Weight Loss Drinks :ప్రతిరోజు ఉదయం వీటిని తాగారంటే.. మీ అధిక బరువుకి చెక్ పెట్టడం ఖాయం…!
Weight Loss Drinks : రోజుల్లో చాలామంది అధిక బరువుతో అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.. అధిక బరువు అయితే తగ్గించుకోవడానికి చాలా మంది వర్కౌట్ చేస్తున్న వ్యాయామం చేస్తున్న ఫలితం కనిపించడం లేదు అని అంటూ ఉంటారు. ముఖ్యంగా చాలామంది సిజేరియన్స్ తరువాత వచ్చే పొట్టను కానీ డెలివరీ తర్వాత బరువు పెరిగాము బాధపడుతూ ఉంటారు కదా.. అలాంటి వారందరికీ ఈరోజు చెప్పబోయే ఈ డ్రింక్స్ తాగారంటే మీ అధిక బరువుకి చెక్ పెట్టడం ఖాయం.. వీటిని తాగడం వలన అధిక బరువు తగ్గడమే కాకుండా జీర్ణ సమస్యలు కూడా దూరం దూరమవుతాయి.. మరి ఆ డ్రింక్స్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం…
సోంపు డ్రింక్: సోంపు అనేది జీర్ణ సమస్యలకు మంచి ఔషధంలా పనిచేస్తుంది.. ఈ సోంపుని రెండు చెంచాలు తీసుకుని ఒక గ్లాసు నీటిలో రాత్రంతా నానబెట్టి ఆ నీటిని వడకట్టి ఉదయాన్నే తీసుకోవాలి.. ఇలా తీసుకోవడం వలన అధిక బరువు తగ్గడమే కాకుండా జీర్ణ సమస్యలు నుంచి ఉపశమనం కలుగుతుంది..
వాము డ్రింక్: వాము అనేది శరీరంలో జీవక్రియని పెంచడానికి సహాయపడుతుంది. అలాగే మనం తీసుకునే ఆహారంలో పోషకాలను గ్రహించి అనవసరమైన కొవ్వు పెరగకుండా చేస్తుంది.. వాము రెండు చెంచాలు తీసుకొని అర లీటర్ నీటిలో రాత్రి సమయంలో నానబెట్టి ఉదయాన్నే ఆ నీటిని పరిగడుపున తాగినట్లయితే ఈ అధిక బరువు సమస్యకు చెక్ పెట్టవచ్చు…
జీలకర్ర డ్రింక్: జీలకర్రను ఎక్కువగా వంటల్లో వాడుతూ ఉంటాం.. దీనిని వాడడం వలన శరీరంలో జీవక్రియ పెరగడమే కాకుండా అనవసరమైన కొవ్వు ని కూడా కరిగిస్తుంది. జీలకర్ర మన శరీరాన్ని వ్యాధుల నుంచి రక్షిస్తుంది.. అర లీటర్ నీటిలో రెండు చెంచాల జీలకర్రను వేసి రాత్రంతా నానబెట్టి మరునాడు ఆ నీటిని వడకట్టి త్రాగాలి. ఈ విధంగా తాగితే జీర్ణశక్తి పెరగడమే కాకుండా బరువు తగ్గడానికి చాలా బాగా సహాయపడుతుంది..
గ్రీన్ టీ: గ్రీన్ టీ తాగడం వలన శరీరంలో కొవ్వుని కరిగిస్తుంది. ఈ గ్రీన్ టీ తాగడం వలన చాలా లాభాలు ఉన్నాయి. ముఖ్యంగా ది బెస్ట్ డైట్ టి అని చెప్తూ ఉంటారు వైద్య నిపుణులు.. ఈ గ్రీన్ టీ లో యాంటీ ఆక్సిడెంట్ పుష్కలంగా ఉంటుంది. కావున శరీరంలో అధిక బరువు తగ్గించడానికి ఉపయోగపడుతుంది..