Turmeric Face Mask : పసుపుతో ఫేస్ ప్యాక్ వేసుకుంటున్నారా…. అయితే, ఇది తప్పక తెలుసుకోవాల్సిందే…?
Turmeric Face Mask : పసుపు కేవలం వంటగదికి పరిమితమైన సుగంధ ద్రవ్యం మాత్రమే కాదు. సహజ వైద్యంలో ఒక అద్భుతమైన నిధి. పసుపుని మన పూర్వీకుల నుంచి భారతీయ సాంస్కృతిలో , ఇప్పటికీ పసుపుని దాని వైద్య, సౌందర్య ప్రయోజనాల కోసం వినియోగిస్తూనే ఉన్నారు. పసుపుని ముఖానికి రాసుకోవడం అనేది ఒక సాంప్రదాయ పద్ధతి. ఇలా చేస్తే దాని వెనుక ఎన్నో ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. పసుపు లో కర్కుమిన్ అనే శక్తివంతమైన సమ్మేళనం ఉంటుంది. ఇది పసుపు రంగుకు కారణం అవుతుంది. ఆరోగ్య ప్రయోజనాలకు మూలం. నేను ఒక అద్భుతమైన యాంటీ ఆక్సిడెంట్, అండ్ ఇన్ఫర్మేషన్ కలిగి ఉంటుంది. ఈ లక్షణాలే చర్మానికి, శరీరానికి అనేక విధాలుగా మేలు చేస్తాయి.

Turmeric Face Mask : పసుపుతో ఫేస్ ప్యాక్ వేసుకుంటున్నారా…. అయితే, ఇది తప్పక తెలుసుకోవాల్సిందే…?
Turmeric Face Mask మొటిమలు మచ్చలకు స్వస్తి పలుకుతుంది
పసుపులోని యాంటీ బ్యాక్టీరియల్, ఆంటీ ఇన్ఫలమేటరీ లక్షణాలు మొటిమలను తగ్గిస్తుంది. అంతేకాదు, తిమ్మల వల్ల వచ్చిన నల్ల మచ్చలను కూడా తగ్గించటానికి అద్భుతంగా పనిచేస్తుంది. చర్మ రంధ్రాలను శుభ్రం చేసే గుణం ఉంటుంది. బ్యాక్టీరియా వృద్ధిని నిరోధిస్తుంది. తద్వారా మొటిమలు రాకుండా చేస్తుంది. ఇప్పటికే ఉన్న మొటిమల వాపును తగ్గించి వాటిని త్వరగా మానిపోయేలా చేస్తుంది.
చర్మం కాంతివంతంగా యవ్వనంగా : పసుపు ఒక శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్.ఇది ఫ్రీ రాడికల్స్ వల్ల చర్మానికి జరిగిన నష్టాలను నివారించింది,ప్రి రాడికల్స్ చర్మ కణాలను దెబ్బతీసి వృద్ధాప్య ఛాయాలను త్వరగా రాకుండా చేస్తుంది. పసుపు ఈ ఫ్రీ రాడికల్స్ తో పోరాడి చర్మాన్ని యవ్వనంగాను,కాంతివంతంగానూ ఉంచుతుంది.చర్మంపై ముడతలు, గీతలు,వయసు మచ్చలు వంటి వృద్ధాప్య లక్షణాలు తగ్గించడానికి పసుపు సమర్ధంగా పనిచేస్తుంది.
చర్మం రంగును మెరుగుపరుస్తుంది : పసుపు చర్మం రంగును మెరుగుపరచడంలో సహాయపడుతుంది.ఇది మెలిని ఉత్పత్తి నియంత్రించడం సహాయపడుతుంది.ఇది చర్మానికి రంగును ఇచ్చే వర్ణ ద్రవ్యం. అధికమైన నిన్ను ఉత్పత్తి చేయుటకు చర్మంపై నల్ల మచ్చలను.పిగ్మెంటేషన్లను ఏర్పరచకుండా చేస్తుంది. పసుపు మెలనిన్ ఉత్పత్తిని చేసి,చర్మాన్ని సమాన రంగుల్లో ప్రకాశంవంతంగా ఉండేందుకు సహాయపడుతుంది.
గాయాలు మచ్చలు త్వరగా నయం అవడం : పసుపు లోని యాంటీ సెప్టిక్, యాంటీ ఇన్ఫర్మేషన్ లక్షణాలు. గాయాలు చిన్న కోతలు కాలిన గాయాలు త్వరగా నయం కావడానికి సాయపడతాయి. ఇది చర్మ కణాలు పునరుత్పత్తిని ప్రోత్సహిస్తుంది.తద్వారా,గాయాలు త్వరగా మానిపోతాయి.మచ్చలు ఏర్పపడకుండా చేస్తాయి.
చర్మవ్యాధులకు ఉపశమనం : పసుపు చర్మ సంబంధిత సమస్యలైన తామర ( ఎగ్జిమా), సోరియాసిస్ వంటి వాటి లక్షణాలు తగ్గించడంలో కూడా పసుపు సహాయపడుతుంది. పసుపులోని యాంటీ ఇన్ఫర్మేషన్ ఈ వ్యాధుల వల్ల కలిగే దురద, ఎరుపు వాపు అంటే లక్షణాలనుండి ఉపశమనం కలిగిస్తాయి.
సూర్య రష్మి నుంచి రక్షణ : సూర్య రష్మి లోని హానికరమైన యువి కిరణాలు చర్మానికి తీవ్ర నష్టం కలిగిస్తాయి. పసుపులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు,ఈ యువి కిరణాల వల్ల కలిగే నష్టం నుండి చర్మాన్ని రక్షించడానికి ఉపయోగపడుతుంది. ఇది సన్ బర్న్, ధర్మం నల్లబడడం మరియు చర్మ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో ఉపకరిస్తుంది.
చర్మం తేమగా ఉంచుటకు : పసుపు చర్మాన్ని తేమగా ఉంచటంలో ఎంతో సహాయపడుతుంది. ధర్మ కణాల మధ్య తేమను నిలుపుకోవడానికి సాయపడుతుంది. తద్వారా చర్మం పొడి బారకుంట,మృదువుగా సాగే గుణంతో ఉంటుంది.
పసుపును ఎలా ఉపయోగించాలి: పసుపును వివిధ రకాల పేస్ మా స్కూల్లో ఉపయోగించవచ్చు. శనగపిండి, పెరుగు,తేనె,పాలు అలాంటి వాటితో కలిపి ఫేస్ మాస్క్ లో వేసుకోవచ్చు. మొటిమలు, గాయాలు వంటి వాటిపై పసుపు పేస్టును నేరుగా రాయవచ్చు. పసుకుపొడిని నీటితో లేదా రోజు వాటర్ తో కలిపి పేస్టులా తయారు చేసి, ప్రభావిత ప్రాంతం పై రాస్తే, మంచి ఫలితం ఉంటుంది. పసుపు నూనెను చర్మం పై మసాజ్ చేయడానికి ఉపయోగించవచ్చు. ఇది చర్మం రంగును మెరుగుపరచడానికి చర్మాని మృదువుగా ఉంచడానికి ఉపయోగపడుతుంది.
పసుపు సాధారణ చర్మానికి సురక్షితంగా ఉంచుతుంది. కొందరికి అలర్జీస్ ప్రతి చర్యలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మొదటిసారి ఉపయోగించే ముందు చిన్న ప్రాంతాల్లో ఫ్యాట్ టెస్ట్ చేయడం మంచిది. పసుపు చర్మానికి పసుపు రంగును అడ్డ గలదు కాబట్టి ముఖ్యమైన కార్యక్రమాలకు ముందు పసుపును ఉపయోగించడం మానుకోండి. రంగును తగ్గించడానికి మీరు పాలతో లేదా శనగపిండితో ముఖాన్ని శుభ్రం చేసుకోవచ్చు అయితే ఏదైనా చర్మ సమస్యలు తీవ్రంగా ఉంటే వైద్య నిధులను సంప్రదించడం ఉత్తమం.