
children-get-migraine-in-early-age-how-to-overcome-migraine
Migraine : అసలు మైగ్రేన్ అంటే ఏంటి? మన భాషలో చెప్పాలంటే అదో రకమైన తలనొప్పి. అదో రకం అని ఎందుకు అనాల్సి వచ్చింది అంటే.. సాధారణంగా వచ్చే తలనొప్పులు వేరు. దూర ప్రయాణాలు చేసినప్పుడు.. అలసిపోయినప్పుడు.. ఎక్కువ పని చేసినప్పుడు.. ఒత్తిడి పెరిగినప్పుడు.. వచ్చే తలనొప్పి వేరు. జస్ట్ ఒక చాయ్ తాగితే తలనొప్పి పోతుంది. లేదంటే.. ఓ ట్యాబ్లెట్ వేసుకుంటే పోతుంది. కానీ.. మైగ్రేన్ అనేది కేవలం తలనొప్పి మాత్రమే కాదు. ఏదో చాయ్ తాగితేనో.. లేక ట్యాబ్లెట్ వేసుకుంటేనో పోయేది కాదు. అది జీవిత కాలం మనిషిని వేధించే సమస్య. అందుకే.. మైగ్రేన్ తో బాధపడేవాళ్లు ఎప్పుడూ ఒత్తిడికి లోనవుతూనే ఉంటారు. ఎప్పుడూ తలను పట్టుకొని కూర్చుంటారు.
నిజానికి మైగ్రేన్ అనేది పెద్దలకే వచ్చే సమస్య మాత్రమే కాదు. చిన్నపిల్లల్లోనూ ఈ మధ్య మైగ్రేన్ సమస్య వస్తోంది. దీనివల్ల పిల్లలు తలనొప్పిని తట్టుకోలేక.. చదువు మీద దృష్టి పెట్టలేక నరకం అనుభవిస్తున్నారు. అసలు.. చిన్నపిల్లల్లో అంత తొందరగా.. చిన్న వయసులోనే ఎందుకు మైగ్రేన్ వస్తుంది. చిన్న వయసులోనే మైగ్రేన్ వస్తే వచ్చే సమస్యలు ఏంటి.. దాన్ని ఎలా తరిమికొట్టాలి? అనే విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
అయితే.. చిన్నపిల్లల్లో చిన్న వయసులోనే మైగ్రేన్ రావడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. వంశపారపర్యంగా కొందరికి మైగ్రేన్ వస్తే.. ఇంకొందరికి.. వాతావరణంలో చోటు చేసుకునే మార్పుల వల్ల కూడా వస్తుంది. అలాగే.. పిల్లలు సరిగ్గా నిద్రపోకున్నా.. నిద్రపోయే సమయాలు మారుతున్నా.. ఈ సమస్య వచ్చే అవకాశం ఉంది.
నిద్ర అనేది మనిషికి ఎంత అవసరమో అందరికీ తెలుసు. చిన్నపిల్లలు రోజుకు కనీసం 10 గంటలు నిద్రపోవాలి. అప్పుడే వాళ్ల మెదడు సరిగ్గా అభివృద్ధి చెందుతుంది. పిల్లల్లో నిద్రకు సంబంధించిన సమస్యలు ఉత్పన్నమయ్యాయంటే అది ఖచ్చితంగా మైగ్రేన్ కు దారి తీస్తుంది.
children-get-migraine-in-early-age-how-to-overcome-migraine
పిల్లలకు సరైన నిద్ర ఉండాలంటే.. సెల్ ఫోన్స్, టీవీ, మ్యూజిక్ లాంటి వాటికి దూరంగా ఉంచి.. సరైన నిద్రను అందించగలిగితే.. భవిష్యత్తులో మైగ్రేన్ సమస్య వచ్చే ప్రమాదం ఉండదు. అలాగే.. మైగ్రేన్ తో బాధపడే పిల్లలు కూడా నెమ్మదిగా ఆ సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంది.
పిల్లలను ఎక్కువ ఒత్తిడికి లోనవకుండా చూసుకోవాలి. పిల్లలైనా.. పెద్దలైనా.. ఒత్తిడికి లోనయితే మైగ్రేన్ వచ్చే ప్రమాదం ఉంటుంది. అందుకే.. వీలైనంత ప్రశాంతంగా పిల్లలు ఉండేలా చూసుకోవాలి. వాళ్ల మీద చదువు ఒత్తిడిని కూడా పెంచకూడదు.
ఒక్కోసారి వాతావరణంలో సంభవించే మార్పుల వల్ల కూడా పిల్లలకు మైగ్రేన్ వచ్చే ప్రమాదం ఉంది. అతి వేడి, తేమ, డీ హైడ్రేషన్ లాంటి వాటి వల్ల పిల్లల్లో మైగ్రేన్ వస్తుంది. ఒకవేళ వాతావరణంలో అటువంటి మార్పులు చోటు చేసుకుంటే కనుక.. పిల్లలను ఆ వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఉండేలా మార్చుకోవాలి.
ఇక.. అతిముఖ్యమైనది.. ఆహారం. పిల్లలకు ఎంత మంచి పౌష్ఠికాహారం ఇస్తే.. అంత బెటర్. పిల్లలకు జంక్ ఫుడ్ అలవాటు చేయకుండా.. మంచి పోషకాలు ఉన్న ఆహారాన్ని, పండ్లు, కూరగాయలు, పీచు ఎక్కువగా ఉన్న పదార్థాలను రోజువారి ఆహారంలో భాగం చేస్తే వాళ్లకు ఎటువంటి మైగ్రేన్ సమస్యలు రావు. ఒకవేళ ఉన్నా ఇదే ఫుడ్ హాబిట్ ను అలవాటు చేస్తే తొందరలోనే మైగ్రేన్ సమస్య నుంచి పిల్లలను తప్పించవచ్చు.
పిల్లలకు ఎక్కువగా ట్యాబ్లెట్లు వేయకూడదు. అతిగా మెడిసిన్స్ వాడినా.. అది మైగ్రేన్ కు దారితీయొచ్చు. అందుకే.. డాక్టర్లు మెడిసిన్ ఇచ్చినా కూడా కొన్నిసార్లు తక్కువ మెడిసిన్స్ ఇచ్చి.. ఇంటి చిట్కాలను పాటించి పిల్లల జబ్బులను నయం చేయవచ్చు.
ఉదాహరణకు.. పిల్లలకు జలుబు చేస్తే వెంటనే డాక్టర్ దగ్గరికి పరిగెత్తుకెళ్లి.. ట్యాబ్లెట్లు తీసుకొచ్చి పిల్లలకు వేయకండి. జలుబు అనేది పిల్లలకు సర్వసాధారణం. దాన్ని ఇంటి చిట్కాలతో నయం చేయవచ్చు. డాక్టర్ దగ్గరికి అవసరం లేనప్పుడు వెళ్లకుండా.. వీలైనంత మెడిసిన్ తగ్గిస్తే.. పిల్లల్లో మైగ్రేన్ సమస్యను కొంతమేరకు తగ్గించవచ్చు.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.