High Cholesterol : మీ కంట్లో ఈ లక్షణాలు కనిపిస్తే అధిక కొలెస్ట్రాల్ ఉన్నట్లే… తప్పక తెలుసుకోండి…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

High Cholesterol : మీ కంట్లో ఈ లక్షణాలు కనిపిస్తే అధిక కొలెస్ట్రాల్ ఉన్నట్లే… తప్పక తెలుసుకోండి…!

 Authored By ramu | The Telugu News | Updated on :11 August 2024,8:00 am

High Cholesterol : ప్రస్తుతం ఉన్న ఆధునిక కాలంలోని జీవనశైలి వలన చాలామంది గుండె సమస్యలతో బాధపడుతున్నారు. మరి ముఖ్యంగా రోజురోజుకు గుండెపోటు రోగుల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. అయితే గుండెపోటు రావడానికి గల ప్రధాన కారణం శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా పెరగడం. అయితే మన శరీరంలో కొలెస్ట్రాల్ సమస్య ఉన్నట్లయితే మనకు తెలియకుండానే రోగాలు పుట్టుకొస్తూ ఉంటాయి. క్రమరహిత జీవన శైలి అనారోగ్య ఆహారపు అలవాట్లు ఈ వ్యాధికి ప్రధాన అంశాలు అని చెప్పవచ్చు. ఇక ఈ సమస్య నుంచి బయటపడాలి అంటే కేవలం వైద్యులు చూపించే మందులు మాత్రమే తీసుకోకుండా రక్తంలో చెడు కొలెస్ట్రాల్ కొన్ని రకాల సూచనలు తీసుకోవడం చాలా మంచిది.

అయితే రక్తంలో చెడు కొలెస్ట్రాల్ విపరీతంగా పెరిగినప్పుడు ఒక విధమైన జిగట పదార్థం అనేది రక్తంలో తేలియాడుతూ ఉంటుంది. ఇది ధమనులలో కూరుకుపోతూ ఉంటుంది. తద్వారా రక్తప్రసన్నకు ఆటంకం ఏర్పడి గుండె జబ్బులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. అయితే రక్తప్రసరణకు ఆటంకం ఏర్పడినప్పుడు శరీరంలో అనేక రకాల సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి. ఇక ఈ లక్షణాల ద్వారా మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగిందో లేదో తేలికగా గుర్తించవచ్చని వైద్యులు చెబుతున్నారు. మరి ఇలాంటి లక్షణాలు మీ శరీరంలో కనిపించినట్లయితే వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది. మరి ఆ లక్షణాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సాధారణంగా మనం ఏదైనా ఆరోగ్య సమస్యతో వైద్యుల వద్దకు వెళ్ళినప్పుడు వారు మన కళ్ళను పరీక్షించి రోగాలను నిర్ధారిస్తుంటారు. అదేవిధంగా కళ్లను చూసి కొలెస్ట్రాలను కూడా అంచనా వేయవచ్చట. శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తెలుసుకోవడానికి కంటి లక్షణాలు ద్వారా కూడా అర్థం చేసుకోవచ్చని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు. అది ఎలా అంటే శరీరంలో అధిక కొలెస్ట్రాల్ ఉన్నట్లయితే కార్నియా చుట్టూ తెల్లటి వలయం కనిపిస్తుందట. సాధారణంగా అయితే ఇలాంటి లక్షణాలు వృద్ధులలో ఎక్కువగా కనిపిస్తాయి. శాస్త్రీయ భాషలో దీనిని ఒర్కాస్ అని పిలుస్తారు.

High Cholesterol మీ కంట్లో ఈ లక్షణాలు కనిపిస్తే అధిక కొలెస్ట్రాల్ ఉన్నట్లే తప్పక తెలుసుకోండి

High Cholesterol : మీ కంట్లో ఈ లక్షణాలు కనిపిస్తే అధిక కొలెస్ట్రాల్ ఉన్నట్లే… తప్పక తెలుసుకోండి…!

ఇది వృద్ధుల్లో సహజంగా కనిపిస్తుంది కానీ యవ్వనంలో ఉన్న వారి కళ్ళ చుట్టూ ఇలాంటి లక్షణాలు కనిపించినట్లయితే అది శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిల పెరుగుదలకు సూచన. అలాగే మన కళ్ళ చుట్టూ అసాధారణ గడ్డలు కనిపించిన అప్రమత్తంగా ఉండటం మంచిది. కళ్ళ చుట్టూ తెల్లగా లేదా పసుపు రంగులో చిన్న చిన్న ముద్దలు పెరిగినట్లయితే రక్తంలో కొలెస్ట్రాల్ పెరిగిందని అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ సమస్యను శాంథిల్ లాస్మా అని పిలుస్తారు. అలాగే శరీరంలో అధిక కొలెస్ట్రాల్ రెటినాలో సమస్యలను కలిగిస్తుంది. తద్వారా అస్పష్టమైన దృష్టి కళ్ల చుట్టూ నల్లటి వలయాలు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఇలాంటి లక్షణాలు మీ కళ్ళలో కనిపించినట్లయితే వెంటనే వైద్యులను సంప్రదించటం మంచిది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది