Health Tip : మీరు చికెన్, మటన్ ఎక్కువగా తింటారా.. సైడ్ ఎఫెక్ట్ రావొద్దంటే ఈ ఆకు తినాల్సిందే | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Health Tip : మీరు చికెన్, మటన్ ఎక్కువగా తింటారా.. సైడ్ ఎఫెక్ట్ రావొద్దంటే ఈ ఆకు తినాల్సిందే

 Authored By pavan | The Telugu News | Updated on :22 May 2022,3:30 pm

Health Tip : కొంత మందికి నాన్ వెజ్ అనగానే ప్రాణం ఇస్తారు. ముక్క లేనిదే బుక్క దిగదు అని అంటారు. రోజూ మూడు పూటలా తింటారనుకుంటే ప్రతి పూట నాన్ వెజ్ ఉండాల్సిందే. ఇలా చికెన్, మటన్ రోజూ తినే వారి శరీరంలో హోమోసిస్టీన్ అనేది బాగా పెరుగుతుందని వైద్యులు చెబుతుంటారు. నిత్యం చికెన్, మటన్ తినడం వల్ల శరీరంలో కొవ్వు పరిమాణం ఎక్కువ అవుతుంది. అలాగే ఎమైనో యాసిడ్, హోమోసిస్టీన్ విపరీతంగా పెరిగి పోవడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. శరీరంలో ఎక్కువగా పెరిగే హోమోసిస్టీన్ ను తగ్గించకపోతే అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. క్రమంగా జీర్ణక్రియ దెబ్బ తింటుంది. నాన్ వెజ్ జీర్ణం కావడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది. గ్యాప్ ఇవ్వకుండా అలా తింటూ పోతే జీర్ణక్రియపై తీవ్ర ప్రభావం పడుతుంది. అయితే ఆ సమస్యల నుండి బయట పడేందుకు ఈ ఆకులతో చేసిన కూర చక్కగా పనిచేస్తుంది.

what will happen if you eat chicken and mutton everyday and take this leaf to cure

what will happen if you eat chicken and mutton everyday and take this leaf to cure

బచ్చలకూర చాలా మందికి తెలిసే ఉంటుంది. అయితే అతి కొద్ది మంది మాత్రమే బచ్చల కూరను ఇష్టంగా తింటారు. మరి కొందరైతే బచ్చలకూర పేరు వినగానే పారిపోతారు. ఈ బచ్చలకూర సీజన్ తో సంబంధం లేకుండా ఎప్పుడంటే అప్పుడు దొరుకుతుంది. ఇది చాలా చౌక కూడా. వీటిలో ఉండే 104 మైక్రో గ్రామ్స్ ఫోలేట్ అనేది ఈ హోమోసిస్టీన్ ను అడ్డుకుని ప్రోటీన్ గా మారుస్తుంది. అలా ప్రోటీన్ గా మార్చి శరీరం నుండి బయటకు పంపిస్తుంది. ఇతర దేశాల వారు నాన్ వెజ్ ను రెండు పూటలా తింటారు. కానీ వారికి ఈ సమస్య చాలా తక్కువగానే తలెత్తుతుంది. వాళ్లకి గుండె సంబంధింత వ్యాధులు తక్కువగా వస్తుంటాయి. ఆహారం సలాడ్స్ ఎక్కువగా తీసుకోవడం వల్లే ఇలా అవుతుంది. ఆకు కూరలను స్టీమ్ చేసేసి శాండ్విచ్ లో వాటిలో ఎక్కువగా వాడతారు.

విదేశీయులు ఎక్కువగా సలాడ్స్ లో ఆకు కూరలను తీసుకుంటూ ఉంటారు. ఇలా ఆకులతో తయారు చేసే జ్యూసులను ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. ఇలాంటి నేచురల్ డైట్ ఎక్కువగా వాడటం వల్ల నాన్ వెజ్ ల సైడ్ ఎఫెక్ట్స్ నుండి వాళ్లు తప్పించుకుంటారు. మన దేశంలో ఆకు కూరలు, పండ్లను చాలా తక్కువగానే తీసుకుంటారు. మన వాళ్లు ఆరోగ్యం కంటే కూడా రుచికే ఎక్కువగా ప్రాధాన్యమిస్తారు. అలాగే పండ్లను తీసుకోవడం చాలా చాలా తక్కువ. ఫ్రూట్ జ్యూస్ లు, సలాడ్స్ కొనేందుకు, తయారు చేసుకునేందుకు ఎక్కువ మొత్తం ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అదే బచ్చల కూర అయితే తక్కువ ధరలో వస్తుంది. అవి ఇచ్చే ప్రయోజనాలు దీనితో అందుతాయి.

pavan

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది