Thyroid : టాబ్లెట్లు వేసుకునే పని లేకుండా థైరాయిడ్ పరార్…!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Thyroid : టాబ్లెట్లు వేసుకునే పని లేకుండా థైరాయిడ్ పరార్…!!

 Authored By prabhas | The Telugu News | Updated on :3 March 2023,7:00 am

Thyroid : థైరాయిడ్ సమస్యల గురించిన పూర్తి సమాచారం తెలుసుకుందాం.. థైరాయిడ్ ఎందుకు వస్తుంది. అనే విషయాలు ఈ పూర్తిగా తెలుసుకుందాం. గొంతు ముందు భాగంలో సీతాకోకచిలుక ఆకారంలో ఉంటుంది థైరాయిడ్ గ్రంథి ఈ గ్రంధి కొన్ని హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. అది వ్యక్తి యొక్క శరీర ఉష్ణోగ్రత బరువు కొలెస్ట్రాల్ మరియు అనేక ఇతర విషయాలపై ప్రభావం చూపుతుంది. థైరాయిడ్ గ్రంథి ఎక్కువ లేదా తక్కువ హార్మోన్లను ఉత్పత్తి చేయడం ద్వారా థైరాయిడ్ సమస్య ఏర్పడుతుంది. ఇది శరీరంలోని అనేక భాగాలపై ప్రభావం చూపుతుంది. ఈ థైరాయిడ్ సమస్య ప్రధానంగా ఐదు రకాలుగా ఉంటుంది. ఇలా ఐదు రకాలుగా థైరాయిడ్ సమస్య ఉంటుంది. అయితే ఈ ఐదు వాటిలో కూడా హైపోథైరాయిడ్జమ్, హైపర్ థైరాయిడిజం ఈ రెండు కూడా సహజంగా అందరికీ వస్తూ ఉంటాయి. మిగిలిన మూడు కూడా అసాధారణమైనది అంటే కొంతమందిలో మాత్రమే ఈ లక్షణాలు ఉంటాయి.

అటువంటి వారు వైద్యని పర్యవేక్షణలో పూర్తిగా ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. మరి మనం హైపర్ థైరాయిడ్జమ్ హైపోథైరాయిడ్సం గురించి తెలుసుకుందాం. థైరాయిడ్ గ్రంథి 4 హార్మోన్లను తగినంత మోతాదులో ఉత్పత్తి చేయకపోవడం వలన దాని ప్రభావం శరీరంపై పడుతుంది. దీనిని హైపోథైరాయిడిజం అంటారు. దీని లక్షణాలు ఎలా ఉంటాయంటే బరువు పెరగడం, జుట్టు రాలడం, చర్మం పొడి బారడం ఉండే నెమ్మదిగా కొట్టుకోవడం శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరగడం ముఖం కూడా వా, మలబద్ధకం కండరాలు అసౌకర్యంగా ఉండడం ఎటువంటి సమస్యలన్నీ కనిపిస్తాయి. కాబట్టి ఆహారం విషయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు ఇంట్లో కూడా తెలుసుకుందాం. మీరు వాడే ఉప్పులో కచ్చితంగా అయోడిన్ ఉండేలాగా చూసుకోవాలి. ఎందుకంటే మన శరీరం అయోడిన్ ని ఉత్పత్తి చేయదు కాబట్టి అయోడిన్ తక్కువైనప్పుడు కూడా థైరాయిడ్ సమస్యకు దారితీస్తుంది.

Thyroid Can Be Cured Easily

Thyroid Can Be Cured Easily

మీరు ఉప్పుని వాడేటప్పుడు ఇక చెడు కొలెస్ట్రాన్ని తగ్గించే ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్ ఉండే ఆహార పదార్థాలు తీసుకోవాలి. ముఖ్యంగా ఇవి చేపల్లో మనకు లభిస్తాయి. చేపల్లో ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్ తో పాటు సెలీనియం కూడా పుష్కలంగా దొరుకుతుంది. ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్ చెడు కొలెస్ట్రాల్ నివారిస్తే సెలీనియం థైరాయిడ్ హార్మోన్ ను మెరుగుపరుస్తుంది. సాల్మన్ చేపల్లో ఈ పోషకాలు మనకు లభిస్తాయి. అలాగే ప్రతిరోజు గుడ్డు తీసుకోవడం వలన కూడా హైపోథైరాయిడిజం అలాగే హైపర్ రెండింటికి కూడా చక్కగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇందులో అయోడిన్ మరియు ప్రోటీన్ సమృద్ధిగా ఉంటాయి. ఒకవేళ మీకు శరీరంలో ఎక్కువ కొలెస్ట్రాల్ ఉంటే కనుక గుడ్డులోని పచ్చసో లను తినకండి.

ఇక అవిసె గింజలు చాలా బాగా పనిచేస్తాయి. థైరాయిడ్ ఉన్న వాళ్ళకి ఇందులో ఒమేగా త్రీ కొవ్వు ఆమ్లాలు జింక్ సెలీనియం అయోడిన్ ఉంటుంది. కాబట్టి ఇది థైరాయిడ్ సమస్యల్ని చక్కగా నివారిస్తుంది. ఇవే కాకుండా చిక్కుళ్ళు, ఆలివ్ ఆయిల్, చికెన్, పాల ఉత్పత్తులు కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు చూద్దాం గ్రీన్ టీ సోయా అధికంగా ఉండే ఆహార పదార్థాలు వేయించిన ఆహార పదార్థాలు జంక్ ఫుడ్స్ కి దూరంగా ఉండాలి. ఫ్రెండ్స్ ఇప్పుడు హైపర్ థైరాయిడ్ గురించి చూద్దాం. థైరాయిడ్ గ్రంథి ఎక్కువ హార్మోన్లను ఉత్పత్తి చేయడం వల్ల ఈ సమస్య వస్తుంది. ఈ సమస్య గుర్తించడానికి లక్షణాలు ఎలా ఉంటాయంటే బరువు తగ్గడం గుండె వేగంగా కొట్టుకోవడం ఆందోళన నిద్ర రాకపోవడం చిరాకు ఏకాగ్రత లోపించడం ఆకలి పెరగడం చర్మం తేమగా ఉండడం

Thyroid Can Be Cured Easily

Thyroid Can Be Cured Easily

ఇవి హైపర్ థైరాయిడ్ యొక్క లక్షణాలు వీటికి తీసుకోవలసిన ఆహార నియమాలు ఏంటంటే ఆకుకూరల విషయానికి వస్తే థైరాయిడ్ కి బాగా పనిచేస్తుంది. అలాగే బ్రోకలీ, క్యాబేజీ, క్యారెట్లు, క్యాలీఫ్లవర్, ముల్లంగి, క్యాప్సికం ఇలా ఆకుపచ్చగా ఉండే కూరగాయలు తీసుకోవాలి. ఇక తీసుకోవలసిన పండ్లు ఏంటంటే సెలీనియం మరియు జింగ్ ఉన్నాయి ఇవి థైరాయిడ్ కి చక్కగా ఉపయోగపడతాయి. అలాగే గుండె సంబంధిత వ్యాధులకు కూడా బాగా పనిచేస్తాయి. అయితే హైపర్ థైరాయిడ్సం ఉన్న వాళ్ళు గ్రీన్ టీ ని తీసుకోవచ్చు ఎందుకంటే ఇది యాంటీ థైరాయిడ్ లక్షణాలు కలిగి ఉంటుంది. ఇక పాల ఉత్పత్తులను కూడా చక్కగా తీసుకోవచ్చు. ఈ సమస్య ఉన్నవాళ్లు సముద్రపు చేపలను తినకూడదు. మామూలు చేపలను తీసుకోవచ్చు..

YouTube video

Advertisement
WhatsApp Group Join Now

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది