Weaight Losse : ఈ అలవాట్లను పాటించండి.. ఈజీగా బరువు తగ్గుతారు.. | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Weaight Losse  : ఈ అలవాట్లను పాటించండి.. ఈజీగా బరువు తగ్గుతారు..

Weaight Losse  : అనేక మందిని పట్టిపీడిస్తున్న సమస్య అధిక బరువు. ఈ సమస్యతో చాలామంది ఇబ్బంది పడిపోతున్నారు.. ఈ సమస్య నుంచి బయటపడడం కోసం ఎన్నో రకాల ప్రయత్నాలు చేసి చేసి అలసిపోతున్నారే తప్ప.. ఎటువంటి రిజల్ట్ దొరకడం లేదు.. అయితే అధిక బరువు తగ్గాలనుకునేవారు జీవనశైలిలో కొన్ని అలవాట్లను మార్చుకోవాలి అని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. బరువు ఈజీగా తగ్గాలనుకుంటే ఈ అలవాట్లను తప్పకుండా మార్చుకోవాలి. ఉదయం లేవగానే ఈ అలవాటుల్ని పాటించడం వలన […]

 Authored By ramu | The Telugu News | Updated on :5 April 2024,7:00 am

ప్రధానాంశాలు:

  •  Weaight Losse  : ఈ అలవాట్లను పాటించండి.. ఈజీగా బరువు తగ్గుతారు..

  •  ఈ సమస్య నుంచి బయటపడడం కోసం ఎన్నో రకాల ప్రయత్నాలు చేసి చేసి అలసిపోతున్నారే తప్ప.. ఎటువంటి రిజల్ట్ దొరకడం లేదు..

Weaight Losse  : అనేక మందిని పట్టిపీడిస్తున్న సమస్య అధిక బరువు. ఈ సమస్యతో చాలామంది ఇబ్బంది పడిపోతున్నారు.. ఈ సమస్య నుంచి బయటపడడం కోసం ఎన్నో రకాల ప్రయత్నాలు చేసి చేసి అలసిపోతున్నారే తప్ప.. ఎటువంటి రిజల్ట్ దొరకడం లేదు.. అయితే అధిక బరువు తగ్గాలనుకునేవారు జీవనశైలిలో కొన్ని అలవాట్లను మార్చుకోవాలి అని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. బరువు ఈజీగా తగ్గాలనుకుంటే ఈ అలవాట్లను తప్పకుండా మార్చుకోవాలి. ఉదయం లేవగానే ఈ అలవాటుల్ని పాటించడం వలన ఫాస్ట్ గా బరువు తగ్గుతారని నిపుణులు చెప్తున్నారు.

ప్రతినిత్యం నిద్రలేచిన వెంటనే పళ్ళు తోముకోకుండానే ఒక గ్లాసు నీళ్లు తాగడం అలవాటుగా మార్చుకోవాలి. పరిగడుపున ఒక గ్లాసు నీళ్లు తాగడం వల్ల ఇది జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇది బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఉదయం పూట ఆరోగ్యకరమైన ఆహారాన్ని బ్రేక్ ఫాస్ట్ లో తీసుకోవాలి. నూనెలో ముంచి తీసిన పదార్థాన్ని మానుకోవాలి. బరువు కంట్రోల్లో ఉంచే పోషకాలు సమృద్ధిగా ఉండే ఆరోగ్యకరమైన ఆహారాన్ని మాత్రమే తీసుకోవడం అలవాటుగా చేసుకోవాలి. మంచి ఆహారపలవాట్లు క్రమశిక్షణతో కూడిన జీవన విధానం మిమ్మల్ని బరువు తగ్గేలా చేస్తాయి. ఇక అలవాట్లు మన జీవితంలో ఒక భాగంగా మార్చుకుంటే బరువు ఈజీగా తగ్గొచ్చు.. ఆరోగ్యంగా జీవించవచ్చు.. అంతేకాకుండా ప్రతిరోజు ఉదయం లేచిన తర్వాత యోగా చేయడం అలవాటుగా మార్చుకోవాలి. యోగ కారణంగా మానసిక ఆరోగ్యం మెరుగుపరడమే కాకుండా బరువు కూడా తగ్గుతారు.

ఉదయం నిద్ర లేచిన వెంటనే మార్నింగ్ వాక్ చేయడం అలవాటు చేసుకున్న వారు బరువు త్వరగా తగ్గే అవకాశాలుంటాయి. అదేవిధంగా ప్రతిరోజు ఉదయం నడవడం వల్ల శరీరంలో క్యాలరీలు ఖర్చు అవుతాయి. దీంతో పాటు సంతోషకర హార్మోన్ల ఉత్పత్తి జరుగుతుంది.ప్రతినిత్యం నిద్రలేచిన తర్వాత వ్యాయామం చేయడం అలవాటు చేసుకోండి. దీంతో పాటు ఊబకాయం సమస్య నుంచి ఉపశమనం పొందే అవకాశం ఉంటుంది.. మీ జీవన విధానంలో ఇలాంటి అలవాట్లు చేసుకుంటే ఎలాంటి అనారోగ్య సమస్యలు మీ దరిచేరవు. బరువు తగ్గాలనుకునేవారు సింపుల్ గా బరువు తగ్గుతారు..

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది