Weight Loss : గోధుమ చపాతీనా లేక మల్టీగ్రెయిన్ చపాతీనా? ఏది తింటే బరువు త్వరగా తగ్గుతారో తెలుసా?
Weight Loss : చాలామంది బరువు తగ్గడం కోసం ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కొందరు తమ ఫుడ్ అలవాట్లను మార్చుకుంటారు. కొందరైతే బరువు తగ్గడం కోసం అన్నం తినడం మానేస్తారు. నాన్ వెజ్ తినరు. కొవ్వు పదార్థాలకు దూరంగా ఉంటారు. ఇలా ఎన్నో రకాలుగా కష్టపడి బరువు తగ్గేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు.అయితే.. బరువు తగ్గడం కోసం అన్నం మానేసి చాలామంది చపాతీలు తింటుంటారు. చపాతీలలో చాలారకాలు ఉంటాయి. కాకపోతే ఏ చపాతీ తింటే బరువు తగ్గుతామో ముందు తెలుసుకోవాలి. బరువు తగ్గేందుకు గోధుమ రోటీ లేదా మల్టీగ్రెయిన్ రోటీని తింటుంటారు.
రెండింట్లో ఏది మంచిదో చాలామందికి తెలియదు. గోధుమ రొట్టె తినాలా లేక.. మల్టీగ్రెయిన్ రొట్టె తినాలా అని అనుకునేవాళ్లు తెలుసుకోవాల్సింది ఏంటంటే.. మల్టీగ్రెయిన్ రోటీ అంటే.. చాలా రకాల ధాన్యాలతో చేసిన రోటీ. అందులో తృణ ధాన్యాలు కూడా ఉంటాయి. రకరకాల ధాన్యాలు ఉంటాయి కాబట్టి వీటిలో ఎక్కువ ఫైబర్ ఉంటుంది. కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉంటాయి. అందువల్ల.. త్వరగా బరువు తగ్గొచ్చు.గోధుమ రొట్టె కన్నా.. మల్టీగ్రెయిన్ రొట్టెలు శరీరానికి బలాన్ని ఇస్తాయి.
Weight Loss : గోధుమ రొట్టె తింటే ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయి?
జీర్ణవ్యవస్థ కూడా బాగుంటుంది. అదే.. గోధుమ రొట్టెలు అంటే కేవలం గోధుమ పిండితోనే చేసే రొట్టెలు అవి.గోధుమ రొట్టెలు కేవలం బరువు తగ్గడానికి ఉపయోగపడతాయి కానీ.. మల్టీగ్రెయిన్ రొట్టెలు మాత్రం బరువు తగ్గడంతో పాటు.. ఇతర ఆరోగ్య సమస్యలకు అవి చెక్ పెడతాయి. అందుకే.. బరువు తగ్గాలనుకునే వాళ్లు గోధుమ రొట్టెలను తినొచ్చు.. మల్టీగ్రెయిన్ రొట్టెలను కూడా తినొచ్చు.