Kidneys : ప్రతిరోజు ఈ ఆహారాలను తీసుకుంటే చాలు… మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉన్నట్లే…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Kidneys : ప్రతిరోజు ఈ ఆహారాలను తీసుకుంటే చాలు… మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉన్నట్లే…!

Kidneys : మనిషి యొక్క ఆరోగ్యాన్ని ప్రభావితం చేయటంలో కిడ్నీ లు ముఖ్య పాత్ర పోషిస్తాయనే విషయం మనందరికీ తెలిసినదే. మనం ఎప్పుడూ తాగే పానీయాలను కిడ్నీలు అనేవి ఫిల్టర్ చేస్తాయి. అలాగే వ్యర్థ పదార్థాలను ఎప్పటికప్పుడు బయటకు పంపించడంలో ఈ కిడ్నీలు ముఖ్యపాత్ర పోషిస్తాయి. అయితే మనం తెలిసో తెలియకో చేసే కొన్ని రకాల పనులు మరియు తీసుకునే ఆహారం వలన కిడ్నీలు ప్రమాదంలో పడే అవకాశం ఉన్నది. అలాగే వ్యర్థాలను బయటకు పంపించి రక్తాన్ని […]

 Authored By ramu | The Telugu News | Updated on :15 August 2024,9:00 am

ప్రధానాంశాలు:

  •  Kidneys : ప్రతిరోజు ఈ ఆహారాలను తీసుకుంటే చాలు... మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉన్నట్లే...!

Kidneys : మనిషి యొక్క ఆరోగ్యాన్ని ప్రభావితం చేయటంలో కిడ్నీ లు ముఖ్య పాత్ర పోషిస్తాయనే విషయం మనందరికీ తెలిసినదే. మనం ఎప్పుడూ తాగే పానీయాలను కిడ్నీలు అనేవి ఫిల్టర్ చేస్తాయి. అలాగే వ్యర్థ పదార్థాలను ఎప్పటికప్పుడు బయటకు పంపించడంలో ఈ కిడ్నీలు ముఖ్యపాత్ర పోషిస్తాయి. అయితే మనం తెలిసో తెలియకో చేసే కొన్ని రకాల పనులు మరియు తీసుకునే ఆహారం వలన కిడ్నీలు ప్రమాదంలో పడే అవకాశం ఉన్నది. అలాగే వ్యర్థాలను బయటకు పంపించి రక్తాన్ని శుభ్రం చేయటంలో కిడ్నీలు ప్రత్యేక పాత్ర పోషిస్తాయి. అయితే మన కిడ్నీలను కాపాడుకోవాలి అంటే కొన్ని రకాల ఆహార పదార్థాలను కచ్చితంగా తీసుకోవాలి అని పోషకాహార నిపుణులు అంటున్నారు. ఇంతకీ కిడ్నీల పనితీరును మెరుగుపరిచే ఆ ఆహార పదార్థాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం…

పండ్లు : మన కిడ్నీలు అనేవి ఎంతో ఆరోగ్యంగా ఉండాలి అంటే విటమిన్ సి ఎక్కువగా ఉండే పండ్లను తీసుకోవాలి. విటిలో నిమ్మ మరియు నారింజ పండ్లను ఆహారంలో చేర్చుకోవాలి అని అంటున్నారు నిపుణులు. ఇలాంటి ఫుడ్ తీసుకోవటం వలన శరీరం అనేది ఎంతో తేమగా ఉంటుంది అని అంటున్నారు. అలాగే మూత్రపిండంలో ఉన్న వ్యర్థాలను కూడా బయటకు పంపించడంలో మేలు చేస్తుంది. వీటిలో ఉన్న సిట్రేట్ మూత్రపిండంలో రాళ్లు అనేవి ఏర్పడకుండా సహాయపడుతుంది

దోసకాయ : దోసకాయలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ప్రతిరోజు ఈ దోసకాయలను ఆహారంలో భాగం చేసుకోవడం వలన మూత్రపిండంలో రాళ్లు అనేవి ఏర్పడవు. అలాగే ఈ దోసకాయలను తీసుకోవటం వలన కిడ్నీల పనితిరు కూడా ఎంతో మెరుగుపడుతుంది.

సల్మాన్ ట్యూనా చేపలు : మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచడంలో ఈ సల్మాన్ ట్యూనా చేపలు ముఖ్య పాత్ర పోషిస్తాయి. అయితే నేషనల్ కిడ్నీ ఫౌండేషన్ అధ్యయనం ప్రకారం చూస్తే, ఒమేగా 3 కొవ్వులు ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవడం వలన రక్తంలో కొవ్వు స్థాయిలు తగ్గుతాయి. దీనివలన కిడ్నీలు అనేవి ఎంతో ఆరోగ్యంగా ఉంటాయి.

Kidneys ప్రతిరోజు ఈ ఆహారాలను తీసుకుంటే చాలు మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉన్నట్లే

Kidneys : ప్రతిరోజు ఈ ఆహారాలను తీసుకుంటే చాలు… మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉన్నట్లే…!

వాటర్ : కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలి అంటే నీటిని ఎక్కువగా తీసుకోవాలని అంటున్నారు నిపుణులు. ప్రతిరోజు కచ్చితంగా ఎనిమిది గ్లాసుల నీటిని తాగాలి అని అంటున్నారు నిపుణులు. అలాగే శరీరం అనేది నిత్యం హైడ్రేడ్ గా ఉంటే శరీరంలోని టాక్సిన్లు మరియు వ్యర్ధాలు అనేవి బయటకు పోతాయి. దీంతో సహజంగా మూత్రపిండాలను రిపేర్ చేయడంలో వాటర్ ఎంతో ఉపయోగపడుతుంది…

క్రాన్ బెర్రీస్ : యూరినటరీ ట్రాక్టర్ ఇన్ఫెక్షన్ లను దూరం చేయటంలో ఈ క్రాన్ బెర్రీస్ కీలక పాత్ర పోషిస్తాయి. ఈ క్రాన్ బెర్రీలను ప్రతిరోజు తీసుకోవటం వలన మూత్రశయం మరియు మూత్రపిండాలు ఎంతో ఆరోగ్యంగా ఉంటాయి…

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది