునే వారికి మిగిలిన వారితో పోల్చినట్లయితే వీరికి గుండె సమస్యలు 11% తక్కువగా ఉంటాయి.

ఓట్స్ : మీరు ప్రతి నిత్యం ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ లో ఓట్స్ ను తీసుకుంటే గుండెకు ఎంతో మంచి జరుగుతుంది. అలాగే వీటిలో ఉండే బ్లీటా గ్లూకాన్ శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ ను కూడా నియంత్రిస్తుంది. అందువలన ప్రతిరోజు బ్రేక్ ఫాస్ట్ లో ఓట్స్ ను తీసుకోవాలి.

Heart గుండె ఆరోగ్యం కోసం తీసుకోవలసిన ఆహారాలు ఇవే

Heart : గుండె ఆరోగ్యం కోసం… తీసుకోవలసిన ఆహారాలు ఇవే…!

గోధుమలు, ధాన్యాలు, పప్పు, బీన్స్ మొదలైన ఆహారాలను తీసుకోవడం చాలా ముఖ్యం. వీటిలో ఉన్నటువంటి విటమిన్స్, ఐరన్, ఫైబర్, యాటీ ఆక్సిడెంట్ రక్త పోటును కంట్రోల్ లో ఉచ్చుతాయి. దీనితో గుండె పనితీరు కూడా ఎంతో మెరుగుపడుతుంది. ఇవి మాత్రమే కాకుండా టమాటాలు, యాపిల్స్, సోయా లాంటివి కూడా రోజు తీసుకోవటం వలన గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు…

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది