Weight Loss Drinks : ఈ డ్రింక్స్ తో ఒంట్లో కొవ్వుకు ఈజీగా చెక్ పెట్టొచ్చు… ఎలా చేయాలంటే…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Weight Loss Drinks : ఈ డ్రింక్స్ తో ఒంట్లో కొవ్వుకు ఈజీగా చెక్ పెట్టొచ్చు… ఎలా చేయాలంటే…!

Weight Loss Drinks : ప్రస్తుత కాలంలో మనం ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నాం. ఈ సమస్యలలో ఒకటి అధిక కొవ్వు. మీరు శరీరంలోని అధిక కొవ్వు గురించి ఇకమీదట ఆందోళన చెందాల్సిన అవసరం ఏమాత్రం లేదు. ఎందుకు అంటే. ఈ న్యాచురల్ డ్రింక్స్ తో ఈజీగా వెయిట్ లాస్ అవ్వచ్చు. అయితే మనకు మార్కెట్లో లభించే రసాయన పానీయాలు కాకుండా సహజ సిద్ధమైన పానీయాలను ప్రతినిత్యం కచ్చితంగా తాగాలి. ఇలా చేయటం వలన కొవ్వు తగ్గటంతో పాటు […]

 Authored By ramu | The Telugu News | Updated on :4 August 2024,10:00 am

ప్రధానాంశాలు:

  •  Weight Loss Drinks : ఈ డ్రింక్స్ తో ఒంట్లో కొవ్వుకు ఈజీగా చెక్ పెట్టొచ్చు... ఎలా చేయాలంటే...!

Weight Loss Drinks : ప్రస్తుత కాలంలో మనం ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నాం. ఈ సమస్యలలో ఒకటి అధిక కొవ్వు. మీరు శరీరంలోని అధిక కొవ్వు గురించి ఇకమీదట ఆందోళన చెందాల్సిన అవసరం ఏమాత్రం లేదు. ఎందుకు అంటే. ఈ న్యాచురల్ డ్రింక్స్ తో ఈజీగా వెయిట్ లాస్ అవ్వచ్చు. అయితే మనకు మార్కెట్లో లభించే రసాయన పానీయాలు కాకుండా సహజ సిద్ధమైన పానీయాలను ప్రతినిత్యం కచ్చితంగా తాగాలి. ఇలా చేయటం వలన కొవ్వు తగ్గటంతో పాటు బరువు కూడా కంట్రోల్లో ఉంటుంది. అయితే ఈ ఉసిరిలో విటమిన్ సి అనేది ఎక్కువగా ఉంటుంది. ఇది జీవక్రియకు ఎంతో మేలు చేస్తుంది. అలాగే శరీరంలో అధిక కొవ్వును కరిగించడంలో కూడా ఎంతో మేలు చేస్తుంది. అయితే ఒక గ్లాసు నీటిలో రెండు నుంచి మూడు స్పూన్ల ఉసిరి రసం కలుపుకొని రోజు ఉదయాన్నే పరిగడుపున తాగటం వలన కొవ్వు తగ్గటమే కాక చర్మకాంతి కూడా మెరిసిపోతుంది. అలాగే జుట్టు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. అలాగే నిమ్మకాయలో కూడా విటమిన్ సి అనేది ఎక్కువగా ఉంటుంది. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు అనేవి పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరంలోని జీవక్రియకు కూడా ఎంతో మేలు చేస్తుంది. అయితే ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో సగం నిమ్మకాయ రసాన్ని పిండుకోవాలి. అయితే ఈ నీటిని కనుక మీరు ప్రతి రోజు తీసుకున్నట్లయితే ఏడు రోజుల్లోనే మంచి ఫలితాలను పొందవచ్చు…

కొబ్బరి బోండా నీళ్లలో ఎక్కువ పోషకాలు మరియు చాలా తక్కువ కేలరీలు ఉంటాయి. ఇది బరువు తగ్గటానికి ఎంతో మేలు చేస్తాయి. అలాగే జీవక్రియను పెంచడం వలన శరీర తేమను నిలుపుకోవటానికి ఎక్కువ కొవ్వు కరిగించేందుకు సహాయపడుతుంది. మీరు ప్రతిరోజు ఒక గ్లాసు నీటిని తాగిన మంచి ఫలితం ఉంటుంది. అంతేకాక అల్లం టీ కూడా శరీర ఉష్ణోగ్రత మరియు జీవక్రియ ను పెంచేందుకు సహాయపడుతుంది. మీరు గనక అల్లం టీ ని తాగలేక పోతే కొన్ని అల్లం ముక్కలను వేడినీటిలో వేసి ఒక పది నిమిషాలు వాటిని మరిగించి ఆ నీటిని తీసుకున్న మంచి ఫలితం ఉంటుంది.

Weight Loss Drinks ఈ డ్రింక్స్ తో ఒంట్లో కొవ్వుకు ఈజీగా చెక్ పెట్టొచ్చు ఎలా చేయాలంటే

Weight Loss Drinks : ఈ డ్రింక్స్ తో ఒంట్లో కొవ్వుకు ఈజీగా చెక్ పెట్టొచ్చు… ఎలా చేయాలంటే…!

ఆపిల్ సైడర్ వెనిగర్ లో ఎసిటిక్ యాసిడ్స్ అనేవి పుష్కలంగా ఉంటాయి. ఈ పానీయం అనేది పొట్ట, నడుము కొవ్వూను తగ్గించేందుకు అద్భుతమైన ఔషధం అని చెప్పొచ్చు. అయితే మీరు ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఒక స్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్ మరియు 1 స్పూన్ తేనె కలుపుకొని భోజనానికి ముందు తీసుకుంటే మంచిది. ఇలా చేయటం వల్ల మీ శరీరంలో కొవ్వుని ఇట్టే కరిగిస్తుంది. అలాగే బ్లాక్ కాఫీలో ఎక్కువ కెఫీన్ ఉంటుంది. ఇది శరీర జీవక్రియ రేటు పెంచడానికి మరియు బరువును తగ్గించడానికి కూడా మేలు చేస్తుంది. కానీ షుగర్ లేని బ్లాక్ కాఫీలు మాత్రమే తీసుకోవాలి. అలాగే పంచదార మరియు పాలను అస్సలు కలపకూడదు…

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది