Heart Attack : హార్ట్ ఎటాక్ వచ్చినప్పుడు ఫస్ట్ ఎటువంటి జాగ్రత్తలు వహించాలి.? ఇవే ఆ చిట్కాలు…!
Heart Attack : మనం జీవిస్తున్న జీవనశైలి విధానంలో కొన్ని మార్పులు వలన ఎన్నో వ్యాధులు మనకి చుట్టూముడతున్నాయి. అటువంటి వ్యాధులులలో ముఖ్యమైన వ్యాధి గుండె సంబంధించిన వ్యాధి. దీనివలన ఆకస్మిక మరణాలు రోజురోజుకీ ఎక్కువైపోతున్నాయి. కాబట్టి గుండె నొప్పి రాకుండా ఉండడానికి మనదైన జీవన విధానంలో కొన్ని మార్పులు చేసుకోవడం చాలా ముఖ్యం. ఆ విధంగా మార్పులు చేసుకోవడం వలన గుండె నొప్పి లాంటి సమస్యల నుండి మనల్ని మనం కాపాడుకోవచ్చు.
జీవనశైలి విధానములు వయసు తరహా లేకుండా కొన్ని కారణాల వలన ప్రాణాలు పోగొట్టుకోవాల్సి వస్తుంది. చాలామంది ఈ ఎంతో ప్రమాదకరమైన ఈ గుండె నొప్పితో ఇబ్బంది పడడం లాంటివి చూస్తూనే ఉన్నాం ఇటువంటి సమయాలలో గుండెనొప్పి రాకుండా ఉండడానికి మన జీవితంలో కొన్ని మార్పులు చేసుకోవడం చాలా ముఖ్యం. అయితే అవి ధూమపానం, మద్యపానం లాంటి అలవాట్లను వదులుకోవాలి. అదేవిధంగా ఒక మనిషి గుండె నొప్పి వచ్చినప్పుడు ఫస్ట్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రాథమిక చికిత్సలో భాగంగా అప్పటికప్పుడు ఎటువంటి చిట్కాలను పాటించాలో చూద్దాం…
Heart Attack : గుండె నొప్పి వచ్చినప్పుడు మొదటగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే…
*గుండె నొప్పి విషయంలో ఎటువంటి నిర్లక్ష్యం చేయకూడదు.. గుండెపోటు వ్యాధిగ్రస్తుడు ఎక్కువ సమయం వృధా చేయకుండా వెంటనే వైద్య నిపుణులు కలవాలి.
*గుండె నొప్పి వచ్చిన సమయంలో హృదయ స్పందన మందగించవచ్చు లేదా ఆగిపోవచ్చు అలాంటి సమయంలో మీరు వెంటనే చాతిపై నొక్కుతూ బాధితుడు గాలు తీసుకునేలా ప్రయత్నిస్తూ ఉండాలి. దీనినీ సి పి ఆర్ టెక్నిక్ అంటారు. ఈ చిట్కా మూలంగానే ఈ మధ్యకాలంలో చాలామంది ప్రాణాలు ప్రమాదం నుంచి బయటపడ్డాయి.
*అప్పటికప్పుడు వ్యాధిగ్రస్తుడు కోల్కోకపోతే కృత్రిమ శ్వాస అందించాలి. నోటి ,ముక్కు ద్వారా శ్వాస అందించడానికి ప్రయత్నిస్తూ ఉండాలి. ఇది స్వయంగా ఊపిరితిత్తుల్లోకి వెళ్తుంది. ఈ టైం లో రోగి నోటి నుంచి గాలి ఏ విధంగాను బయటికి వెళ్లకుండా జాగ్రత్త పడాలి.
*ఎవరైనా గుండె నొప్పికి గురైతే భయపడకుండా వారికి జాగ్రత్తలు చెప్పడం చాలా ముఖ్యం.
*గుండె నొప్పి విషయంలో వ్యాధిగ్రస్తుని మొదటిగా పడుకోబెట్టి ప్రశాంతంగా ఉంచాలి. అస్పిరిన్ టాబ్లెట్ ను వ్యాధిగ్రస్తుడికి వీలైనంత తొందరగా ఇవ్వాలి. అస్ప్రిన్ అనే టాబ్లెట్ బ్లడ్ గడ్డ కట్టడాన్ని నిరోధిస్తుంది. దీనివలన మరణాల సంఖ్యను తగ్గించుకోవచ్చని డాక్టర్లు సలహా ఇస్తున్నారు.
గుండె ఆరోగ్యంగా ఉండడం కోసం ఈ విధంగా చేయండి…
*బిజీ లైఫ్ వల్ల మనసు శరీరం రెండు ఒత్తిడికి గురవుతున్నారు కావున 20 నిమిషాలు యోగాను, వ్యాయామం రోజువారి దినచర్యలో భాగం చేసుకోండి.
*మీరు మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవాలి అంటే తక్కువ చక్కెరను తీసుకోండి. అలాగే ఉప్పు వలన ఎన్నో సమస్యలు వస్తున్నాయి కావున ఇది రక్తపోటు ప్రమాదాన్ని పెంచి అవకాశం ఉంటుంది.
*ఇక జీవనశైలిలోని అవసరమైన మార్పులు చేసుకోవాలి. ధూమపానానికి, మద్యపానానికి పూర్తిగా బాయ్ బాయ్ చెప్పేయండి.