Diabetes : డ‌యాబెటిస్‌ వ్యాధి ఉన్న వారికి ఈ మొక్క సంజీవ‌ని లాంటిది..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Diabetes : డ‌యాబెటిస్‌ వ్యాధి ఉన్న వారికి ఈ మొక్క సంజీవ‌ని లాంటిది..!

 Authored By mallesh | The Telugu News | Updated on :10 February 2022,7:40 am

Diabetes : డ‌యాబెటిస్‌.. ప్ర‌స్తుత కాలంలో చాలామందిలో క‌నిపిస్తున్న కామ‌న్ డిసీస్‌. చిన్న పిల్ల‌ల్లో కూడా వ‌య‌సుతో సంబంధం లేకుండా క‌నిపిస్తోంది. మ‌న ఇండియాలో ఎక్కువ‌గా క‌నిపించే రోగాల‌లో ఇది కూడా ఒక‌టి. ఇది దీర్ఘ‌కాలిక వ్యాధి. ఒక్క మోపున త‌గ్గేది కాదు. అయితే దీన్ని త‌గ్గించుకునేందుకు చాలామంది చాలా ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు. కొంద‌రేమో డాక్ట‌ర్లు రాసిచ్చిన ట్యాబ్లెట్లు వాడుతుంటే.. మ‌రికొంద‌రేమో ఆయుర్వేద టిప్స్ వాడుతుంటారు.ఇలా ఒక్కొక్క‌రు ఒక్కో విధ‌మైన ప‌ద్ధ‌తుల్లో దీన్ని త‌గ్గించుకునేందుకు ప్ర‌య‌త్నిస్తుంటారు. ఇలా బాధ ప‌డేవారికోసం ఓ అద్భ‌త‌మైన విష‌యాన్ని తీసుకు వ‌చ్చాం. దాని పేరే మధుపత్రి. ఇది ఆయుర్వేద చెట్టు.

ఇది షుగ‌ర్ ను కంట్రోల్ చేయ‌డంలో అద్భుతంగా ప‌నిచేస్తుంది. ఇవి షుగ‌ర్ ఉన్న వారు రోజూ న‌మిలి తింటే అద్భుతంగా ప‌నిచేస్తాయి. ఇదే విష‌యాన్ని ఆయుర్వేద నిపుణులే వెల్ల‌డిస్తున్నారు. అయితే ఇవి చ‌క్కెర క‌న్నా కూడా 30 రేట్లు తియ్యగా ఉంటాయ‌ని చెబుతున్నారు. అయితే తియ్య‌గా ఉన్నాయ‌ని వీటిని తిన‌డం మానొద్దు.కాగా వీటిని పొడిరూపంలో కూడా తీసుకోవ‌చ్చు. వీటిని తెంపుకుని వ‌చ్చి ఎండ‌బెట్టుకోవాలి. ఆ త‌ర్వాత పొడిలాగా గ్రైండ‌ర్ ప‌ట్టుకోవాలి. ఇలా వ‌చ్చిన పొడి ఒక స్పూన్ ఒక్క సాధార‌ణ క‌ప్పులో ఉన్న పంచ‌దార‌కు స‌మానంగా ఉంటుంది.

this plant is like a lifesaver for people with diabetes

this plant is like a lifesaver for people with diabetes

Diabetes : పొడి రూపంలో తీసుకోవ‌చ్చు..

కాబ‌ట్టి దీన్ని టీ, పాలల్లో వేసుకుని తాగొచ్చు. ఇది వేసుకున్నాక మ‌ళ్లీ పంచ‌ధార వేయొద్దు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ తో పాటు యాంటి ఇన్ ఫ్లిమేట‌రీ లాంటివి అనేకం ఉంటాయి. ఇది తులసి చెట్టు జాతికి చెందిన మొక్క‌. దీంతో ఇమ్యూనిటీ ప‌వ‌ర్ కూడా బాగానే పెరుగుతుంది. తిన్న వెంట‌నే అర‌గాలంటే ఇది బాగా ప‌నిచేస్తుంద‌ని డాక్ట‌ర్లు వెల్ల‌డిస్తున్నారు. అయితే దీన్ని ఎలా వాడాలో ఒక‌సారి ఆయుర్వేద నిపుణుల‌ను సంప్ర‌దించాలి.

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది