Diabetes : ఈ లక్షణాలు మధుమేహానికి సంకేతం కావచ్చు… నిర్లక్ష్యం చేస్తే…ప్రమాదంలో పడ్డట్టే…!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Diabetes : ఈ లక్షణాలు మధుమేహానికి సంకేతం కావచ్చు… నిర్లక్ష్యం చేస్తే…ప్రమాదంలో పడ్డట్టే…!!

Diabetes : ప్రస్తుత కాలంలో వయసుతో సంబంధం లేకుండా ఎంతో మంది ఈ షుగర్ వ్యాధి బారిన పడుతున్నారు. ఈ వ్యాధి ఒకసారి వచ్చిందంటే చాలు ఎప్పటికీ న్యాయం కాదు. ఎందుకంటే దీనికి చికిత్స అనేది లేదు కాబట్టి. అయితే మధుమేహ సమస్యలతో బాధపడే వారిలో ఎక్కువగా నోరు పొడిబారుతుంది. అలాగే నోటిలో లాలాజల ఉత్పత్తి అనేది తగ్గడం వలన ఇలా జరిగే అవకాశం ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలు పెరగటానికి కూడా కారణం అవుతుంది […]

 Authored By aruna | The Telugu News | Updated on :31 August 2024,8:00 am

Diabetes : ప్రస్తుత కాలంలో వయసుతో సంబంధం లేకుండా ఎంతో మంది ఈ షుగర్ వ్యాధి బారిన పడుతున్నారు. ఈ వ్యాధి ఒకసారి వచ్చిందంటే చాలు ఎప్పటికీ న్యాయం కాదు. ఎందుకంటే దీనికి చికిత్స అనేది లేదు కాబట్టి. అయితే మధుమేహ సమస్యలతో బాధపడే వారిలో ఎక్కువగా నోరు పొడిబారుతుంది. అలాగే నోటిలో లాలాజల ఉత్పత్తి అనేది తగ్గడం వలన ఇలా జరిగే అవకాశం ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలు పెరగటానికి కూడా కారణం అవుతుంది అని అంటున్నారు నిపుణులు. అయితే పొడి బారిన నోరు మధుమేహ సమస్యకు ఒక హెచ్చరిక సంకేత అని చెప్పొచ్చు. అలాగే మీ నోటిలో ఎక్కువగా లాలాజలం అనేది తక్కువ అయితే మీ దంతాలు మరియు చిగుళ్ళు కూడా సమస్యల కు దారి తీస్తాయి.

ఈ మధు మొహం వచ్చే ప్రారంభ దశలో కొన్ని లక్షణాలు మీకు కనిపిస్తాయి. ఈ సమస్యను సకాలంలో గుర్తించి వెంటనే చికిత్స చేయించుకుంటే మంచిది. లేక దీనిని నిర్లక్ష్యం చేస్తే తీవ్రమైన అనారోగ్య సమస్యలను కలిగిస్తుంది. అయితే యువకులలో షుగర్ వ్యాధి యొక్క మొదటి లక్షణం ఎక్కువ దాహం మరియు అతిగా మూత్ర విసర్జన చేయడం… అలాగే షుగర్ ఉన్న వారిలో ఆకలి అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈ వ్యాధితో బాధపడే వారు హఠాత్తుగా బరువు కూడా తగ్గుతారు. అలాగే మీకు కంటి చూపు స్పష్టత అనేది తగ్గిన షుగర్ వ్యాధి వచ్చినట్టే అంటున్నారు నిపుణులు. అంతేకాక ఎలాంటి చిన్న పనులు చేసినా కూడా తొందరగా అలసిపోతారు.

అలాగే ఈ సమస్యతో బాధపడుతున్న వారు మానసిక ఆందోళనతో ఉంటారు. ఈ లక్షణాల గనుక మీలో కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించండి… మీరు శ్వాస తీసుకునేటప్పుడు మీకు ఏదైనా పండిన వాసన పీల్చిన అనుభూతి కలిగితే అది మధుమేహానికి సంబంధించిన సైడ్ ఎఫెక్ట్ అని అంటున్నారు నిపుణులు. అంతేకాక తల తిరగడం మరియు వికారంగా అనిపించడం లాంటివి కూడా మధుమేహానికి సంకేతం అని అంటున్నారు. అలాగే కాళ్ళ ల్లో ఎంతో తీవ్రమైన నొప్పి అధిక రక్త చక్కెర స్థాయిలు నరాలను కూడా దెబ్బతీస్తాయి. అంతేకాక వీరికి ఏదైనా గాయం తగిలితే అది తగ్గటానికి ఎక్కువ టైం పట్టినా కూడా మధుమేహానికి సంకేతం అని అంటున్నారు నిపుణులు…

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది