Heart Attack : అక్కడ నొప్పిగా ఉందా.. గుండె పోటు లక్షణమే అది.. సకాలంలోనే గుర్తిస్తే ఒకే.. లేకపోతే అంతే సంగతులు..!
Heart Attack : దేశంలో గుండె పోటు మరణాల సంఖ్య రోజురోజుకు పెరుగుతూ పోతోంది. ఇటీవల కాలంలో చాల మంది ప్రముఖులు అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించడం చూస్తునే ఉన్నాం. మొన్నటికి మొన్న కన్నడ నటుడు పునీత్ రాజ్‌కుమార్ 46 వ ఏటనే వ్యాయామం చేస్తూ గుండెపోటుతో మరణించారు. ఇలా ఎంతోమంది క్రమం తప్పకుండా వ్యాయామం చేసినా.. గుండె పోటు నుండి తప్పించుకోలేకపోతున్నారు. ప్రస్తుతం శీతాకాలంలో గుండెపోటు కేసులు గణనీయంగా పెరుగుతాయంటున్న వైద్య నిపుణులు… గుండె పోటు లక్షణాలను సకాలంలో గుర్తించడంతో పాటు పలు అలవాట్లకు దూరంగా ఉంటే.. ఈ ప్రమాదం నుంచి బయటపడవచ్చు అని అంటున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Heart Attack : అక్కడి నొప్పి రావొద్దు..!
అనేక సార్లు దవడ, లేదా ఎడమచేతి నొప్పి వస్తూ ఉంటే అది గుండెపోటు లక్షణమేనని వైద్య నిపుణులు అంటున్నారు. తరచుగా ఆయా చోట్ల నొప్పి వస్తే లైట్ తీసుకోకుండా వెంటనే అప్రమత్తం అవ్వాలని వారు హెచ్చరిస్తున్నారు. సకాలంలో గుర్తించి గుండె పోటు నిర్దారణ పరీక్షలన్నీ చేయించుకుంటే ఆ ప్రమాదం చాలా వరకు తగ్గుతుందన్నారు.

we should carefull with this heart attack symptoms
Heart Attack : శ్వాస ఆడటం లేదా..!
ప్రతిసారీ మెట్లు ఎక్కిన అనంతరం లేదా కాసేపు నడిచిన తర్వాత శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ప్రారంభమైతే అది గుండెలో ఏదో సమస్య ఉన్నట్లని వైద్యులు అంటున్నారు. ఇది గుండెపోటు ప్రారంభ లక్షణంమంటూ.. కాబట్టి దానిపై శ్రద్ధ వహించి సమస్య తీవ్రం కాకముందే జాగ్రత్త పడాలని సూచిస్తున్నారు.
Heart Attack : గుండె పోటుకు ఇవీ ప్రధాన కారణాలు..:
ఒత్తిడి, శారీరక శ్రమ లేకపోవడం, మానసిక ఆందోళన, మారిన ఆహారపు అలవాట్లు, ధూమపానం, మధ్యపానం అతిగా సేవించే వారితో పాటు ఘగర్, బీపీ, స్థూల కాయం ఉన్న వారిలో ఈ జబ్బు అధికంగా వచ్చే అవకాశం ఉందని వైద్యులు అంటున్నారు. వ్యాయామం కానీ, అతి డైటింగ్ ,నిద్ర పోవడం వంటి కార్యకలాపాలను పరిమితంగానే చేయాలని సూచిస్తున్నారు. వీటి వల్ల జాగ్రత్త వహించకపోతే … పెను ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.