Asana : ఉదయాన్నే యోగా చేయడానికి ఎవరికీ టైం లేదా… ఈ ఒక్క ఆసనం వేస్తే చాలు… బాడీ మొత్తం క్లీన్…!!
ప్రధానాంశాలు:
Asana : ఉదయాన్నే యోగా చేయడానికి ఎవరికీ టైం లేదా... ఈ ఒక్క ఆసనం వేస్తే చాలు... బాడీ మొత్తం క్లీన్...!!
Asana : ప్రతి ఒక్కరు రోజు యోగా చేస్తే ఆరోగ్యానికి ఎంతో మంచిది. యోగ చేయడం వలన ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా వాటిని తగ్గించుకోవచ్చు. అలాగే ప్రతిరోజు యోగా చేయటం వలన దీర్ఘకాలిక సమస్యలను రానీయకుండా కూడా చూసుకోవచ్చు. అలాగే యోగా అనేది శరీర ఆరోగ్యాన్ని రక్షించడం లో ముఖ్య పాత్ర పోషిస్తుంది. అయితే ఉదయం లేచిన వెంటనే వ్యాయామం చేసే టైం ఎవరికి లేనప్పుడు,ఈ ఒక్క ఆసనాన్ని వేస్తే సరిపోతుంది. అదే మలాసనం. ఈ ఆసనం అనేది అధిక బరువు మరియు ఉబకాయాన్ని తగ్గించి ఫిట్ గా మారుస్తుంది. అలాగే శరీరంలో ఉన్నటువంటి మలిన పదార్థాలను కూడా బయటకు పంపిస్తుంది.
ఈ మలసనాన్ని వేయటం కూడా చాలా ఈజీ. అయితే ఈ ఆసనాన్ని ఎలా వెయ్యాలి అంటే మనం మలవిసర్జన చేసే టైంలో ఎలా అయితే కూర్చుంటామో అలాగే చేయాలి. కాకపోతే మన రెండు చేతులను దగ్గరకు పెట్టి నమస్కారం చేయాలి. అందుకే దీనికి మలాసనం అనే పేరు వచ్చింది. అలాగే ఈ ఆసనం వేయడం వలన నడుము భాగం మరియు కంటి భాగాలు కూడా ఎంతో బలంగా తయారవుతాయి. అలాగే మోకాళ్లు మరియు కీళ్ల నొప్పులు కూడా వెంటనే తగ్గిపోతాయి.
ఈ ఆసనం వేయటం వలన జీర్ణవ్యవస్థ పై పడే ఒత్తిడి వలన శరీరంలో ఉన్న మలిన పదార్థాలు అనేవి బయటకు పోతాయి. అంతేకాక శరీరంలో పేర్కొన్న కొవ్వు కూడా తగ్గుతుంది. అలాగే శరీరం అనేది పూర్తిగా డీటాక్స్ అవుతుంది. అలాగే ఈ భంగిమలో కూర్చొని నీళ్లు తాగితే ఎంతో మేలు జరుగుతుంది. అంతేకాక అధిక బరువు మరియు ఊబకాయం కూడా తగ్గుతాయి. అలాగే చర్మం కూడా హైడ్రేట్ అయ్యి ఎంతో కాంతివంతంగా మారిపోతుంది